Horse Gram Benefits: ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అలాగే బరువును బాగా తగ్గిస్తాయి. ప్రస్తుత కాలంలో ఉలవలంటేనే ఎక్కువ మందికి నచ్చట్లేదు. అదీ ఉడికించిన గింజలను తినే అలవాటున్న వాళ్లు ఏ శనగలనో, పెసర గింజలనో తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఉలవల(Ulavalu)ను వారానికోసారైనా డైట్లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వంద గ్రాముల పిజ్జా తింటే అందులో 12 గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే 100 గ్రాముల ఉలవల్ని తింటే కొవ్వు అస్సలుండదు. 100 గ్రాముల ఉలవల్లో 321 కేలరీల శక్తితో పాటు 22 గ్రాముల ప్రోటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీ గ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్పరస్‌లతో పాటు పీచు (Horse Gram Benefits) పదార్థాలుంటాయి.
అదే పిజ్జాలో పోషక విలువలు శూన్యం. ఉలవలు తింటే జ్వరం, జలుబు, అల్సర్, కాలేయ, కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంకా ఉలవలు మహిళలో వచ్చే బహిష్టు సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇక కండరాలను పటిష్టంగా ఉంచడంతో పాటు నరాల బలహీనతను దూరం చేసే ఉలవలను ఉలవచారు, గుగ్గిళ్లు, కూరలు, లడ్డూలు, సూప్‌లు ఇలా తయారు చేసుకోవచ్చు. అధిక బరువు సమస్యలకు ఉలవలు దివ్యౌషధంగా పనిచేస్తాయి.
నాణ్యమైన ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేగించి, చల్లారిన తరువాత మెత్తటి పౌడర్లా చేయాలి. రోజూ పరకడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలో వేసుకుని తాగితే బరువు తగ్గుతారు. ఉలవల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉంది. ఇక ప్రస్తుతం అధిక బరువు అందర్నీ వేధిస్తున్న సమస్య. అధిక బరువు ఉన్న వారికి పొట్ట పెరిగిపోవడం ప్రధాన సమస్యగా మారింది. అలా భారీగా పెరిగిన పొట్టని తగ్గించుకోవడం కోసం అనేక మంది తమకు తెలిసిన పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు. కానీ సహజ పద్ధతిలో ప్రయత్నిస్తే చాలా సులభంగా పొట్టని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను పాటిస్తే పొట్టను ఈజీగా తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గండి ఎలా గంటే?
ఉలవలు – 100 గ్రాములు
నీరు – అర లీటరు
అల్లం పేస్ట్ – రెండు స్పూన్లు
జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్
ఉప్పు – తగినంత
మిరియాల పొడి- అర టీ స్పూన్
తయారు చేయు విధానం
ముందుగా స్టౌ మీద పెట్టి నీళ్లు మరిగాక, అల్లం పేస్టు, జీలకర్ర పొడి తగినంత నీరు వేసి తేలనివ్వాలి. ఆపై ఉలవపిండిని చేర్చి గడ్డకట్టకుండా గరిటెతో తిప్పుతూ జావలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ సాయంత్రం పూట తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. ఇంకా సాగిన పొట్ట కూడా దగ్గరికొస్తుంది. నెల పాటు చేస్తే పొట్ట తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతుంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ