Hero Suman | తెలుగు చిత్ర పరిశ్రమలో మా (MAA) అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్(Prakash Raj)కు జరిగిన ప్రాంతీయ బేధం విమర్శలపై హీరో సుమన్ తీవ్రంగా స్పందించారు. హీరో సుమన్ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ నిలబడితే ప్రస్తుత మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ తెలుగు సినిమా వాడు కాదు అని ప్రచారం చేశారని..దీనిపై మీ స్పందన ఏమిటని హీరో సుమన్‌ను (Hero Suman) అడిగారు.
అందుకు హీరో సుమన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో క్రీడాకారులకు, సినిమా వాళ్లకు, వ్యాపారం చేసే వారికి ప్రాంతీయ బేధాలు ఉండవని స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమపై ఆధారపడి ఎంతో మంది హీరోలు, టెక్నీషియన్లు, ఇతర నటులు బ్రతుకుతున్నారని అన్నారు. వీళ్లందరికీ నిర్మాతలు, దర్శకులు పూర్తి స్థాయిలో పనులు కల్పించ లేరని తెలిపారు. అలాంటప్పుడు వారు బ్రతకడానికి చెన్నైనో, కేరళ, కర్ణాటక ఇలా అనేక భాషల్లో సినీ పరిశ్రమల్లో పనిచేయడానికి వెళుతున్నారని అన్నారు. అప్పుడు అక్కడ వారు కూడా ఇలా మా వాడు కావు అని ప్రాంతీయ భేదం చూపితే ఒకరి కడుపు కొట్టిన వారు అవుతారని పేర్కొన్నారు.
కాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకాశ్ రాజ్ పై వారు అలా ప్రాంతీయ భేదం వ్యాఖ్యలు చేయడం తాను ఖండిస్తున్నానని అన్నారు. చిత్ర పరిశ్రమలో అందరూ సమానమేనని తెలిపారు. ఇప్పటి వరకు తనకు ఇలాంటి ప్రాంతీయ భేదం సమస్య ఏ భాషలోనూ ఎదురు పడలేదని అన్నారు. తాను చెన్నైలో పెరిగానని, దేశంలో అన్ని భాషల్లో చిత్ర పరిశ్రమల్లో నటించినప్పటికీ ఎవరూ ఇలా అనలేదని, నేను ఎవరునూ అనలేదని తెలిపారు.
ప్రపంచంలో అందరూ సమానమేని కరోనా వచ్చి మంచి పని చేసిందని తెలిపారు. కరోనా ఆ ప్రాంతం వాళ్లకు, ఈ ప్రాంతం వాళ్లకేనని సోకలేదని, అందరికీ సోకిందని కరోనా నుండి అందరం మంచి విషయాలు నేర్చుకోవాలని సూచించారు. భారత దేశంలో ప్రతి ఒక్కరం సమానమేనని, ఎక్కడా కూడా ఇలాంటి ప్రాంతీయ భేదాలు చోటు చేసుకోకూడదని అన్నారు. ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి భారత దేశంలో ఉందని గుర్తు చేశారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!