Intelligent People

Intelligent People : తెలివైన స్టూడెంట్ ఎలా చ‌దువుతాడు? సాధార‌ణ స్టూడెంట్ ఎలా చ‌దువుతాడు?

motivation-Telugu

Intelligent People : ఈ ప్ర‌పంచంలో తెలివి ఉన్న వాడే అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. అది చ‌దువులో కానీ, ఉద్యోగంలో కానీ, జీవితంలో కానీ తెలివితేట‌లే ముఖ్య‌మ‌ని నిరూపిస్తున్నారు. అంద‌రికీ ఒకే మైండ్ సెట్ ఉన్న‌ప్ప‌టీకీ కొంద‌రు మాత్ర‌మే చ‌దువులో ఫ‌స్ట్ ర్యాంక్ సాధిస్తూ త‌మ తెలివిని మ‌రింత మెరుగు ప‌ర్చుకుంటున్నారు. మ‌రీ సాధార‌ణ విద్యార్థుల ప‌రిస్థితి ఏమిటి? ఏం చేయాలి?


Intelligent People : మామూలు స్టూడెంట్‌కు, తెలివైన స్టూడెంట్‌కు చాలా తేడా ఉంటుంది. మామూలు స్టూడెంట్ ఒక ప‌ద్ధ‌తీ పాడు లేకుండా చ‌దువుతాడు. తెలివైన స్టూడెంట్ ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం చ‌దువుతాడు. ముఖ్యంగా మామూలుగా చ‌దివే విద్యార్థులు తెలివైన విద్యార్థుల్లా చ‌ద‌వాలంటే ఏం చేయాలి. తెలివైన విద్యార్థులు ఏ ప్లాన్ అనుస‌రిస్తున్నారు. వారే ఎందుకు ఉత్తీర్ణులుగా ఫ‌స్ట్‌క్లాస్‌లోపాస్ అవుతున్నారు? ఈ మిస్ట‌రీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం?.ఇప్పుడు చెప్ప‌బోయే 7 ప‌ద్ధ‌త‌లు గ‌మ‌నించండి. ఈ ప‌ద్ధ‌తుల‌ను మైండ్‌సెట్‌లో పెట్టుకుని ముందుకు సాగండి.

  1. They Use Spaced Repetition
  2. They Use Smart Goals
  3. They Teach Others
  4. They Follow A Routine
  5. They Take Short Breaks
  6. They Believe in Progress
  7. They Have A Growth Mindset

They Use Spaced Repetition

మ‌నం ఏదైనా విష‌యాన్ని చ‌ద‌వినా, తెలుసుకున్నా అది కొన్ని రోజులు మాత్ర‌మే మ‌న మైండ్‌లో ఉంటుంది. కొద్దికొద్దిగా వేరే స‌మాచారం మైండ్‌లోకి వ‌చ్చే కొద్ది పాత స‌మాచారం కొంచెం కొంచెం బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. కాబ‌ట్టి కొత్త స‌మాచారం తెలుసుకున్న‌ప్పుడో, చ‌ద‌విన‌ప్పుడో మ‌న మైండ్‌లో ఉన్న పాత స‌మాచారం బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా దానిని అప్పుడ‌ప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. లేక‌పోతే అప్పుడ‌ప్పుడు దానిని చ‌దువుతూ ఉండాలి. ఒక ప‌ద్ధ‌తి ద్వారా ఏదైనా స‌మాచారాన్ని ప‌దేప‌దే తెలుసుకుంటూ దానికి సంబంధించిన స‌బ్జెక్టుల‌ను చ‌దివిన‌ప్పుడు అతి కొన్ని రోజుల‌కు మ‌న మైండ్‌లో ఒక ఫోల్డ‌ర్‌గా నిలిచిపోతుంది.

They Use Smart Goals

తెలివైన వాళ్ల‌కు ప్ర‌ధానంగా ఉండే అల‌వాటు రీడింగ్‌. అదే నిత్యం చ‌దువుతూ ఉండ‌టం. ఎక్కువుగా స‌క్సెస్‌, ఇంటలిజెంట్స్ పీపుల్స్ నార్మ‌ల్ మైండ్ సెట్ ఉన్న‌వారే. అయితే వారు అనుకున్న గోల్‌ను ఎలా చేరుకోవాలి, సాధించుకోవాల‌నే ఆలోచ‌న‌లోనే వారు ఫోక‌స్ పెడ‌తారు. ఉదాహ‌ర‌ణ‌కు.. 300 పేజీల పుస్త‌కాన్ని మిమ్మ‌ల్ని చ‌ద‌వ‌మ‌ని అడిగితే మీ స‌మాధానం ఎలా ఉంటుంది. మీదే కాదు నాది కూడా అమ్మో అనే భ‌య‌మే ఉంటుంది. కానీ ఆ పుస్త‌కాన్ని ఒక ఐదు పేజీలు, 10 పేజీల కింద విడ‌గొట్టుకొని చ‌దివితే ఆ పుస్త‌కం ఒక స‌మ‌యానికి పూర్తి చేస్తాం. దీనినే స్మార్ట్ గోల్స్ అని కూడా అంటారు. అయితే చ‌దివే ట‌ప్పుడు మొద‌టిగా దానిపై శ్ర‌ద్ధ ఉండాలి, దీనిని నేను చ‌ద‌వ‌గ‌లుగుతాన‌నే న‌మ్మ‌కం ఉండాలి. అలా చ‌దివిన‌ప్పుడు మ‌న మైండ్‌లో ఉన్న ఆ స‌బ్జెక్టు కు సంబంధించిన స‌మాచారం మ‌రింత మెరుగ‌వుతుంది.

They Teach Others

నేర్చుకున్న విష‌యాన్ని మీరు వేరేవాళ్ల‌కు చెబితే ఆ విష‌యం మీకు ఇంకా బాగా గుర్తు ఉంటుంది. ఇది నేను చెప్ప‌డం లేదు ఎన్నో ప‌రిశోధ‌న‌ల్లో తేలిన అక్ష‌ర స‌త్యం. మ‌న‌కు తెలిసిన విష‌యం క‌నుగ వేరే వాళ్ల‌కు చెబితే మ‌న బ్రెయిన్‌లో రీకాల్ వాల్యూ పెరుగుతుంది. రీకాల్ వాల్యూ అంటే తిరిగి గుర్తు చేసుకోవ‌డం అని అర్థం. ఇది మ‌న మెమ‌రీని బ‌ల‌ప‌ర్చుకోవ‌డానికి ఈ టీచింగ్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ముందు మ‌నం చ‌ద‌వాల‌నుకునే స‌బ్జెక్టును సెల‌క్ట్ చేసుకోవాలి. దానిని చ‌దివిన త‌ర్వాత వేరే వాళ్ల‌కు ఎక్స‌ప్లెయిన్ చేయాలి. ఒక వేళ మ‌నం ఎక్స్‌ప్లెయిన్ చేసిన దానిలో ఏమైనా త‌డ‌బాటు ఉంద‌నుకోండి. మ‌ళ్లీ చ‌ద‌వాలి. ఆ త‌డ‌బాటును రానివ్వ‌కూడ‌దు.

They Follow A Routine

రోటీన్ అనేది ఎవ‌రికైనా చాలా చాలా ముఖ్యం. రోజూ లేచిన త‌ర్వాత ఏం చేయాల‌నే ఐడియా ఉన్న‌వాడు చాలా ఎక్కువుగా యాక్టివ్‌గా ఉంటాడు. ఏం చేయాలిలే? అను కున్న‌వాడు లేచి ఏం చేస్తాములే అని అనుకుంటాడు. మ‌నం ఏ టైంలో లేవాలి. ఏ టైంకి తినాలి? ఏ టైంకి చ‌ద‌వాలి? అనే ఒక రోటీన్ ప‌ద్ధ‌తి ఉంటేనే మ‌న బాడీ, మైండ్ స‌రిగ్గా క‌లిసి ప‌నిచేస్తాయి. అయితే రోటీన్‌గా అనే ప‌ద్ధ‌తి మీ చ‌దువు విష‌యంలో మిమ్మ‌ల్ని మెరుగు ప‌రుస్తుంది. ఒక స‌మ‌యంలో చ‌ద‌వాలి అనుకున్న‌ప్పుడు అదే స‌మ‌యంలో ప్ర‌తి రోజూ చ‌ద‌వ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను చూడ‌వ‌చ్చు.

They Take Short Breaks

చ‌ద‌వ‌డం అనేది చాలా ముఖ్యం, అదే విధంగా చ‌దువుతున్న స‌మ‌యంలో బ్రేక్ తీసుకోవ‌డం చాలా ముఖ్యం. కంట్యిన్యూస్‌గా మ‌న మైండ్‌ను ఒకే విష‌యంపై ఒత్తిడి తీసుకురాకూడ‌దు. ఏదైనా చ‌దివిన త‌ర్వాత కొద్ది సేపు బ్రేక్ తీసుకోవ‌డం వ‌ల్ల చ‌దివించి మీకు ఇంకా ఎక్కువుగా గుర్తు ఉంటుంది. ప‌రిశోధ‌కులు చెప్పే మాట ఏమిటంటే? మ‌నం చ‌ద‌వే స‌మ‌యం 30 నిమిషాల కంటే ఎక్కువ‌.. 50 నిమిషాల కంటే త‌క్కువ ఉండాలని చెబుతున్నారు. ఆ త‌ర్వాత 10 – 15 నిమిషాలు గ్యాప్ తీసుకుంటే మీ మైండ్‌కు ఒత్తిడి ప‌డ‌కుండా చ‌దివింది బ‌య‌ట‌కు పోకుండా అలానే ఉంటుంది.

They Believe in Progress

నేర్చుకోవ‌డం అనేది జీవితంలో ఒక భాగం. జ్ఞానానికి తూకం ఉండ‌దు.. ఇది లైఫ్‌లో నిరంతర ప్ర‌క్రియ‌. ఏదైనా కొత్త‌ది నేర్చుకోవ‌డానికి బ‌ద్దకం ఎందుకంటే… అది నేర్చుకున్న త‌ర్వాత మ‌రో కొత్త‌ది నేర్చుకోవాలి.అలా కొత్త‌ది అనే దానిపైకి మ‌న‌సును వెళ్ల‌కుండా చేస్తుంటాం. చాలా మంది ఫ‌ర్ఫెక్ట్‌గా చ‌దువుదామ‌ని పూర్తి చేద్ధామ‌ని అనుకుంటారు త‌ప్ప ఆచ‌ర‌ణ‌లోకి మాత్రం వెళ్ల‌రు. కానీ తెలివైన వారు మాత్రం ఒక ప‌ద్ధ‌తితో చ‌దువుతుంటారు. నేర్చ‌కుంటారు. వారికి ఒక గోల్ అనేది ఉంటుంది. దానిని ఖ‌చ్చితంగా చేరుకోవ‌డానికి వారు ఒక గైడ్‌లైన్స్ ఏర్పాటు చేసుకుంటారు.

They Have A Growth Mindset

ఇక చివ‌రిగా మైండ్ సెట్ ఇది చాలా ప్రాముఖ్య‌త‌మైన‌ది. మ‌న మైండ్‌సెట్ ఎలా ఉంది. అన్ని తెలుసుకోవాల‌ని అనుకుంటుందా? లేకా అన్నీ తెలుసుకున్నాం నాకు అన్నీ వ‌చ్చు అని చెబుతుందా? అనే ఆలోచ‌న ప్ర‌తిఒక్క‌రూ చేయాలి. కొంత మందికి అన్నీ తెలుసున‌నే గ‌ర్వం ఉంటుంది. ఇది చాలా ప్ర‌మాద‌క‌రం. ఏదైనా తెలుసుకుందాం? కొత్త‌ది నేర్చుకుందామ‌నే మైండ్ సెట్ ప్ర‌తిఒక్క‌రికీ ఉండాలి. మీరు కూడా పైన తెలిపిన వివ‌రాల‌ను ఒక‌సారి పూర్తిగా అవ‌గాహన‌ చేసుకొని తెలివైన వారిలా చ‌ద‌వండి. మీరు అనుకున్న గోల్‌ను చేరండి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *