homemade winter skin care tips: శీతాకాలంలో అందం గురించి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి?

homemade winter skin care tips శీతాకాలంలో ఎలాంటి చ‌ర్మం ఉన్న‌వారైనా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. ఎప్పుడైనా, ఎక్క‌డైనా అందం చెద‌ర‌కుండా ఉండాలంటే కొంత అనుభ‌వంతో పాటు కొన్ని సాధార‌ణ చిట్కాలు పాటిస్తే చాలు. మ‌న దేశంలో మారే ఋతువుల వ‌ల్ల అనేక ర‌కాల వాతావ‌ర‌ణం మార్పులు వ‌ల్ల మ‌న చ‌ర్మంలో అనేక మార్పులు రావ‌డం స‌హ‌జం. ఉద‌యం పూట వేడి టొమాటో సూపులో నిమ్మ‌ర‌సం క‌లిపి ఆహారంలో తీసుకోండి. త‌క్క‌వ కేల‌రీల ఆహారం, పానీయాలు తీసుకోవాలి. వీటిలో విట‌మిను సి ల‌భ్య‌మ‌వుతుంది. శీతాకాలం చ‌ర్మం క్రింద ఉన్న నూనె గ్రంథులు త‌క్కువుగా ప‌నిచేయ‌డం వ‌ల్ల తేమ‌ను కోల్పోయి పొడిగా(homemade winter skin care tips) ఉంటుంది.

చ‌ర్మం ముడుత‌లు ప‌డ‌టం, ప‌గ‌ల‌డం, దుర‌ద‌లు, పొలుసులు బార‌డం జ‌రుగుతుంది. స్ట్రాంగ్‌గా ఉన్న సోపులు వాడ‌టం మాని మైల్డ్‌గా ఉన్న గ్లిజ‌రిన్ సోపులు వాడాలి. పాల మీగ‌డ‌లో కొద్దిగా తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి రోజూ ముఖానికి రాసుకుని 15 నిమిషాల త‌ర్వాత శుభ్ర ప‌రుచుకోండి. అధికంగా సౌంద‌ర్య సాధ‌నాలు, హెయిర్ డ్రై స్పేలు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం స‌హ‌జ‌త్వం కోల్పోతుంది. రాత్రి నిద్ర‌పోయే ముందు చేతుల‌కు, కాళ్ల‌కు పాల మీగ‌డ‌, గ్లిజ‌రిన్‌, ఆలివ్ా య‌ల్‌, రోజ్ వాట‌రు క‌లిపి రాసి మ‌సాజ్ చేసుకోవాలి. స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్‌, కొబ్బరి నూనె ఒంటికి పూసుకొని ప‌ది నిమిషాలు ఆర‌నిచ్చి స్నానం చేస్తే చ‌ర్మం మెరుపుగా ఉంటుంది.

చ‌ర్మం ప‌గ‌ల‌కుండా ఉండాలంటే విట‌మిన్ ఎ ఎక్కువ గ‌ల ఆహారం తినాలి. ఒక చెంచాడు మంచి గంధం నూనె, ఒక చెంచా కొబ్బరి నూనె క‌లిపి దుర‌ద‌గా ఉన్న ప్ర‌దేశాల్లో పూయాలి. తుల‌సి ఆకుర‌సం కూడా మంచి ఫ‌లితం ఇస్తుంది. ఎక్కువ పూలు దుస్తులు ధ‌రించ‌డం వ‌ల్ల‌, వేడి నీటి స్నానాలు, ఎండ త‌గ‌ల‌క‌పోవ‌డం, తేమ లేక‌పోవ‌డం, ఎక్కువ స‌బ్బులు వాడ‌టం వ‌ల్ల దుర‌లు, వింట‌ర్ ఇచ్చింగ్స్ వ‌స్తుంటాయి.

పాదాల వ‌ద్ద చ‌ర్మం ప‌గిలి బాధ‌గా ఉంటే స్నానం చేసేట‌ప్పుడు ప్యూమిక్ రాయితో రుద్దాలి. మంచి క్రీమ్స్‌తో మ‌సాజ్ చేయాలి. వూలు సాక్స్ వేసుకోవాలి. గులాబీ పూవుల రేకుల‌ను మెత్త‌గా నూరి తేనె క‌లిసి పెద‌వుల‌కు రాస్తే పెద‌వులు మృదువుగా, ఎరుపుగా ఉంటాయి. పెద‌వులు న‌ల్ల‌బ‌డ‌టం, ప‌గ‌ల‌డం జ‌ర‌గ‌దు. నూనెను వేడి త‌ల‌కు రాసి మ‌ర్ధ‌న చేసి గంట త‌ర్వాత త‌ల స్నానం చేస్తే జ‌ట్టు మెరుపుగా ఉంటుంది. వెంట్రుక‌లు చిట్లిపోవు. లిప్‌స్టిక్స్ వాడేవారు శీతాకాలంలో లేత రంగు లిప్‌స్టిక్స్ వాడాలి. లిప్ గ్లాస్ వాడ‌టం మ‌రిచిపోవ‌ద్దు. ఈ జాగ్ర‌త్త‌ల‌న్నింటితో బాటు ఆరోగ్య‌క‌ర‌మైన పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం.

Share link

Leave a Comment