Honey bee attack | వయసు అయిపోయిన ఓ పెద్దవ్వకు ప్రాణం పోయింది. ఆమె శవాన్ని స్మశాన వాటికలో కాల్చేందుకు చుట్టుప్రక్కల వారంతా పోగయ్యారు. చనిపోయినప్పుడు పాడ మోయడానికి నలుగురు అయినా కావాలి. కానీ ఇక్కడ పెద్దవ్వ మంచితనంతోనో దాదాపు 20 మంది పోగయ్యారు బంధువులు. ఇక మన రోజువారీ పూట గడిచే ఇళ్లల్లో చావునై, పుట్టకైనా సంబురాలు మామూలుగా ఉండవు కదా!. అలానే ఈ పెద్వవ్వను దానం చేయడానికి మేళతాళాలతో ఊరేగింపుగా బయలు దేరారు.
ఉరేగింపులో టపాసులు(Tapasulu) కాల్చే పోరగాళ్లు ముందుగానే తయారయ్యారు. ఇక పెద్దవ్వ పాడెను మోసుకుంటూ, టపాసులు కాల్చుకుంటూ పోతున్నారు. ఈ టపాసులు ఎప్పుడైతే చెట్టుమీద ఉన్న తేనె తొట్టికి తాకిందో, వాటికి కోపం వచ్చింది. వెంటనే ఆపదలో పడ్డాం..మరణమైనా శరణ్యమే అన్నట్టుగా పెద్దవ్వ పాడె మోస్తున్న జనాల గుంపు మీదకు దండెత్తాయి తేనెటీగలు(Honey bee). వెంటనే పసిగట్టిన యువకులు, పిల్లలు ఒక్కసారిగా పరార్ అయ్యారు. పాడే మోసే పెద్దోళ్లను తేనెటీగలు కుట్టని చోట కుడుతుండగా పాడెను పడేసి పరుగు లంకించుకున్నారు.


పెద్దవ్వ శవం రోడ్డుపైనే ఉండిపోయింది. దాక్కున్నే చోటు ఎక్కడ కనిపిస్తే అక్కడకు దూరి పోయారు బంధువులు. మెల్లగా తేనెటీగ(Honey bee attack)లు పోయాయి అని డిసైడ్ అయిన తర్వాత పాడె వద్దకు భయం భయంగానే వచ్చారు. అప్పటికే తేనెటీగలు పాపం దొరికినోడ్ని దొరికినట్టే కుట్టి బంధువులపై పగ తీర్చుకున్నాయట. ఇది తెలుసుకున్న అంబులెన్సులు రయ్యిన వచ్చాయి. తేనెటీగలు కుట్టిన బాధితులందర్నీ ఆసుపత్రికి తరలించాయి. మొత్తానికి పెద్దవ్వ అంత్యక్రియలు ఆఖరికి పూర్తి చేశారంట. ఇంతకీ ఈ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది.