Home Tips 2022 | మన ఇంట్లో ప్రతి రోజూ పాటించే చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. ఆరోగ్యానికి, డబ్బు ఆదా చేయడానికి ఈ చిట్కాలు ఎంతగానో సహాయపడతాయి. ఈ చిట్కాలు(Simple Home Tips 2022) అందరికీ ఉపయోగపడతాయి. ముఖ్యంగా వంటింటి మహిళలకు ఎక్కువుగా పనికి వస్తాయి.
Home Tips 2022: ఇంటి చిట్కాలు
-బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కలపై కాస్తంత నిమ్మరసం పిండితే జిగురు ఉండదు.
-వంకాయ కూరలో రెండు చుక్కల నిమ్మరసం పిండితే కూర రంగు మారదు. రుచిగా కూడా ఉంటుంది.
-రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి, ఉప్పుతో రుద్దితే కొత్తవాటిలా మెరుస్తాయి.
-వంట గదిలో చీమలు బారులు తీరితే, అక్కడ కొంచెం నిమ్మరసం చల్లండి.
-పచ్చటి ఆకుల్లో ఉప్పు వేసి, వెండి వస్తువులను తోమితే కొత్తగా మెరుస్తాయి.
-ఇత్తడి చెంబులు, బిందెలను ముందుగా ఉప్పు నీటితో తోమి, తర్వాత మామూలుగా కడిగితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.
-బంగారు, వెండి నగలు వన్నె తగ్గిపోయాయా? విరిగిన పాలతో కడిగితే సరిపోతుంది.
-రాగి వస్తువులను చింతపండుతో తోమి మంచి నీటితో కడగాలి.
-పచ్చళ్లు బూజు రాకుండా ఉండాలంటే, చిన్న ఇంగువ ముక్కను నిప్పు మీద కాల్చి ఖాళీ జాడిలో పెట్టాలి. అరగంట తర్వాత జాడలో నుంచి ఇంగువ ముక్కను తీసివేసి పచ్చడి వేయాలి.
-కాకరకాయలు త్వరగా పండిపోతూ ఉంటాయి. అలా పండకుండా ఉండాలంటే వాటిని ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.
-బియ్యం మొదలైన పదార్థాలు ఉడుకుతున్నప్పుడు పొంగిపోకుండా ఉండాలంటే ముందుగా గిన్నె అంచు చుట్టూ లోపల నూనె రాయండి.
-స్టవ్‌లో కిరోసిన్ బదులు డీజిల్ ఆయిల్ కూడా వాడవచ్చు. 10 లీటర్ల డీజిల్ ఆయిల్ కు 1/2 కప్పు క్రిస్టల్ సాల్ట్ కలిపితే వంట చేసేటప్పుడు సామాన్లు మసిబారకుండా ఉంటాయి.
-గుండె నొప్పి, గుండె దడ వచ్చినప్పుడు కొబ్బరి నీళ్లో, పంచదార కలిపిన దానిమ్మ రసమో సేవించడం మంచిది.
-బంగాళా దుంపలు ఉడకబెట్టిన నీటిని పారబోయకుండా ఆ నీటితో వెండి సామాగ్రిని కడిగితే మచ్చలు లేకుండా మెరుస్తాయి.
-కంట్లో కుంకుడు రసం లేదా సీకాయ పడినప్పుడు బాధగా ఉంటుంది. అప్పుడు ఒక ఉప్పు కల్లును నోట్లు వేసుకుంటే బాధ తగ్గుతుంది.
-తులసి ఆకులు, వక్క కలిపి బుగ్గన పెట్టిన రసం మింగితే దగ్గు త్వరగా తగ్గుతుంది.
-ముఖం అందంగా, కాంతిగా కనిపించాలంటే ఉదయం స్నానం చేయడానికి ముందు అర టీస్పూను నిమ్మరసం ముఖానికి పట్టించి, అరగంట అయ్యాక గోరు వెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఒక నెల రోజులు ఈ విధంగా చేస్తే ముఖానికి మంచి కాంతివస్తుంది.
-మందార పువ్వులను సీమ నూనెలో గాని కొబ్బరి నూనెలో గానీ నూనెకు సమంగా పువ్వుల రసం ఇగురు వరకూ కాచి దానిని తలకు ఉపయోగిస్తుంటే వెంట్రుకలు రాలిపోకుండా తగ్గుతాయి. కురచగా ఉన్న వెంట్రుకలు ఎదుగును మెదడుకు, కళ్లకు చల్లగా ఉండును.
-గుండు సూదులు, మేకులు మొదలగు చిన్న ఇనుప వస్తువులు ఖాళీ పాలీష్ డబ్బాల్లో ఉంచితే తప్పు పట్టవు.
-పకోడీలు కరకలాడాలంటే వెల్లుల్లిపాయలు చితక్కొటి వేయాలి. రుచిగా కూడా ఉంటాయి.
-మీ పిల్లలు పాలు తాగనంటున్నారా? అయితే ఆ పాలల్లో కొద్దిగా ఏలకుల పొడి వేసి చూడండి.
-ఎండిపోయిన బ్రెడ్‌ను పొడి చేసి పాలల్లో కలుపుకొనవచ్చును.
-అట్లు రుచిగా ఉండాలంటే రుబ్బేటప్పుడు కొన్ని బంగాళాదుంప ముక్కలే వేస్తే సరి!
-వాడేసిన మెడిసిన డ్రాపర్‌ని ఇంక్ పిల్లర్‌గా వాడుకొనవచ్చును.
-ఇంక్ వొలికిపోతే దాన్ని వేస్ట్ చేయకుండా స్టాంప్ పాడ్‌కి అద్దుకొనవచ్చు.
-జీడిపప్పులో లవంగాలు ఉంచితే పురుగు పట్టదు.
-అన్నం తెల్లగా మెరుస్తుండాలంటే వండే ముందు కొద్దిగా నిమ్మరసం పిండి సరి.