hernia operation

hernia operation: హెర్నియాకు అత్య‌వ‌స‌ర వైద్యం అవ‌స‌రం!

Health News

hernia operation : మ‌న శ‌రీరంలోని వివిధ భాగాలు నిర్దిష్ట స్థానంలో స్థిరంగా ఉండేలా చూసేవి కండ‌రాలు. కండ‌ రాల‌లోని ఒక బాగం ఏదైనా బ‌ల‌హీన‌మైతే అక్క‌డ ప‌ట్టు స‌డ‌లి ఆ భాగం కిందికి జారుతుంది. అలా జారిన దానినే హెర్నియా అంటారు. ఉద‌రం కింది భాగంలో ఆ జారుడు క‌నిపిస్తే దానిని ఇంగ్విన‌ల్ హెర్నియా అంటారు. (ఆ భాగంలో వుండే ఇంగ్విన‌ల్ కుల్య పేరుమీద అలా పిలుస్తారు.)

కండ‌ర గోడ‌లోని బ‌ల‌హీన ప్రాంతంగుండా చిన్న‌పేగు బ‌య‌ట‌కు జారుతుంది. ఈ ఇంగ్విన‌ల్ హెర్నియా ఏ వ‌య‌సులోనైనా ఏర్ప‌డ‌వ‌చ్చు. స్త్రీల‌లో క‌న్నా పురుషుల‌లో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

hernia operation: హెర్నియాకు కార‌ణాలు

వ‌య‌సుతో క్ర‌మంగా ఇంగ్విన‌ల్ హెర్నియా పెరుగుతుంది. దీనికి కార‌ణాలు, ఉద‌ర కిందిభాగ‌పు కండ‌రాల మీద హ‌ఠాత్తుగా ప‌డిన తీవ్ర ఒత్తిడి, బాగా బ‌రువైన వ‌స్తువులు ఎత్త‌టం, మ‌ల‌బ‌ద్ధ‌కం, మ‌ల విస‌ర్జ‌న‌కు తీవ్రంగా ఒత్తిడి పెట్టాల్సి రావ‌డం. పొగ తాగే అల‌వాటు, ఊపిరితిత్తుల జ‌బ్బు వ‌ల్ల ఏర్ప‌డిన నిరంత‌ర ద‌గ్గు. భారీకాయం, గ‌ర్భం, ఎక్కువ స‌మ‌యం నిలుచుని వుండ‌టం లేదా భారీ బ‌రువుల‌ను ఎత్తే వృత్తి. గ‌తంలోనే ఇంగ్విన‌ల్ హెర్నియా ఏర్ప‌డి వుండ‌టం.

ఒక త‌ర‌హా హెర్నియా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. దీనిని స్ట్రాంగ్యులేటెడ్ ఇంగ్విన‌ల్ హెర్నియా అంటారు. బ‌ల‌హీన‌ప‌డిన కండ‌ర ప్రాంతం నుండి చిన్న‌పేగు (small intestine) కిందికి జారి తిరిగి ఉద‌రంలోకి వెళ్ళ‌నందున ఇది ఏర్ప‌డుతుంది. దీనివ‌ల‌న ర‌క్త ప్ర‌వాహం ఆగిపోతుంది. అదే జ‌రిగితే ర‌క్తం అంద‌ని ఆ పేగుభాగం జీవం కోల్పోతుంది. ఆ ప‌రిస్థితులో అత్య‌వ‌స‌ర ఆప‌రేష‌న్ జ‌ర‌గాలి.

ల‌క్ష‌ణాలు :

త‌క్కువ స్థాయి ఇంగ్విన‌ల్ హెర్నియాకు ప్ర‌త్యేకంగా ఎటువంటి ల‌క్ష‌ణాలు (Hernia Symptoms) వుండ‌వు. కాని వైద్య‌ప‌రీక్ష‌లో బ‌య‌ట‌ప‌డుతుంది. అధిక స్థాయి హెర్నియాకు ల‌క్ష‌ణాలు క‌నిపి స్తాయి. నిల‌బ‌డి న‌ప్పుడు గ‌జ్జ‌ల భాగంలో ఉబ్బిన‌ట్టుగా ఉంటుంది. ప‌డుకున్న‌ప్పుడు క‌నిపించ‌దు. పురుషుల్లో వృష‌ణం కిందికి జారుతుంది. గ‌జ్జ‌ల భాగంలో బాధ‌, బ‌రువులు ఎత్తుతున్నా, ద‌గ్గుతున్నా ఆ భాగంలో ఒత్తిడి ప‌డినా అధిక‌మ‌వుతుంది. గ‌జ్జ‌ల భాగంలో ఏదో తెలియ‌ని అసౌక‌ర్యం, బాధ‌.

స్టాంగ్యులేటెడ్ హెర్నియా ల‌క్ష‌ణాల్లో కొన్ని :

గ‌జ్జ‌ల భాగంలో తీవ్ర‌మైన నొప్పి, తాకితే మ‌రింత పెరుగుతుంది. జారిన భాగం ఎరుపు లేదా గులాబి రంగులోకి మార‌టం. జ్వ‌రం, క‌డుపులో తిప్ప‌టం, వాంతులు, మ‌ల‌విస‌ర్జ‌న కుద‌ర‌క‌పోవ‌డం, గ్యాస్ వ‌ద‌ల లేక‌పోవ‌డం.

శ‌స్త్ర చికిత్స :

హెర్నియాను గుర్తించిన త‌ర్వాత శ‌స్త్ర చికిత్సే మార్గం. ఎంత త్వ‌ర‌గా శ‌స్త్ర చికిత్స చేయించుకుంటే ఫ‌లితాలు అంత మెరుగ్గా ఉంటాయి. రోగి ఆసుప‌త్రిలో ఉండాల్సిన అవ‌స‌రం లేని శ‌స్త్ర చికిత్స‌. వీటిలో హెర్నియాగ్ర‌ఫీ (hernia operation) అనే త‌ర‌హా ఆప‌రేష‌న్‌లో బ‌ల‌హీన‌ప‌డిన కండ‌రాల‌ను తిరిగి య‌థాస్థానంలోకి నెడ‌తారు. హెర్నియాప్లాస్టీలో బ‌ల‌హీన‌ప‌డిన పేగు గోడ‌ను మూసివేస్తారు.

లాప్రోస్కోపీ (Laparoscopy) విధానంలో వైద్యుడు ఒక చిన్న గాటుపెట్టి, వీడియో కెమెరా క‌లిగిన చిన్న గొట్టాన్ని ఉద‌రంలోకి పంపుతారు. ఆ కెమెరా ద్వారా లోప‌లి భాగాల‌ను చూస్తూ పొడ‌వైన ప‌నిముట్ల స‌హాయం తో మెష్ ఏర్పాటు చేసి హెర్నియాను స‌రిదిద్దుతారు.

వైద్యుని సంప్ర‌దించాల్సిన ప‌రిస్థితి :

గ‌జ్జ‌ల భాగంలో జారిన‌ట్టు అనిపించినా, ఆ భాగంలో బాధ‌, ఒత్తిడి అనిపించినా, బ‌రువు లెత్తు తున్న‌ప్పుడు ఆ బాధ అధిక‌మైనా, జ్వ‌రం వ‌స్తున్నా వైద్యుడ్ని సంప్ర‌దించాలి.

అత్య‌వ‌స‌ర వైద్య స‌హాయం అవ‌స‌రం :

హ‌ఠాత్తుగా గ‌జ్జ‌ల భాగంలో తీవ్ర బాధ‌, గ‌జ్జ‌ల భాగంలో జారిన‌ది హ‌ఠాత్తుగా పెరిగి తిరిగి లోప‌లికి వెళ్లిన ప్పుడు. వృష‌ణంలో హ‌ఠాత్తుగా బాధ‌, వృష‌ణ ప‌రిమాణం పెరిగినా, జారిన గ‌జ్జ‌ల భాగం ఎరుపు లేదా గులాబి రంగుకు మారి తాకితే బాధ క‌లుగుతున్నా, క‌డుపులో తిప్పుడు లేదా వాంతులు పెరిగి ఎంత‌కీ త‌గ్గ‌క‌పోయినా అత్య‌వ‌స‌ర (hernia operation) వైద్య‌స‌హాయం అవ‌స‌రం.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *