World Cybersecurity: సైబర్ భద్రత ప్రమాణాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పదో దేశంగా భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) రూపొందించి 2021 జూన్ 29న విడుదల చేసిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ (జీసీఐ) – 2020లో 37 స్థానాలు మెరుగుపరుచుకుని భారత్ టాప్ -10లోకి వెళ్లింది. 2019 సంవత్సరంలో 47వ స్థానానికి పరిమితమైంది.
ప్రపంచంలోనే ఐటీ సూపర్ పవర్‌గా భారత్ మారుతున్న ఈ తరుణంలో డేటా గోప్యత, పౌరుల ఆన్లైన్ హక్కులకు బలమైన చర్యలు చేపట్టడం ద్వారా తన డిజిటల్ సార్వభౌమత్వాన్ని(World Cybersecurity) కాపాడుకుంటోంది.
ఐటియూ విడుదల చేసిన జాబితా ప్రకారం..
అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. బ్రిటన్, సౌదీ అరేబియాలు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. మూడో స్థానంలో ఈస్తోనియా కనిపించింది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ నాల్గో స్థానంలో నిలవడంతో సైబర్ భద్రతకు తాను ఎంతగా కట్టుబడి ఉందో నిరూపించుకున్నట్లయింది.
సైబర్ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో భారత్ గణనీయమైన మార్పును సాధించింది. మొత్తం 100 పాయింట్లకు గాను 97.5 పాయింట్లు పొంది ప్రపంచంలోనే పదో స్థానంలో నిలిచింది.


ర్యాంకులు ఆధారంగా..
న్యాయ, సాంకేతికత, సంస్థాగత చర్యలతో పాటు, సామర్థ్య అభివృద్ధి సహకారం అనే మొత్తం 5 ప్రమాణాల పనితీరు ఆధారంగా జీసీఐ ఆ ర్యాంకులను ఇచ్చింది. ఈ అయిదు అంశాల్లో అన్ని దేశాల పనితీరును ఒక ప్రశ్నావళి ఆధారిత ఆన్లైన్ సర్వే ద్వారా మదింపు చేసింది. నిపుణులతో లోతైన చర్చల అనంతరం మొత్తం ర్యాంకులను ప్రకటించింది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!