home and garden | ప్రియా కొన్ని మొక్కలు కొని తన ఇంటిపైన నాటింది. కానీ అవి బతకడం లేదు. కారణమేంటో అర్థం కావడం లేదు. ఎన్ని మొక్కలు కొని నాటినా నిలవకపోయే సరికి ఇక మొక్కలు పెట్టడం వృథా అనే నిర్ణయానికి వచ్చేసింది. అసలు, మొక్కలు ఎందుకు బతకడం లేదు? వాటి సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వాటి గురించి ఇప్పుడు (home and garden)తెలుసుకుందాం.
ఇంట్లో మొక్కలు ఎలా పెంచాలి?
ఇంటి(home) దగ్గర ఉన్న ఖాళీ స్థలంలోను, మేడపైన ఆకుకూరలు, కూరగాయలు, Flowering Plants పెంచుకునే వారు మొక్కలు పెట్టి వాటిని నీరు పోయడంతోనే మన పని అయిపోందని అనుకుంటారు. అది పొరపాటు. ఆ తర్వాత మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కలకు రెండు పూటలా తగినంత నీరు పోయడంతో పాటు, సహజ Fertilizer అందించడం కూడా ప్రధానం. దీని కోసం ఇంట్లో వ్యర్థాలనే సహజ ఎరువులుగా వాడవచ్చు. మిగిలిపోయిన కాఫీపొడి మొక్కలకు చక్కటి ఎరువుగా ఉపయోగపడుతుంది.
వాడిన Coffee పొడికి నాలుగు కప్పుల నీళ్లు చేర్చి, Plantsకి పోస్తే ఆరోగ్యంగా ఉంటాయి. నెలకొకసారి చల్లటి టీ డికాషన్కు ముప్పావు భాగం నీటిని కలిపి మొక్కల మొదళ్లలో పోసినా మంచి ఫలితం కనిపిస్తుంది. Egg డొల్ల కూడా ఎరువుగా వాడుకోవచ్చు. డొల్లను చిదిమి కుండీలలో వేయాలి. ఇలా చేస్తే గుడ్డు డొల్లలోని పొటాషియం, క్యాల్షియం మొక్కలకు పుష్కలంగా అందుతుంది. అలాగే గుప్పెడు డొల్లలను ఓ బకెట్ నీటిలో వేసి బాగా మరగించి, ఎనిమిది గంటల తర్వాత బాగా చల్లబడ్డాక ఆ నీటిని మొక్కలకు పోస్తే, వాటికి చాలా బలం అందుతుంది కూడా.

home and garden
విరిగిపోయిన Milkను వృథాగా పారబోయకుండా వాటికి నాలుగురెట్లు నీటిని కలిపి చెట్ల వేళ్లు తడిసేలా పోస్తే మొక్కలకు మంచి పోషణ లభిస్తుంది. అయితే తరుచుగా ఇలా చేయకుండా పదిరోజులకొకసారి చేస్తే మంచింది. News paperలో కాఫీ గింజలను ఉడికించి, పొట్లంలా చుట్టి మొక్కల మొదళ్ల వద్ద ఉంచాలి. కాఫీ గింజల్లోని రసాయనాలను వేర్చు పీల్చుకున్నాక పేపర్లు ఎండిపోతాయి. అప్పుడు వాటిని తీసేస్తే సరిపోతుంది. కాఫీ గింజల ద్వారా మొక్కలకు మెగ్నీషియం, Potassium మెండుగా లభిస్తాయి. అలాగే కూరగాయలు కడిగిన నీళ్లు, కూరగాయల తొక్కు, ఇలా అన్ని వ్యర్థాలను మొక్కలకు ఎరువుగా ఎంతో ఉత్తమం.