Balakrishna Birthday : ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Balakrishna Birthday : ఖమ్మం : హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఖమ్మంలోని గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జర్నలిస్టులకు, సినిమా థియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, సంఘ సేవకుడు నల్లమల్ల రంజిత్, ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్లు అందజేశారు.
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. ఈ కోవిడ్ కాలంలో ఉపాధి లేక సినీ కార్మికులు సుమారు 120 మంది ఉపాధి కోల్పోయి కుటుంబాలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులకు తన వంతు చిరు సహాయం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ చౌదరి, నల్లమల వేణ/, సతీష్, మధుతారక్, బాలాజీగుప్తా, ప్రవీణ్, కోటి తుమ్మలపల్లి, గోపి తదితరులు పాల్గొన్నారు.


- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!