holi skin care tips | దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు ఆకాశానంటాయి. భారత దేశంలో కోవిడ్ ప్రభావం తగ్గడంతో ప్రజలు హోలీ పండుగను చాలా సంతోషంగా జరుపుకున్నారు. చిన్న, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీధుల్లో హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. రంగు రంగుల కలర్స్‌ను జల్లుకొని తమ ఆత్మీయులతో ఉత్సాంగా, ఉల్లాసంగా సంబురాల్లో తేలిపోయారు. పూర్వ కాలంలో హోలీ(holi) సంబురాల్లో రంగులు బదులు సహజంగా లభించే పొడులను తయారు చేసుకొని హోలీ చేసుకునే వారు. ఇప్పుడు అందరూ బిజీ బిజీగా గడపడంతో కెమికల్స్ కలిపిన రంగులతో హోలీ చేసుకుంటున్నారు.
పూర్వం మోదుగు పూలను పొడి చేసుకొని హోలీ జరుపుకునేవారట. ఇప్పుడు వాడుతున్న రకరకాల కెమికల్స్ రంగులతో స్కిన్ ఎలర్జీ, దురదలు, మొఖంలో అందం కోల్పోవడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి నిపుణులు చూపించిన కొన్ని టిప్స్‌ను మీరు ఫాలో అయితే పూర్వ చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే హోలీ ఆడిన ప్రతి ఒక్కరూ కింద తెలిపే టిప్స్‌ను పాటించండి తద్వారా స్కిన్ ఎలర్జీల నుండి కాపాడుకోవచ్చు.
holi skin care tips
మన ఇంటిలో దొరికే పసుపు(Turmeric) చాలా విలువైనదిగా అందరికీ తెలుసుకు. ఇందులో వ్యాధి నిరోధక శక్తి కూడా ఉండటంతో, క్రిములను చంపే గుణం ఉండటంతో రోజూ కూరలో వేసుకుంటుంటాం. అలానే అప్పుడ ప్పుడు ముఖంకు కూడా ఫేస్ ప్యాక్‌లా పెట్టుకుంటూ ఉంటాం. దీని వల్ల చర్మం నిగారింపు కూడా వస్తుంది. అయితే హోలీ లో రంగులు పూసుకున్నవారు మీ ఇంట్లో ముందుగా 4 భాగాలు పెరుగు తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ తేనె కలపాలి. అలా కలిపిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి కలపండి. హోలీ ఆడిన వారు దీనిని కొన్ని రోజుల పాటు ముఖానికి, చేతులకు, కాళ్లకు అప్లై చేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

వేప చెట్టు ఎన్నో దివ్య ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మన పల్లెటూర్లలో ఇప్పటికీ వేప పుల్లతో పళ్లు తోముకునే అలవాటు ఉంది. అలానే వేప ఆకులతో కూడా ఎన్నో ఆయర్వేద వైద్యాలు చేస్తూనే ఉంటారు.ముఖ్యంగా చర్మంపై దద్దర్లు, దురద ఉన్నవారు వేప ఆకు పేస్టుతో వాడితే ముఖంపై ఉన్న చర్మం సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ముందుగా కొన్ని నీళ్లగాను బాగా వేడి చేసిన తర్వాత అందులో వేపాకులు వేయాలి. కానీ వీటిని ఉడకబెట్టకూడదు. కొద్ది సేపటి తర్వాత ఆ నీటిని వడకట్టి తలస్నానానికి, చర్మం శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించాలి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!