house maid arrested

house maid arrested: ప‌నిమ‌నిషి విష‌ప్ర‌యోగం చేయ‌డంతో చూపు కోల్పోయిన వైనం!

Telangana

house maid arrested | దూర‌పు దేశంలో కుమారుడు, స్వ‌దేశంలో త‌ల్లి నివాసం. త‌ల్లి వృద్ధురాలి కావ‌డంతో త‌న బాగోగుల చూసేందుకు ఓ ప‌ని మ‌నిషి నియ‌మించాడు. అంతా సాఫీగా సాగుతున్న‌త‌రుణంలో ప‌ని మ‌నిషికి దుర్భుద్ధి మొద‌లైంది. వృద్ధురాలి ఉంటున్న ఇంట్లో దొంగ‌త‌నం చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. వృద్ధురాలి చూపు పోయిన త‌ర్వాత న‌గ‌లు చోరీ చేసింది. (house maid arrested) అస‌లు క‌థ‌లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్ న‌గ‌రంలోని నాచారంలో వృద్ధురాలు హేమావ‌తి నివసిస్తోంది. ఆమె కుమారుడు శ‌శిధ‌ర లండ‌న్ లో ఉంటున్నారు. త‌ల్లిని చూసుకోవ‌డం కోసం ఓ వంట‌రి మ‌హిళ‌కు రూ.15 వేలు నెల‌కు జీతం ఇచ్చి ఇంట్లో ప‌నికి పెట్టారు. ఈమె పేరు భార్గ‌వి. ఆదిలాబాద్ జిల్లా మంద‌మ‌ర్రికి చెందిన భార్గ‌వికి భ‌ర్త‌తో గొడ‌వ‌లు కార‌ణంగా ఒంట‌రిగా ఉంటోంది.

ప్ర‌తి రోజూ వృద్ధురాలికి కంట్లో చుక్క‌ల మందు వేయాల్సి ఉంది. అయితే ఇంట్లో దొంగ‌త‌నం చేయాల‌నే ఆలోచ‌న‌తో భార్గ‌వి దుర్మార్గ‌పు ఆలోచ‌న చేసింది. చుక్క‌ల మందుకు బ‌దులుగా య‌జ‌మానురాలి కంట్లో బాత్రూం క్లీన‌ర్‌, త‌ల‌నొప్పి ఔష‌ధం, నీరు క‌లిపిన మిశ్ర‌మాన్ని వేస్తూ ఉంది. దీంతో వృద్ధురాలి కంటి చూపు కోల్పోయింది. అదును చూసి ఇంట్లో ఉన్న 6 తులాల బంగారం, 40 వేల న‌గ‌దు చోరీ చేసింది. త‌ల్లికి చూపు పోవ‌డంతో కుమారుడు ఆసుప‌త్రిలో చూపించారు.

పోలీసుల అదుపులో ప‌నిమనిషి

వైద్యులు ప‌రీక్షించి క‌ళ్ల‌లో విష‌ప్ర‌యోగం జ‌రిగింద‌ని తెలిపారు. ప‌ని మ‌నిషిపై అనుమానంతో నిల‌దీయ‌గా ఇల్లు వ‌దిలి వెళ్లింది. అయితే ఇంట్లో ఉన్న బంగారం కోసం తిరిగి వ‌చ్చిన‌ప్పుడు ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. నాచారం పోలీసులు త‌మ‌దైన శైలిలో ప్ర‌శ్నించ‌గా అస‌లు విష‌యాన్ని వెళ్ల‌గ‌క్కింది. దీంతో భార్గ‌వి వ‌ద్ద ఉన్న‌బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *