high speed train సంగారెడ్డి : మహారాష్ట్రలోని ఠాణె నుంచి సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు వరకు హైస్పీడు రైలు మార్గంపై కసరత్తు మొదలైంది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు బుధవారం జిల్లా కలెక్టరేట్ ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కొల్లూరు స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరేలా ప్రణాళిక వేస్తున్నట్టు వారు వివరించారు. ఈ స్టేషన్ పేరును హైదరాబాద్గా వ్యవహరించే(high speed train) అవకాశముందని తెలిపారు.
ఈ మార్గంలో హైదరాబాద్(కొల్లూరు),వికారాబాద్, గుల్బర్గా, షోలాపూర్, పండరీపుర్, బారామతి, పూణె,లోనోవాలా, నవీ ముంబాయి, ఠాణె మొత్తం పది స్టేషన్లుంటాయి. పది బోగీలు, 750 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇది నడుస్తుందని, ప్రాజెక్టు పూర్తికి 1,197.5 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశామని వారు తెలిపారు. ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో డీపీఆర్ పూర్తి కావొచ్చని కన్సల్టెన్సీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబాయికి మూడు గంటల్లో చేరుకోవచ్చని వెల్లడించారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?