Hero Sonu Sood gifts mobile phones to the unit members of Acharya Movie | తోటి సిబ్బంది పట్ల ప్రేమను చాటుకున్న సోనూసూద్Hyderabad: హీరో సోనూసూద్ సినిమా వర్కర్ల పట్ల తన ప్రేమను చాటుకున్నారు. మెగస్టార్ చిరంజీ నటిస్తోన్న ఆచార్య సినిమా షూటంగ్ లో సుమారు 100 మంది సినిమా వర్కర్లకు మొబైల్ ఫోన్లు అందజేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హీరో రామ్‌చరన్ కొణిదెల, నిరంజన్ రెడ్డి నిర్మాతగా తీస్తున్న ఈ సినిమాలో మెగస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు.
2019లో అక్టోబర్ 8న ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇండియన్ రియల్ హీరో సోనూసూద్ కూడా నటిస్తున్నారు. సోనుసూద్ ఒక పక్క ప్రజలకు సేవలు చేస్తూ మరో ప్రక్క సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. గతేడాది కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో ఎంతో మంది అభ్యాగులకు, కార్మిక కుటుంబాలకు అండగా ఉన్న సోనూసూద్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తన సామాజిక సేవలు విస్తరింపజేసి ప్రజల మనస్సుల్లో దేవుడిలా నిలిచారు.


సోనూసూద్ సహకారంతో తన ట్ట్రస్ట్ ద్వారా ఎంతో మంది ఆపరేషన్లు చేపించుకొని ప్రాణం పోసుకున్నారు. వారి వారి జీవితాల్లో సోనూసూద్ చేసిన గొప్ప సహాయానికి వారి ఇళ్లల్లో సోనూసూద్ ఫొటో పెట్టి ఆరాధ్యిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నైతే గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఎంతో మందిని ఆదుకుంటున్న సోనూసూద్ ఆచార్య సినిమాలో ఖల్‌నాయక్‌గా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత తెలుగు సినిమాలో సోనూసూద్ నటించడంతో హీరోకు సమానంగా అభిమానులు జేజేలు పలుకుతున్నారు. ఏప్రిల్ లో విడుదల కానున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.
ఇది చదవండి: తెలుగు రాష్ట్రాలకు బర్డ్‌ఫ్లూ భయం! | చికెన్ ధరలపై ప్రభావం!