Highway Killer Munna : ప్ర‌కాశం హైవే కిల్ల‌ర్ మున్నా గ్యాంగ్‌కు ఉరిశిక్ష‌

Spread the love

Highway Killer Munna : ప్ర‌కాశం జిల్లాలో 2011 సంవ‌త్స‌రంలో హైవేపైన ఏడుగురు లారీ డ్రైవ‌ర్ల‌ను, క్లీన‌ర్ల‌ల‌ను అతిదారుణంగా చంపి లారీతో పాటు స‌రుకును లూటీ చేసి ఎవ‌రికి అనుమానం రాకుండా మృత‌దేహాల‌ను పూడ్చిపెట్టిన ఘ‌ట‌న‌లో మున్నా గ్యాంగ్ కు ఉరిశిక్ష ప‌డింది.


Highway Killer Munna : 2011 సంవ‌త్స‌రంలో ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో హైవేపై జ‌రిగిన హ‌త్య‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. లారీ డ్రైవ‌ర్లు, క్లీన‌ర్లే ల‌క్ష్యంగా సీరియ‌ల్ హ‌త్య‌లు చోటు చేసుకున్నాయి. మొత్తం 7 ఘ‌ట‌న‌ల్లో 13 మంది హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డింది మున్నా అత‌డి గ్యాంగ్ అని పోలీసులు గుర్తించారు. ఆ గ్యాంగ్‌ను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజ‌రు ప‌రిచారు. ఈ నేప‌థ్యంలో అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుదీర్ఘ కాలంగా సాగిన విచార‌ణ అనంత‌రం ఒంగోలులోని 8వ అద‌న‌పు సెష‌న్స్ కోర్టు, మున్నా అత‌డి గ్యాంగ్‌కు ఉరిశిక్ష‌లు విధించింది. ఇందులో ప్ర‌ధాన ముద్దాయిగా ఉన్న మున్నా, అత‌డికి స‌హ‌క‌రించిన 11 మందికి ఉరిశిక్ష విధించింది. మ‌రో ఏడుగురురికి యావ‌జ్జీవ కారాగార‌శిక్ష విధించింది.

క్రైమ్ సినిమాను త‌ల‌ద‌న్నేలా!

ప్ర‌కాశం – నెల్లూరు జిల్లాల మ‌ధ్య హైవేపై మున్నా గ్యాంగ్ సాగించిన మార‌ణ‌కాండ ఒళ్లు గ‌గుర్పొడిచేలా, ఓ క్రైమ్ సినిమాకు తీసిపోని విధంగా ఉంది. ఐర‌న్ లోడుతో వెళ్లే లారీల‌ను టార్గెట్ చేసి డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ల‌ను చంప‌డం, ఆ పై ఐర‌న్ లోడుతో ఉన్న లారీతో ప‌రార‌వ్వ‌డం ఈ ముఠా ఘాతుకాల్లో ప్ర‌ధాన‌మైన‌ది. ఐర‌న్‌లోడు అమ్మేశాక‌, లారీల‌ను తుక్కు కింద విడ‌గొట్టి ఆ భాగాల‌ను కూడా విక్ర‌యించేవారు.

ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే దాడి!

ఈ ముఠా దాడి చేసే విధానం ప‌రిశీలిస్తే ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం జ‌రిగేద‌ని తెలుస్తోంది. హైవేపై వాహ‌నాలు త‌నిఖీ చేస్తున్న‌ట్టుగా లారీల‌ను ఆపేవారు. మున్నా అధికారి వేషంలో ఉండ‌గా, అత‌డి ప‌క్క‌న ఓ వ్య‌క్తి గ‌న్‌మెన్‌గా మెషీన్ గ‌న్ చేత‌బ‌ట్టి ఉండ‌టంతో వారు నిజంగానే అధికారుల‌ని భావించి లారీ డ్రైవ‌ర్లు త‌మ వాహ‌నాలు ఆపేవారు. చెక్ చేయాల‌నే నెపంతో లారీ డ్రైవ‌ర్లు, క్లీన‌ర్ల గొంతుక‌ల‌కు తాడు బిగించి దారుణంగా హ‌త్య చేసేవారు. తాము చంపిన డ్రైవ‌ర్ల‌, క్లీన‌ర్ల శ‌వాల‌ను గోతాల్లో కుక్కి హైవే ప‌క్క‌నే వాగుల్లో పూడ్చి పెట్టేవారు. దోపిడీ చేసిన ఐర‌న్ లోడును గుంటూరులో అమ్మేవారు.

త‌మిళ‌నాడుకు చెందిన ఓ లారీ య‌జ‌మాని ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు మున్నా గ్యాంగ్ ఆట‌క‌ట్టించారు. పాత ఇనుమును కొనే వ్యాపారుల‌పై దృష్టి పెట్టి, మున్నా క‌దిలిక‌ల‌ను గుర్తించారు. ఓ ద‌శ‌లో దేశం వ‌దిలి పారిపోవాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉన్న మున్నాను కర్ణాట‌క రాష్ట్రంలో ఓ ఫాంహౌస్ వ‌ద‌ద అరెస్టు చేశారు. అయితే ఆ ఫాంహౌస ఓ మాజీ ఎమ్మెల్యేద‌నే స‌మాచారం అప్ప‌ట్లో సంచ‌ల‌నమ‌య్యింది.

thunderstorm today:హెచ్చ‌రిక: జిల్లాలో వ‌రుస‌గా 10 రోజుల‌పాటు పిడుగులు?

thunderstorm today ప్ర‌కాశం: జిల్లాలోని వ‌రుస‌గా 10 రోజులు రైతుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌సిన ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఇటీవ‌ల అధిక మొత్తంలో అల్ప‌పీడ‌నాలు Read more

prakasam jilla news: విషాదం: ‘ఫోన్ మాట్లాడ‌వ‌ద్ద‌మ్మా’అన్నందుకు చివ‌ర‌కు ప్రాణాలే తీసుకుంది!

prakasam jilla news ప్ర‌కాశం: కూతురును ఫోన్ మాట్లాడ‌వ‌ద్ద‌మ్మా అన్నందుకు పురుగులు మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఏపీలోని ప్ర‌కాశం జిల్లా కంభం మండ‌లం పెద్ద Read more

Fake Currency : న‌కిలీ నోట్ల క‌ల‌కలం – ఇంట్లోనే ప్రింటింగ్ సెట‌ప్ పెట్టి!

Fake Currency : న‌కిలీ నోట్ల క‌ల‌కలం - ఇంట్లోనే ప్రింటింగ్ సెట‌ప్ పెట్టి! Fake Currency : ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో న‌కిలీ నోట్లు త‌యారు Read more

పంచాయ‌తీ ఏక‌గ్రీవాలు: నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి

పంచాయ‌తీ ఏక‌గ్రీవాలు: నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి Nandigama : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ అటు వైస్సార్‌సీపీలోనూ, ఇటు టిడిపి పార్టీలోనూ Read more

Leave a Comment

Your email address will not be published.