home clean tips శీతాకాలంలో గాలిలో తేమ ఎక్కువుగా ఉంటుంది. దీంతో అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఆ సంగతులేమిటో ఒకసారి (home clean tips)చూద్దాం.
గుమ్మం దగ్గర ఉండే డోర్మ్యాట్తోనే పరిశుభ్రతను ప్రారంభించాలి. రెగ్యులర్గా మనం ఇంట్లోకి బయటకి తిరిగేటప్పుడు కాళ్లకు ఉండే మట్టి అంటేది డోర్ మ్యాట్కే కదా. కాబట్టి డోర్ మ్యాట్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి దీన్ని మార్చే పనిచేయండి.


కిటికీలు తెరిస్తే వెలుతురు ధారాళంగా వస్తుంది. అయితే దీంతో పాటు దుమ్ము కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది. అందుకే కిటికీల డోర్లను అస్తమానం తీయకుండా కొద్ది సేపు తీసి మూసేయాలి. ఇక కిటికీ అద్దాలకీ దుమ్మ రేణువులు, సూక్ష్మజీవులు కూడా ఎక్కువుగా అంటి పెట్టుకుని ఉంటాయి. ఏం కాదులే అని అలాగే వదిలేయకుండా కిటికీలను ప్రతిరోజూ శుభ్రం చేస్తుండాలి. దీనివల్ల సీజనల్ అలర్జీస్ నుంచి బయటపడవచ్చు.


ఇంటినంతా క్లీన్గా కడిగి శుభ్రంగా ఉంచడంతో పాటు గోడ మూలాల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని తీశేయాలి. ఇంట్లో చెత్తని తొలగించడంలో అజాగ్రత్త ఉండకూడదు. ముఖ్యంగా బాత్రూమ్, వంటగదుల్లో ఎక్కువుగా సూక్ష్మజీవులు పెరగడానికి అనువుగా ఉంటుంది. అందుకే వీటిపై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. గాలిలో తేమను తగ్గించడానికి తలుపులు తెరిచి తాజా గాలిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇంటి ముందు చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి వస్తుంది. తేమ శాతం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల నుండి కొంతవరకు రక్షణ పొందవచ్చు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!