Home Isolation గురించి ఈ డాక్ట‌ర్ చెప్పింది చ‌దివితే corona అటునుంచి అటే ప‌రార్‌!

Home Isolation : సాధార‌ణంగా డాక్ట‌ర్లు ఓ రోగికి వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించినా, వ్యాధి ముదిరినా ఆ వ్య‌క్తికి చెప్పేట‌ప్పుడు చాలా క‌ఠినంగా చెబుతుంటారు కొన్ని సంద‌ర్భాల్లో. అలా అని అంద‌రూ అలా ఉండ‌ర‌నుకోండి! డాక్ట‌ర్ ఇలా ఎప్పుడైతే చెబుతాడో ఆ రోగి అక్క‌డే స‌గం స‌చ్చిన పాములా మారిపోతాడు. ఇక రోగంపైనే ధ్యాస పెడతాడు. మాన‌సికంగా కృంగిపోతాడు. ఇప్పుడు క‌రోనా వైర‌స్ రోగుల ప‌రిస్థితి కూడా అలానే ఉంది. వైర‌స్ సోకిన వెంట‌నే అమ్మో! అనేంత‌గా భ‌య‌ప‌డుతున్నారు. కొంద‌రు ప్రాణాలు కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. కానీ క‌ర్నూలు జిల్లాకు చెందిన గుండె మ‌రియు ఊపిరితిత్తుల శ‌స్త్ర చికిత్స నిపుణులు డా.సి. ప్ర‌భాక‌ర్ రెడ్డి హోం ఐసోలేష‌న్ గురించి చాలా ఫ‌న్నీగా, రోగికి అర్థ‌మ‌య్యేలా చెప్పారు. అది ఎలా ఉందో ఒక్క‌సారి మీరూ చ‌ద‌వండి!.


Home Isolation : క‌రోనా(corona) పాజిటివ్ అన‌గానే అంద‌రికీ ఫోన్లు చేసి బెంబేలెత్తి నన్ను ఆసుప‌త్రిలో చేర్చ‌డి అని ఏడ్చి కంగారు ప‌డి సింప‌తీకొట్ట‌కుండా ధైర్యంగా స్వీయ గృహ నిర్భంధం ద్వారా క‌రోనాను ఏ విధంగా ఎదుర్కొవాలో తెలుసుకోండి.

 • జ్వ‌రం, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు మొద‌ల‌వ్వ‌గానే ఇంట్లో వాళ్ల‌కి నేను ఐసోలేష‌న్‌కు వెళుతున్నా అని చెప్పి ఒక రూమ్‌లోకి వెళ్లాలి. అదేదో వ‌న‌వాసం వెళుతున్న‌ట్టు .. ఊ.300/- మందుల కిట్టు మొద‌లెట్టాలి. ఆర్‌టిపిసిఆర్ పాజిటివ్(rt pcr test) అయితేనే..!
 • కొంచెం ధైర్యం కావాలంటే ఒక మంచి డాక్ట‌ర్ కు ఫోన్ చేసి క‌న్స‌ల్టేష‌న్ తీసుకుని మందులు మొద‌లెట్ట‌వ‌చ్చు. ఆ రోజు నుంచి ఇక ప‌దిహేను రోజులు డాక్ట‌ర్‌తో కాంటాక్ట్ లో ఉండాలి. అలాగ‌ని గంట‌గంట‌కూ డాక్ట‌ర్(doctor) మీద దాడి చేయ‌రాదు.. లైవ్ చాట్ చేయ‌రాదు.. అలా చేస్తే స‌చ్చూరుకుంటాడు డాక్ట‌ర్‌.. పోతీ పోనీ దేశం కోసం ధ‌ర్మం కోసం పుణ్యం కోసం పోతీ పోనీ అంటారా? స‌రే మీ ఇష్టం.. ఆ డాక్ట‌ర్ ఖర్మ‌.
 • ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఏదో ఒక‌టి తింటుండాలి. అలా తిని ఇలా తిరిగి ప‌డుకోవాలి. తిన‌డం ప‌డుకోవ‌డం ఇంత‌కు మించి వేరే ప‌ని ఉండ‌కూడ‌దు. ద‌గ్గొస్తే ద‌గ్గాలి..తుమ్మొస్తే తుమ్మాలి. ఇంట్లో వాళ్ల‌తో ఎవ‌రితోనైనా మాట్లాడ‌వ‌లిసి వ‌స్తే మాస్క్ పెట్టుకుని మాట్లాడాలి. మూడు పూట‌లా తిన్నామా? ప‌డుకున్నామా? తెల్లారిందా? అన్న‌ట్టు ఉండాలి.
 • నీళ్లు బాగా తాగాలి. మ‌జ్జిగ బాగా తీసుకుంటూ ఉండాలి. డ్రై ప్రూట్స్(dry fruits), బిస్కెట్లు గ‌ట్రా క‌ర్రుం..క‌ర్రుం లాడించాలి. కాఫీలు టీల‌కు కాస్త దూరంగా ఉండాలి. ఇక మందు..పొగ‌.. అబ్బెబ్బే అస‌లెప్పుడూ వాటి ముఖం చూడ‌న‌ట్టే ఓవ‌ర్ యాక్ష‌న్ చేయాలి.
 • ద‌గ్గు జ్వ‌రం ఎక్కువవుతుంటే డాక్ట‌ర్‌కి చెప్పాలి. అవ‌స‌రం అయితే సిటీ స్కాన్‌(city scan), డి- డిమైర్, సిఆర్‌పి ర‌క్త ప‌రీక్ష‌లు చెప్వ‌చ్చు చేయించుకోవాలి. వాటిలో తేడాలుంటే ఏవైనా మందులు మార్చ‌వ‌చ్చు. వేసుకోవాలి. మ‌ళ్లీ తిన్నామా ? ప‌డుకున్నామా? తెల్లారిందా? అన్న‌ట్టు ఉండాలి.
 • ప్ర‌తి మూడు గంట‌ల‌కొక‌సారి ప‌ల్స్ ఆక్సిమీట‌ర్ చూసుకుంటూ ఉండాలి. పొద్దున పూట 94% పైన ఉంటే అస‌లు కంగారే లేదు. 94% వ‌చ్చినా కంగారే లేదు. మందులు మారిస్తే మ‌ళ్లీ కాస్త పెరుగుతుంది.
 • గుండె జ‌బ్బులు లేని వారు అప్పుడ‌ప్పుడూ కాసేపు బోర్లా ప‌డుకుంటూ ఉండాలి.
 • రెండో వారంలో జ్వ‌రం ద‌గ్గు వంటివి పెరిగినా, ఆయాసం వంటివి వ‌చ్చినా డాక్ట‌ర్‌కు చెప్పాలి. నూటిలో ఒక‌రికి మాత్ర‌మే ఇలా అయ్యే అవ‌కాశం ఉంటుంది.
 • బుక్స్ చ‌దువుకోవాలి. ఫ్రెండ్స్‌తో మ‌ధ్య మ‌ధ్య సొల్లు క‌బుర్లేసుకోవాలి. అదే ప‌నిగా మాట్లాడితే ఆయాస‌మొస్తాది. శాచురేష‌న్ ప‌డిపోతాది..జాగ్ర‌త్త‌.. క‌రోనా మాట‌లు మాట్లాడి సింప‌తీ కొట్ట‌కండి.. భ‌య‌పడి ఆసుప‌త్రిలో చేరామంటే దూల తీరుస్తారు. యూట్యూబ్‌లో ప్రాంక్‌లు, కామెడీలు చూసుకోవాలి. టీవీలు వార్త‌లు గ‌ట్రా చూడ‌రాదు. వాటి బ‌దులు హ‌ర్ర‌ర్ సినిమాలు చూసినా కాస్త న‌యం.
 • చ‌లో 15 రోజులు కాగానే బ‌య‌ట‌కు వ‌చ్చి ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో క‌లిసి ..జుంబారే..జూజుంబ‌రే…జుంబారే..జుంబ‌రాహి జుంబారే..డాన్స్ చేయాలి.
 • చివ‌రి మాట‌… బాగ‌వుతానే తిరుప‌తి కి పోయి గుండు కొట్టించుకొని వేలు రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టుకొని ఆ దేవునికి ధ‌న్య‌వాదాలు తెలిపేముందు, ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్ట‌ర్ కి కూడా ఓ ప‌దో ప‌ర‌కో ఏయండ‌య్యా సామీ.. అస‌లే మార‌టోరియం(moratorium) కూడా లేద‌ట ఈసారి..!(న‌వ్వుతూ!).

Share link

Leave a Comment