honey bee and the ox story అనగనగా ఒక అడవిలో ఒక తేనెటీగ ఉండేది. అది పరమ సోమరిపోతు. దానికి పని చేయడం రాదు. ఏ పనీ చేయకపోవడంతో రకరకాలుగా ఆలోచిస్తూ కాలక్షేపం చేసేది. అంతేకాదు దానికి తన శక్తి సామర్థ్యంపై విపరీత మైన నమ్మకం ఉండేది. ఒక రోజు ఎప్పటిలాగే తేనెటీగ ఖాళీగా చెట్టుకొమ్మపై కూర్చొని ఉంది. ఇంతలో గడ్డి మేస్తూ ఎద్దు ఒకటి ఆ చెట్టు కిందకు(honey bee and the ox story) వచ్చింది. దాన్ని చూడగానే రెక్కల చప్పుడు చేస్తూ వెళ్లి ఆ ఎద్దు కొమ్ముపై వాలింది.
నీకు బరువైతే చెప్పు ఎగిరిపోతాను!
మిత్రమా! ఎలా ఉన్నావు? ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని అడిగింది. ఎద్దుకు దాని మాటలు వినిపించలేదు. సరికదా..అసలు తన కొమ్ముపై తేనెటీగ వాలిందన్న సంగతే తెలియలేదు. నా బరువు నువ్వు ఆపగలవా? నీకు బరువైతే మొహమాటపడకుండా చెప్పు సుమా! ఎగిరిపోతాను. అని అంది తేనెటీగ. ఎద్దు దానిని పట్టించుకోకుండానే గడ్డి మేయడం లో మునిగిపోయింది. ఇంతలో బలంగా సుడిగాలి వీస్తూ అటువైపు వచ్చింది. ఆ గాలి విసురుకు తేనెటీగ(honey) ఒక్కసారిగా పైకి లేచింది. రెక్కలు టప్పటప్పలాడిస్తూ ఎద్దు కొమ్ముపైనే నిలవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కాని నిలవ లేకపోయింది.

సుడిగాలి దాన్ని చాలా దూరం లాక్కుపోయి పడేసింది. చివరకు తేనెటీగ ఒక కొమ్మకు చిక్కుకుని ప్రాణాలు రక్షించుకోగలిగింది. ముక్కుతూ, మూలుగుతూ తిరిగి చెట్టుకొమ్మ మీదకు చేరింది. అంతకు ముందు ఎద్దు ఎక్కడ నిలబడిందో అక్కడే నిశ్చలంగా గడ్డి మేస్తూ కనిపించింది. అప్పుడు తీనెటీగకు తన శక్తి ఏపాటితో అప్పుడు అర్థమయ్యింది. కానీ ఒప్పుకోవడానికి దానికి అహం అడ్డు వచ్చింది. ఆ..ఒక్క ఎద్దు(ox) మాత్రమే నాకంటే బలమైనదిలే! అనుకుంటూ రివ్వున ఎగిరిపోయింది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!