household budget | అమ్మాయిల్లో ఆర్థిక స్పృహ పెరిగింది. పెళ్లికి ముందే ఉద్యోగం చేసే అమ్మాయిలు తమ భవిష్యత్ అవసరాల కోసం ఎంతో కొంత పొదుపు చేస్తున్నారు. కానీ అప్పటి పరిస్థితులకు, పెళ్లి తర్వాత వచ్చే ఆర్థిక పరిస్థితులకు ఎంతో తేడా ఉంటుంది. పెళ్లికి ముందు ఎవరి ఆదాయాలు, ఎవరి ఖర్చులు వారివేకానీ పెళ్లియన తర్వాత మరో వ్యక్తి భాగస్వామి అవుతారు. వారి ఆదాయాలు, ఖర్చులు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటిని బట్టే కుటుంబాన్ని ప్లాన్ చేసుకోవడం అన్నది ఆధారపడి ఉంటుంది.
household budget | ఇంటి బట్జెట్ ఇలా!
పెళ్లి అయిన తర్వాత ప్రాధాన్యం, ఆర్థిక లక్ష్యాలు మారిపోతాయి. వాటికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్‌గా ఉన్న బడ్జెట్(budget) పెళ్లి నాటి నుంచి జాయింట్ బడ్జెట్ అవుతుంది. మొత్తం కుటుంబ ఆదాయాలు, వ్యయాలు అన్నింటినీ ఆర్థిక ప్రణాళికలో లెక్కేసుకోవాలి. మీ ఆదాయం, ఖర్చులు, రుణాలు ఇలా ఏవి ఉన్నా వాటి గురించి మీ జీవిత భాగస్వామికి నిజాయతీగా వివరించడం మంచిది. దీని వల్ల దీర్ఘకాలికంగా పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం వీలవుతుంది.
బడ్జెట్ తయారు చేసుకోవాలి!
ఆర్థిక ప్రణాళికలకు ఎప్పుడైనా సరే అన్నింటికన్నా ముందు బడ్జెట్ అంటూ రూపొందించుకోవాలి. ఒక సంవత్సర కాలానికి దేశానికి, రాష్ట్రానికి ఎలాగైతే బడ్జెట్‌ను రూపొందించుకుంటారో, అలాగే ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో మన ఇంటికి కూడా కొత్తగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలి. అప్పుడే ఖర్చులను అదుపులో ఉంచుకోగలుగుతాం. మనం రూపొందించుకునే బడ్జెట్లో ప్రతి నెలా వచ్చే ఆదాయానికన్నా ఖర్చులు తక్కువగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. గత సంవత్సర కాలంగా ఎదురైన ఆర్థిక పరిస్థితులు, రాబోయే కాలంలో వచ్చే ఆదాయలు, తలెత్తే ఖర్చులు మొదలైన వాటి ఆధారంగా బడ్జెట్ తయారు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తాన్ని ఖచ్చింగా పక్కన పెట్టుకోవాలి.

ప్రణాళిక పక్కగా ఉండాలి!
ఎప్పటికప్పుడు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. మీ ఖర్చులు కన్నా ఆదాయం ఎక్కువగా ఉందంటే మీరు చేసుకున్న ప్రణాళిక పక్కగా ఉన్నట్టే. లేకపోతే మరోసారి సరైన ప్లాన్‌కు కసరత్తు చేయాల్సిందే. ఇలా బడ్జెట్ రూపొందించుకున్న తర్వాత ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. అంటే విహారయాత్రలకు వెళ్లాలన్నా, ఇల్లు లేదా కారు కొనాలన్నా వాటి కోసం కొంత మొత్తం పొదుపు చేసేలా ప్రణాళికను రూపొందించుకోవడం అన్నమాట.
గడువు నిర్థేశించుకోవాలి!
ఇలాంటి లక్ష్యాల జాబితాను తయారు చేసుకొని ఒక్కోదాన్ని ఇంత సమయంలో సాధించాలని గడువు నిర్థేశించుకోవాలి. అంటే వీటిలో స్వల్పకాలంలో సాధించేవి, దీర్ఘ కాలంలో సాధించేవి. వీటి ఆధారంగా పొదుపు ఎంత వరకు చేయవచ్చో ప్రణాళికను రూపొందించుకోవాలి. స్వల్పకాలిక లక్ష్యాల కోసం ఫిక్సడ్ డిపాజిట్లు, పోస్టాఫీసు డిపాజిట్లు, పొదుపు ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లు వంటివి అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ప్రణాళికైనా రిస్క్ ఏర్పడినప్పుడు ఇవి కొంత ఉపశమనాన్ని కలిగించేవిగా ఉండాలన్న సంగతి మాత్రం మరిచిపోవద్దు.

అత్యవసర పరిస్థితుల్లోనైతే!
ఇవే కాకుండా, అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఈ మొత్తాన్ని మీరు రెగ్యులర్‌గా వాడే అకౌంట్లో కాకుండా ప్రత్యేకంగా వేరే అకౌంట్లో ఉంచుకోవడం మంచిది. కాబట్టి పెళ్లైన తర్వాత వచ్చే కుటుంబ బాధ్యతలు, పిల్లలు, వారి చదువులు, వృద్ధాప్యంలో ఆసరాగా ఉండేలా పింఛన్లు, ఇలా అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం మంచిది. దీనికి చిన్న వయసు నుంచే పెట్టుబడులు, పొదుపులు చేయడం ప్రారంభించాలి. సాధ్యమైనంత వరకు రిస్క్ తక్కువుగా ఉండి అధిక రాబడులు ఇచ్చేందుకు ఆస్కారమున్న పెట్టుబడుల్లోనే ఇన్వెస్ట్ చేయాలి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!