house wife tips దుప్పట్లు ఉతికేటప్పుడు చివరగా ఓ బక్కెటు నీళ్లలో కాస్త కర్ఫూరం కలిపి ఆ నీళ్లల్లో దుప్పట్లను జాడించి ఆరవేస్తే పురుగులు దరి చేరవు. మందపాటి ముతక వస్త్రాలను కుట్ట వలిసి వచ్చినప్పుడు కుట్టు అవసరమైన భాగంలో కొవ్వొత్తితో రుద్దితే కుట్టడం తేలికవుతుంది. గృహాలంకరణకు ఉపయోగించే కాగితం పూలు, ప్లాస్టిక్ పూలపై కాస్త సెంట్ చల్లండి. అందంతో పాటే ఆహ్లాదకరమైన పరిమళం వస్తుంది. బాగా దగ్గు జలుబుతో బాధపడేవారు పొద్దుంటే తులసి ఆకు రసం తేనె కలిపి తీసుకుంటే ఆ బాధ ఉపశమన(house wife tips) మిస్తుంది.
చిట్కాలు-1
నిమ్మకాయ రసం పూర్తిగా కావాలంటే కాస్త సెగ చూపించి పిండితే రసం పూర్తిగా వస్తుంది. క్యాబేజీ వండేటప్పుడు ఆ వాసన కొందరికి పడదు. అలాంటప్పుడు కూరలో అరటీ స్పూన్ పంచదార చేరిస్తే రుచి మరింత బావుంటుంది. తలంటి స్నానం చేసిన తరువాత జుట్టు కాస్త తేమగా ఉన్నప్పుడే రవంత కోలోన్ను వెంట్రుకల మీద స్ప్రే చేయండి. మీ కురులు చిరుగాలికి కదలాడినా సుంగంధ పరిమళాలే.
చిట్కాలు -2
చేపలు శుభ్రపరిచిన తరువాత చేతులు వాసనగా అనిపిస్తే ముందు కొంచెం శనగ పిండితో రుద్దుకొని తరువాత సబ్బుతో కడుక్కుంటే వాసన పూర్తిగా పోతుంది. బీటలు వారిన గుడ్లని నీటిలో ఒక స్పూన్ ఉప్పు వేసి ఉడకబెట్టండి. అరటి పండ్లను గాజు జాడీలో ఉంచి, గట్టిగా మూత బిగించి, ఫ్రిజ్లో పెడితే నల్లబడవు. ప్లాస్టిక్ కవరులో కన్నా కాగితపు కవరులో నిల్వ చేస్తే ఆకు కూరలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్