Her Brilliant Career

Her Brilliant Career: మ‌న‌కంటే అమ్మ‌మ్మ వాళ్ల‌కే అన్నీ తెలుసు!

Special Stories

Her Brilliant Career | మ‌న‌మే బాగా చ‌దువుకున్నాం. మ‌న అమ్మా, అమ్మ‌మ్మ వాళ్ల త‌రానికి మ‌న‌కి తెలిసినంత కూడా తెలియ‌దు అనే భావ‌న మ‌నంద‌రిలో ఉంది క‌దా! బ్రిట‌న్ అమ్మాయిలూ అంతే అనుకుంటార‌ట‌. అప్ప‌టి త‌రం వాళ్ల‌కి అస‌లు ఫ్యాష‌న్లే తెలియ‌వ‌నీ, నిరాశ‌తో జీవితాన్ని నెట్టుకొచ్చే వార‌నీ అనుకునే వార‌ట‌. అయితే ఇందులో నిజం లేదంటూ రేచ‌ల్ కుకీ (Rachel cooke)అనే పాత్రికేయురాలు హార్ బ్రిలియంట్ కెరీర్ (Her Brilliant Career) – టెన్ ఎక్స‌ట్రార్డిన‌రీ విమెన్ ఇన్ ఫిప్టీస్ అనే పుస్త‌కం వెలువ‌రించింది.

ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత వివిధ రంగాల్లో ప్ర‌పంచానికి దిశానిర్థేశం చేసిన 10 మంది మ‌హిళ‌ల క‌థ‌నాలివి. ఆ ప‌దిమందిలో పేషెంట్స్ గ్రే ఒక‌రు. ఆమె రాసిన ప్లా డ్యూ జూర్ పుస్త‌క‌మే నేడు మ‌నం తింటున్న అనేక ఆధునిక వంట‌ల‌కు మూల‌మ‌ట‌. అయితే రోజు గ‌డ‌వడం క‌ష్ట‌మైన రోజుల్లో యుద్ధం కార‌ణంగా ఎక్క‌డెక్క‌డో త‌ల‌దాచుకొని ఆమె ఈ వంట‌ల పుస్త‌కాన్ని రాసింది. మ‌రో మ‌హిళ ఆలిస‌న్ స్మిత్ స‌న్ బ్రిట‌న్‌లోని ఇప్ప‌టి ఆధునిక క‌ట్ట‌డాల వాస్తు నిర్మాణానికి ఆద్యురాల‌ట‌. ఇక వినోద రంగంలో బెట్టీ బాక్స్ అనే మ‌హిళా నిర్మాత‌ని అప్పట్లోనే బెట్టీ బాక్సాఫీసు అని పిలిచేవార‌ట‌. యాభైఏళ్ల నాటి మ‌హిళ‌ల గొప్ప‌త‌నం తెలియ‌డానికి ఎంతో శ్ర‌మ‌కోర్చి, ఎన్నో అధ్య‌నాలు చేసి ఈ పుస్త‌కాన్ని రాసింది కుకీ.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *