Hero Balakrishna : బాలయ్యపై అందుకే అమితమైన ప్రేమ!
Hero Balakrishna : తెలుగు చిత్ర సీమలో అగ్రహీరోల్లో ఒకరైన, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంటే తెలుగు రాష్ట్రాల్లో గుండెలకు హత్తుకునే అభిమానులు ఉన్నారు. బాలయ్య సినిమా అంటేనే ఒక రేంజ్లో అభిమానులు సందడి చేస్తారు. బాలకృష్ణ చెప్పే డైలాగులు ఇప్పటికీ ఎప్పటికీ సోషల్‌మీడియాలో ఎక్కడో ఒక్కచోట వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి బాలయ్య కొన్ని సందర్భాల్లో తనకు వ్యక్తిగత ఇబ్బంది అనుకున్న చోట కాస్త ఆగ్రహం వ్యక్తం చేసేశారు. కానీ బాలకృష్ణను దగ్గరగా పరిశీలించిన వారైతే అతని ఆప్యాయత, పలకరింపు అభిమానులకు ఎంత దగ్గరగా చేస్తుందో తెలుస్తోంది.
తాజాగా బాలకృష్ణను ప్రేమించే వారికి బాలయ్య అభిమానిగా ఉన్నవారికి అభిమానిపై బాలయ్య చూపిన ప్రేమను, ఆప్యాయతను చూసి కన్నీళ్లు తెచ్చుకున్న దృశ్యం వార్తల్లో కెక్కింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని పత్తి మనోహర్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన ఆప్తుడైన కోటంరెడ్డిని ఆ అభిమాని ఇంటికి వెళ్లి అండగా ఉంటామని భరోసా ఇవ్వమని ఆజ్ఞాపించారు. ఆదివారం కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పట్టణంలోని నందమూరి వంశ వీరాభిమాని పత్తి మనోహర్ ఇంటికి వచ్చి వారి యొక్క సమస్యను తెలుసుకుని బాలయ్య బాబుకు ఫోన్ ద్వారా వివరించారు.
బాలయ్య బాబు పత్తి మనోహర్‌కు ఫోన్ ఇవ్వమని చెప్పగా, మనోహర్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నాడు. బాలయ్య థైర్యాన్ని ఇస్తూ నువ్వు మళ్లీ మామూలు మనిషివి అవుతావని భరోసా ఇచ్చారు. మన వాళ్లందరూ నీకు అండగా ఉంటారని, మన కుటుంబ సభ్యుడిని కాపాడుకోవడం నా హక్కు అంటూ తెలిపారు.
అనంతరం మనోహర్ భార్యతో మాట్లాడుతూ ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, మనోధైర్యంగా ఉండాలని, మనవాళ్లందరూ అండగా ఉండి సహకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, మాజీ ఎయంసీ ఛైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, నందమూరి వంశ కుటుంబ అభిమాని అన్నపూర్ణ శ్రీను, పట్టణ ఎస్సీ నాయకులు దేవకుమార్, పట్టణ ప్రచార కార్యదర్శి మంచాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి:ఇల్లందు మైన్స్‌లో ఆచార్య షూటింగ్!
ఇది చదవండి:మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీకి షాక్!
ఇది చదవండి:ఇనిమెళ్ల గ్రామంలో కొట్టుకున్న టిడిపి-వైసీపీ వర్గీయులు
ఇది చదవండి:ఎస్సైలనే బెదిరించిన కిలాడీ లేడి..చివరకు!
ఇది చదవండి:కొత్త పార్టీపై షర్మిల బిజీ! ఖమ్మం నేతలపై ఫోకస్!
ఇది చదవండి: ఆ చేప మహా డేంజర్! తగిలితే అంతే సంగతులు!
ఇది చదవండి: అన్నపై ఎంత అభిమానమో!
ఇది చదవండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!