home cleaning: ఇంటిని చూడు..ఇల్లాలిని చూడు..అన్నారు పెద్దలు. అవును, ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే ఆ కుటుంబమూ బాగుంటుంది. వాతావరణమూ బాగుంటుంది. కాబట్టి ఇల్లు పరిశుభ్రం చాలా ముఖ్యమైనది!. ఇంటిని ఎలా శుభ్రం (home cleaning) చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
home cleaning: పరిశుభ్రంగా ఉండాలంటే!
స్టవ్‌పై పడిన నూనె, ఇతర జిడ్డు మరకలు వదలాలంటే రోజూ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నిమ్మకాయ ముక్కతో రుద్దితే Stove పై మరకలు సులువుగా వదులుతాయి. సింక్‌ను బేకింగ్ సోడా వేసి కడిగితే శుభ్రం కావడంతో పాటు వాసన రాకుండా ఉంటుంది. వైట్ వెనిగర్ వేసి కూడా శుభ్రం చేసుకోవచ్చు.
డ్రెస్సింగ్ టేబుల్, వాష్ బేసిన్ దగ్గర ఉండే అద్దంపై మరకలు తొలగించుకోవాలంటే ముందుగా కొన్ని నీళ్లు చల్లి తుడవాలి. తరువాత News Paper తో తుడవాలి. ఇంకా మరకలు ఉన్నట్లయితే పౌడర్ వేసి రుద్దితే చాలు. కార్పెట్‌ను వారానికోసారైనా శుభ్రం (home cleaning) చేయాలి. వాక్యూమ్ క్లీనర్ ఉంటే దానితో శుభ్రం చేసుకోవచ్చు. అలర్జీ సమస్యలు రావడానికి కార్పెట్‌లో పేరుకుపోయే దుమ్ము కారణమవుతుంది.
కార్పెట్‌పై టీ, కాఫీ లేక ఇతర మరకలు పడితే వెంటనే శుభ్రపరుచుకోవాలి. వదిలేస్తే తరువాత మరకలను శుభ్రం చేయడం కష్టమవుతుంది. కార్పెట్‌పై పడ్డ మరకలను తొలగించడానికి ఏదైనా Acid ను ఉపయోగిస్తున్నట్లయితే ముందుగా పరీక్షించాలి. కొన్ని రకాల యాసిడ్‌ల వల్ల కార్పెట్ రంగు పోయే ప్రమాదం ఉంటుంది.


ప్రతి వారం ఫ్రిజ్‌ను శుభ్రం చేసుకోవాలి. కొన్ని కూరగాయలు తెచ్చి ఫ్రిజ్‌లో పెడతారు. వాటిని అలాగే వదిలేస్తారు. క్యారెట్‌లాంటివి ఫ్రిజ్‌లో పెట్టినా నాలుగైదు రోజులకన్నా ఎక్కువగా తాజాగా ఉండవు. అలాంటి కూరగాయాలను తీసేయాలి. కంప్యూటర్, టీవీని రోజూ తుడవాల్సిందే. మానిటర్, కీబోర్డును పాత పేయింట్ Brush తో శుభ్రం చేసుకోవాలి. కిటికీలకు మస్కిటో జాలీలు ఉన్నట్లయితే అప్పుడప్పుడు తీసి నీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి బ్రష్‌తో శుభ్రం చేసుకుంటే దుమ్ము లేకుండా ఉంటాయి.