hemoglobin food | రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువుగా ఉండటం అనేది ముఖ్యంగా మూడు రకాల కారణాల వల్ల కావచ్చు. శరీరంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవడం, కొత్తగా తయారయ్యే వాటికంటే ఎక్కువ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాపోవడం, కొత్తగా తయారయ్యే వాటికంటే ఎక్కువ ఎర్ర రక్తకణాలు నశించిపోవడం, ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల ఎక్కువుగా రక్తం పోవడం, ఎర్రరక్త కణాలు తగినన్ని ఉత్పత్తి కాకపోవడానికి తగినంత ఐరన్ లేకపోవడం, థైరాయిడ్, కిడ్నీలు లేదా కాలేయ సమస్య ఉండటం, బి-12, ఫోలిక్ ఆసిడ్ లాంటి విటమిన్ల లోపం కారణాలు కావచ్చు.
hemoglobin food: హిమోగ్లోబిన్ తగ్గితే!
ఎక్కువ ఎర్రరక్త కణాలు నశించిపోవడానికి క్లోమపు వాపు, సికిల్ సెల్ ఎనీమియా, థలసీమియా మొదలైన కారణాల వల్ల కూడా హిమోగ్లోబిన్(hemoglobin food) తగ్గుతుంది. ఆహారం సరిగా తీసుకున్నా హిమోగ్లోబిన్ తక్కువుగా ఉందంటే ముదంఉగా వైద్యులను సంప్రదించి సరైన కారణాన్ని నిర్థారించుకోవాలి. ఒక వేళ సమస్య పోషకాహార లోపం వల్ల వచ్చినదైతే హిమోగ్లోబిన్ బాగా తక్కువుగా ఉన్నప్పుడు కేవలం ఆహార మార్పులతో పెంచడం సాధ్యం కాదు. మందులు వాడాలి. వాటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థిరపడేలా చూసుకోవచ్చు.


ఐరన్ అధికంగా ఉండే ఆహారం!
దీని కోసం ఐరన్ అధికంగా ఉండే ఆహారం మంచిది. కోడి, చేప లాంటివి వారానికి మూడు సార్లు తీసుకుంటే తగినంత ఐరన్ లభిస్తుంది. శాఖాహారులైతే అన్నిరకాల పప్పులు, నల్ల శనగలు, అలసందలు, ఉలవలు, సోయాబీన్స్ చిక్కుళ్లు మొదలైన గింజలను తీసుకోవాలి. ఇంకా ప్రతిపూటా తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు తప్పనిసరి. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను లేదా పండ్ల రసాలను తీసుకోవాలి.
మనం తీసుకునే ఆహారం శక్తిని, పోషకాలను ఇవ్వడమే కాకుండా రక్తంలో గ్లూకోజు పరిమాణం సరిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పరిపూర్ణ ఆరోగ్యవంతులైనవారు ఎక్కువసార్లు తక్కువుగా లేదా పన్నెండు గంటలకోసారి మాత్రమే తగిన(hemoglobin food) ఆహారం తీసుకున్నా వారి శరీరం గ్లూకోజును సక్రమంగా నియంత్రిస్తుంది. కాబట్టి హైపర్ గ్లెసీమియా లేదా హైపో గ్లేసీమియా లాంటివి రావు. కానీ మధుమేహం, గుండె సమస్యలు, క్లోమం, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సమస్యలు మొదలైనవి ఉన్నవారు వీలున్నంత వరకు రోజుకు నాలుగు లేదా ఐదుసార్లు పరిమిత మోతాదులో ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం.


కొత్త ఆహారం తీసుకోవాలి!
ముఖ్యంగా మధుమేహ చికిత్స కోసం ఇన్సులిన్ తీసుకుంటున్నవారు ప్రతి రెండు మూడు గంటలకోసారి కొంత ఆహారం తీసుకోవాలి. అయితే ఆరోగ్యవంతులు కూడా తక్కువ మోతాదుల్లో ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకుంటే నష్టమే ఉండదు. రోజు మొత్తంలో పలుమార్లు ఆహారం తీసుకున్నా లేదా రెండు మూడు సార్లు తీసుకున్నా లేదా రెండు మూడు సార్లు తీసుకున్నా, ఆ ఆహారం సమతులమైనది అయినప్పుడే ఆరోగ్యవంతమైనది అవుతుంది. జీవక్రియ వేగం ఎక్కువుగా ఉండేవారు, పిల్లలు మాత్రం రోజుకు మూడు పూటలే కాకుండా మధ్యలో అల్పాహారం తీసుకుంటే తరుచూ ఆకలి వేయకుండా ఉంటుంది. శ్రమ, ఆటల వల్ల అలసట, నీరసం తగ్గించవచ్చు.