history of marriage timelineఈనాడు ప్రపంచ దేశాలన్నింటిలోనూ వివాహ వ్యవస్థ ఉంది. మానవ చరిత్రను పూర్తిగా అధ్యయనం చేస్తే వివాహాలు మూడు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది అనాగరిక వివాహం. రాతియుగంలో నచ్చిన స్త్రీని బలవంతంగానైనా గుహకు తీసుకు వెళ్లడం. రెండవది ఒప్పందపు పెళ్ళి. అంటే మనువాడే స్త్రీ కుటుంబానికి కొంత సొమ్ము లేదా పశువులు లాంటివి ఇచ్చి వివాహం చేసుకోవడం. దీనిని కన్యాశుల్క పద్ధతి అని కూడా చెప్ప వచ్చు. మూడవది నేటి ఆధునిక సమాజంలో జరుగుతోన్న వివాహం. నైతికంగా స్త్రీ, పురుషులిద్దరి మధ్య కలిగే అనుబంధమే (history of marriage timeline)నేటి వివాహం.


అయితే ఈ వివాహాలు ఆయా ప్రాంతాల సాంఘిక ఆచారాలను బట్టి జరుగుతున్నాయి. ఉదాహరణకు క్రైస్తవులు చర్చిలో వివాహం జరిపితే, హిందువులు అగ్ని ముందు జరుపుతారు. భారతీయ వివాహాలలో ప్రధానానికి ప్రాముఖ్యత ఉంది. ఉంగరం ఆకారం సంపూర్ణంగా ఉండటం వల్ల వివాహానికి ఈ ప్రధానం ద్వారా పరిపూర్ణత ఏర్పడుతుందని భావన. వివాహానంతరం వధూవరులు భార్యభర్తలుగా పిలువబడతారు. వీరిరువురి మధ్య సఖ్యత లేనప్పుడు చట్టబద్ధంగా విడిపోయేందుకు విడాకుల చట్టం కూడా అన్ని దేశాలలోనూ అందుబాటులో ఉంది.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?