How Make Cake: కేక్‌ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం ఎలా? క్రిస్మ‌స్ కేక్‌, బ‌ట‌ర్ స్కాచ్ కేక్‌, ఆరెంజ్ ఫ్రూట్ కేక్ తయారీ

How Make Cake | కేక్ అంటే ఎవ‌రి ఇష్టం ఉండ‌దు. అంద‌రికీ ఇష్ట‌మే క‌దా!. ముఖ్యంగా చిన్న పిల్ల‌లు అయితే బ‌ర్త్‌డే ఎప్పుడు వ‌స్తుందా? Cake ఎప్పుడు క‌ట్ చేయాలా? అని ఆరాడ‌ప‌డుతుంటారు. అదే విధంగా ప్ర‌తి ఒక్క‌రూ కేక్‌ను ఇష్టంగా తింటుంటారు. అన్ని శుభ‌కార్యాల్లో పండుగ‌ల వేళ‌ళ్లో కేక్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే. కాబ‌ట్టి కేక్‌ల‌ను మ‌నం ఇళ్ల‌లో త‌యారు చేసుకోవ‌డం కొంత మందికి తెలియ‌దు. అలాంటి వారికి కేక్‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకోవాల‌ని చూస్తుంటారు. వారి కోస‌మే కింద కొన్ని ర‌కాల కేక్‌లు త‌యారీ విధానాల‌ను అంద‌జేస్తున్నాము. వాటి ఆధారంగా జాగ్ర‌త్త‌గా కేక్‌ల‌ను త‌యారు చేయ‌డం
నేర్చుకోవ‌చ్చు.

christmas Plum cake త‌యారీ విధానం!

కావాల్సిన ప‌దార్థాలు

వెన్న: 1000 గ్రాములు
చ‌క్కెర: 100 గ్రాములు
మైదా: 100 గ్రాములు
ర‌మ్: మూడు చెంచాలు
కాజు: కొద్దిగా
కిస్మిస్‌: కొన్ని
కొబ్బ‌రి పౌడ‌ర్‌: చెంచాడు

How Make Cake: త‌యారు చేసే ప‌ద్ధ‌తి

ఒక చిన్న గిన్నెలో మూడు చెంచాల ర‌మ్ వేసుకుని అందులో కాజు, కిస్మిస్‌ల‌ను నాలుగు గంట‌లు నాన‌బెట్టాలి. మ‌రొక గిన్నెలో వెన్న‌, చ‌క్కెర బాగా క‌ల‌గ‌లిసేలా క‌ల‌పాలి. ఎటువంటి ముద్ద‌లు లేకుండా క‌లుపుకుని ఒక కేక్ బేసిన్ తీసుకొని, దాని అంచుకు మైదా, నూనె రాయాలి. త‌ర్వాత ఇంత‌కు ముందు చేసిన మిశ్ర‌మాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. త‌ర్వాత Microwaveలో అర‌గంట పాటు మీడియం హీట్‌లో కేక్ మ‌ధ్య భాగం వేగే వ‌ర‌కూ ఉంచి తీయాలి. త‌ర్వాత చాకొలెట్ సిర‌ప్ కానీ, Cherries కానీ కేక్ మీద అలంక‌రించుకోండి. ఇంకేం! ఎంతో ఊరించే క్రిస్మ‌స్ ప్ల‌మ్ కేక్ త‌యార్‌!

butterscotch కేక్ త‌యారీ!

కావాల్సిన ప‌దార్థాలు

మైదాపిండి: 100 గ్రాములు,
వెన్న‌: 100 గ్రాములు,
పంచ‌దార పొడి: 100 గ్రాములు
కోడిగుడ్లు: రెండు లేఆ మూడు,
బేకింగ్ పౌడ‌ర్‌: ఒక టీ స్పూన్
వంట సోడా: అర టీ స్పూన్‌
పాల‌పొడి: రెండు టేబుల్ స్పూన్లు,
బ‌ట‌ర్ స్కాచ్ ఎసెన్స్‌: ఒక టీ స్పూన్‌
లెమ‌న్ ఎల్లో ఫుడ్ క‌ల‌ర్‌: త‌గినంత‌

ఐసింగ్ కోసం

వెన్న‌: 100గ్రాం, ఐసింగ్ షుగ‌ర్ : 200 గ్రాములు, Lemon Yellow క‌ల‌ర్‌: కొన్ని చుక్క‌లు, బ‌ట‌ర్ స్కాచ్ కాండీస్ : అర క‌ప్పు, వేడి నీరు: కొద్దిగీ,

త‌యారు చేసే విధానం: ఒక పాత్ర‌లో కొంత మైదాపిండి, Baking Powder, వంట సోడా, పాల‌పొడి, వెన్న‌, పంచ‌దార వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని మిక్సీలో వేసి గిల‌కొట్టాలి. మ‌రీ ప‌ల‌చ‌గా అనిపిస్తే మైదాపిండిని కొద్ది కొద్దిగీ చేర్చుతూ మ‌ళ్లీ మిక్సీలో గిల‌కొట్టాలి. త‌రువాత ఎల‌క్ట్రిక్ Ovenలోని గిన్నెలో కొద్దిగా డాల్టా రాసి, ఈ మిశ్ర‌మాన్ని ఆ గిన్నెలో పోసీ 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద 40-50 నిమిషాలు బేక్ చేయాలి. బేకింగ్ పూర్త‌యి చ‌ల్లారాక కేక్‌పైన ఐసింగ్ చేయాలి.

ఐసింగ్ ఇలా: వెన్న‌, Icing షుగ‌ర్‌ల‌ను ఒక పాత్ర‌లో వేసి నురుగు వ‌చ్చేంత వ‌ర‌కూ గిల‌కొట్టాలి. దీనికి ఎసెన్స్‌, ఫుడ్ క‌ల‌ర్‌, కొద్దిగా వేడినీరు చేర్చి మ‌ళ్లీ గిలకొట్టాలి. ఈ మిశ్ర‌మాన్ని కేక్‌పైన ప‌ల్చ‌గా పోసి బ‌ట‌ర్ నైఫ్ స‌హాయంతో కేక్ అంత‌టా స‌మంగా స‌ర్ధాలి. ఆపైన బ‌ట‌ర్‌స్కాచ్ క్యాండీస్‌తో అలంక‌రించాలి.

orange fruit cake త‌యారీ!

కావాల్సిన ప‌దార్థాలు

మైదాపిండి: 100 గ్రా, వెన్న‌: 100 గ్రా,పంచ‌దార పొడి-100 గ్రా, చెర్రీస్‌, కిస్‌మిస్‌, టూటీ ఫ్రూటీ ముక్క‌లు: 100 గ్రా, కోడిగుడ్లు: రెండు, బేకింగ్ పౌడ‌ర్‌: ఒక టీ స్పూన్‌, వంట సోడా: అర టీ స్పూన్‌, పాల‌పొడి: రెండు టేబుల్ స్పూన్లు, ఆరెంజ్ ఎసెన్స్‌: ఒక టీ స్పూన్‌, క‌మ‌లాపండు తొన‌లు: అర టీ స్పూన్‌, ఆరెంజ్ ఫుడ్ క‌ల‌ర్: కొన్ని చుక్క‌లు.

త‌యారు చేసే విధానం:

మైదా పిండి, బేకింగ్ పౌడ‌ర్‌, Baking Soda, పాల‌పొడి, వెన్న‌, పంచ‌దార మిక్సీలో వేసి బాగా గిల‌కొట్టాలి. దీనికి కోడిగుడ్లు సొన‌, ఆరెంజ్ ఎసెన్స్‌, Food Color చేర్చి మ‌ళ్లీ ఒక‌సారి మిక్సీలో గిల‌కొట్టాలి. ఒక వేళ పిండి మిశ్ర‌మాన్ని ప‌ల‌చ‌గా ఉండే మైదాపిండిని కొద్దికొద్దిగీ చేర్చుతూ గిల‌కొడుతూ పోవాలి. ఇందులో కిస్‌మిస్‌, చెర్రీ, టూటీఫ్రూటీ ముక్క‌లు, క‌మ‌లాపండు తొన‌ల ముక్క‌లు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత కేక్ త‌యారు చేసే పాత్ర‌లో కొద్దిగీ డాల్టా రాసి, ఈ మిశ్ర‌మాన్ని ఆ గిన్నెలో పోసి దాన్ని ఎల‌క్ట్రిక్ ఓవెన్‌లో ఉంచి, 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద 40-50 నిమిషాలు బేక్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *