home guard khammam ఖమ్మం: జిల్లాలోని హోంగార్డు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయన్ని పోలీసు కమిషనర్ విష్ణు యస్.వారియర్ శుక్రవారం అందజేశారు. పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న హోంగార్డులకు శాఖ పరంగా మంజూరైన మెడికల్ బిల్లులు మొత్తాన్ని, మరియు హోంగార్డు కుటుంబ సభ్యులలోని మెరిట్ విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ను పోలీసు కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. ఉద్యోగ విరమణ పొందిన, చనిపోయిన హోంగార్డు బాధిత కుటుంబాలకు హోంగార్డులు స్వచ్ఛందంగా సమకూర్చుకున్న నగదును మొత్తాన్ని కూడా కమిషనర్ చేతుల మీదుగా (home guard khammam)బాధితులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ శ్రీశైలం, హోంగార్డు అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, ఉపాధ్యక్షుడు మహ్మద్ రఫీ, కార్యదర్శి బంక శ్రీను, జాయింట్ సెక్రటరీ నీరజ. విజయ కుమార్, కంపెనీ కమాండర్ ఇనపనూరి వెంకటేశ్వర్లు, రహీమ్, ఉపేందర్, శ్రీను పాల్గొన్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!