Hepatitis Bతో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఇవి త‌ప్ప‌కుండా తెలుసుకోండి!

Hepatitis B | హెప‌టైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెప‌టైటిస్‌-బి వైర‌స్ ద్వారా ఈ వ్యాధి వ‌స్తుంది. ఈ హెప‌టైటిస్ బి వైర‌స్ మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత సాధార‌ణంగా చాలా మందికి కొద్ది రోజుల్లో కామెర్లు వ‌స్తాయి. దీన్ని అక్యూట్ ద‌శ అంటారు. కామెర్ల‌తో పాటు వికారం, అన్నం స‌యించ‌క‌పోవ‌డం, కొద్దిపాటి జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలూ ఉండొచ్చు. ఈ ద‌శ‌లో మ‌నం HBsAg ప‌రీక్ష చేస్తే పాజిటివ్ వ‌స్తుంది. అంటే ఏదో మార్గంలో Hepatitis B వైర‌స్ వీరి శ‌రీరంలో ప్ర‌వేశించింద‌ని, దాని కార‌ణంగా కామెర్లు వ‌చ్చాయ‌ని అర్థం. వీరికి లివ‌ర్ ఫంక్ష‌న్ టెస్టుల్లో కూడా కాస్త తేడాలుంటాయిని డాక్ట‌ర్లు అంటున్నారు.

సుర‌క్షితంగా ఉండేందుకు చిట్కాలు

ఔష‌దాలు, హార్మోన్లు, స్టెరాయిడ్లు మ‌రియు Vitamins ఎక్కించుకునేందుకు ఒక‌రు వాడిన సూదుల‌ను మ‌రొక‌రు వాడ‌కూడ‌దు. ఇంజ‌క్ష‌న్ చేసుకోవ‌డానికి ముందు చేతులు పరిశుభ్రంగా క‌డుక్కోవాలి. కండోమ్‌లు మ‌రియు బ్యారియ‌ర్లు ఉప‌యోగించ‌డం లైంగిక జ‌బ్బులు సంక్ర‌మించే అపాయాల‌ను త‌గ్గించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. అయితే Hepatitis B రోగుల‌తో పోల్చుకుంటే హెప‌టైటిస్‌-సి రోగుల్లో సంక్ర‌మ‌ణ అపాయం చాలా త‌క్కువుగా ఉంటుంది.

గ‌ర్భ‌ధార‌ణ కాలంలో లేదా బిడ్డ పుట్టిన స‌మ‌యంలో హెప‌టైటిస్‌-బి త‌ల్లి త‌న పాపాయికి సంక్ర‌మింప జేయ‌వ‌చ్చు. కాబ‌ట్టి గ‌ర్భం దాల్చ‌డానికి ముందు మీ Doctorను సంప్ర‌దించండి. హెప‌టైటిస్-సితో చాలా త‌రుచుగా క‌ల‌గ‌దు. ఆరోగ్య సంర‌క్ష‌ణ సెట్టింగుల్లో ప్రామాణిక సుర‌క్షిత ముందు జాగ్ర‌త్త‌గా పాటించేలా నిర్థారించుకోండి. రేజ‌ర్లు, Toothbrushలు, నెయిల్ క‌ట్ట‌ర్లు లేదా గుచ్చుకునే చెవి పిన్నులు లాంటి వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త వ‌స్తువుల‌ను మ‌రొక‌రితో పంచుకోవ‌ద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *