Holi Safety Rules 2022 | హోలీ పండుగకు ఉపయోగించే రంగులన్నీ రసాయనాలే కావడంతో ఆనందం పంచాల్సిన రంగులు అనారోగ్యాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఈ పండుగను కుటుంబ సభ్యులతో, ఆత్మీయలతో ఆనందంగా జరుపుకుంటాం. కానీ…అందులోనూ కొన్ని జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదు. రసాయనాలతో ఆనందంగా జరుపుకుంటాం. కానీ అందులోనూ కొన్ని జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదు. రసాయనాలు లేని రంగులు, చెట్ల పూవుల నుంచి తయారు చేసిన రంగులను చల్లకుంటే మంచిది. పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో విరివిగా దొరికే బంతి, మోదుగా, తంగెడు, మందార పూల నుంచి వేప, గుంట గలుకరాకు, సరస్వతీ ఆకు, నల్లమద్ది, తెల్లమద్ది, పనస బేరడులను వినియోగించి చక్కగా రంగులు తయారు చేసుకోవచ్చు.
ఈ ఆకులను, పూలను నీడలో ఎండబెట్టిన తర్వాత ఓ రాత్రంతా నీళ్లలో నానబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి. ఇప్పుడు వడబోయగా వచ్చిన రంగు నీళ్లతో హాయిగా హోలీ ఆడుకోవచ్చు. అలాగే రంగుల పొడి కావా లంటే శనగ పిండి, గోధుమపిండిలు కలిసి ఆరబెడితే సరిపోతుంది. బీట్ రూట్ తొక్కలు, గోరింటాకు నీటిలో నానబెట్టి రంగులు తయారు చేసుకోవచ్చు.
Holi Safety Rules 2022 | రసాయన రంగులతో వ్యాధులు
మార్కెట్లో దొరికే రసాయన రంగులు, పౌడర్లతో హాని పొంచి ఉంది. అన్ని రంగుల్లోనూ పొడిగా ఉండేందుకు వాడే సున్నం బొబ్బలకు కారణమవుతుంది. నేలపై పడటం వల్ల వాతావరణం కాలుష్యం, నీరు కలుషితం అవుతుంది. ఆకుపచ్చ రంగుల్లో క్రోమియం, కాపర్ ఆక్సైడ్ ఉంటాయి. వీటి వల్ల జుట్టు రాలిపోతుంది. గోధుమ/పసుపు రంగుల్లో ఉండే రసాయనం కళ్లకు హాని చేస్తుంది. నీలి రంగులో ఉండే సెరెనియమ్, బ్రోమియం రసాయానలు తీవ్ర కాలుష్యం సృష్టిస్తాయి. పసుపు రంగులో ఉండే బెంజిన్, బొరాన్ రసాయనాల వల్ల జీర్ణకోశ వ్యాధులు ఏర్పడతాయి. క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.
ఈ సూచనలూ ముఖ్యమే!
రసాయన రంగులకు బదులు హెన్నా(గోరింటాకు పొడి), పసుపు, కుంకుమ, చందనం, బుక్కగూలాలు, మోదుగు పూలతో తయారైన రంగులు, టమాట గింజలతో తయారైన పొడి ఇలా సహజ సిద్ధ రంగులు వాడాలి. రసాయనాలు కలిపిన రంగులతో హోలి ఆడితే, వాటిని శరీరంపై ఎక్కువ సమయం ఉండనీ యకండి. వెంటనే చల్లని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోండి. ఎక్కువుగా ఎరుపు, పింక్ రంగులనే హోలీ కోసం వాడండి. ఇవి తక్కువ గాఢత కలిగి ఉండటంతో శరీరంపై నుంచి సులభంగా తొలిగిపోతాయి.

గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ రంగులు ఎక్కువ రసాయనాలు కలిగి ఉన్న కారణంగా సులభంగా శరీరంపై నుంచి తొలగిపోవు. ఆడటానికి ముందు ముఖానికి మాయిశ్చరైజర్‌ని, తలకు నూనెను రాసుకోవడం ఉత్తమం. దీంతో రంగులు శరీరంలోకి ఇంకవు. రంగులను శుభ్రం చేయడం కూడా సులభమవుతుంది. చాలా మంది రంగుల్లో వివిధ ఆయిల్స్ కలిపి రాస్తూ ఉంటారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందుకే రంగుల్లో ఎలాంటి ఆయిల్స్ గానీ నీటిని కలప కుండా హోలీ ఆడితే నీటి వృధాను అడ్డుకోవచ్చు.
పాటించాల్సి జాగ్రత్తలు!
రంగులు కళ్లలో పడకుండా కళ్లకు రక్షణ అవసరం. వీలైతే కళ్లద్దాలు ధరిస్తే మంచిది. మందంగా ఉన్న దుస్తులు, పొడుగు చేతి చొక్కాలు ధరిస్తే శరీరానికి రక్షణగా ఉంటుంది. ఆ దుస్తులను మళ్లీ ఉపయోగించొద్దు. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరిస్తే మేలు. తలకు, శరీరానికి నూనె రాసుకోవడంతో హానికర రసాయానాల నుంచి రక్షణ పొందవచ్చు. శరీరంపై పడ్డ రంగులను సులభంగా తొలగించవచ్చు. జుట్టుపై హానికర రంగులు పడకుండా టోపీ ధరించాలి. గోరు వెచ్చని నీటితో రంగులను శుభ్రం చేసుకోవాలి.
కళ్లలో రంగులు పడితే చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. కళ్లు ఎరుపెక్కడం, మంటగా ఉండటం, నీరు కారడం జరిగినా, ఏదైనా అవసరమైతే వైద్యుడి వద్దకు తప్పనిసరిగా వెళ్లాలి. ఏదైనా ప్రమాదం జరిగితే సొంత వైద్యం వంటివి చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. తలపై ఇతర ప్రదేశాల్లో కోడిగుడ్డుతో కొట్టడం, బురద నీరు చల్లడం లాంటి వాటికి దూరంగా ఉండాలి. రంగులతో శరీరంపై మంటలు పుట్టడం, దద్దుర్లు రావడం జరిగితే శరీరాన్ని ముందుగా చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. తరువాత కొబ్బరి నూనె రాసుకుని చర్మ వైద్యుడిని సంప్రదించాలి. నోరు, చెవి, ముక్కులో రంగు పోకుండా జాగ్రత్త పడాలి. మహిళలు, యువతులు ఆభరణాలపై శ్రద్ధ వహించాలి. సాధ్యమైనంత వరకు రంగులు చల్లేందుకు పిచికారీ పద్ధతులనే వాడాలి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ