Heart transport on the metro train in Hyderabad
Hyderabad: ఓ రైతుకి ప్రమాదవశాత్తు బ్రెయిన్‌డెడ్ అయ్యింది. అయితే రైతు కుటుంబ సభ్యులు గుండెను దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో రైతు గుండె(Heart)ను మరో వ్యక్తికి అమర్చనున్నారు. అయితే ఆ వ్యక్తి గుండెను మరో ప్రదేశానికి తరలించడానికి మెట్రో రైలు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైలులో తొలిసారిగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను తరలించారు. మెట్రో రైలు అధికారుల సహాయంతో అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా గుండెను తరలించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చేందుకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. వైద్యులు గోకులే నేతృత్వంలో ఈ గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ దృష్ట్యా గుండెను తరలించేందుకు వైద్యులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. మెట్రో అధికారులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో గుండె తరలింపు లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు.
ఇది చదవండి:టిడిపి నేత పట్టాభిపై కారుదాడి, గాయాలు
ఇది చదవండి:అచ్చెన్నాయుడు అరెస్టు | నిమ్మాడలో ఉద్రిక్తత
ఇది చదవండి:సర్వీస్ పర్సన్స్ గోడు వినాలి: ఎఐటియుసి
ఇది చదవండి:పంచాయతీ తీర్పులో మాజీ సర్పంచ్‌పై కత్తితో
ఇది చదవండి:మదనపల్లె కేసు వాదనకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది
ఇది చదవండి:భారత దేశంలో కార్మిక ఉద్యమ చరిత్ర పూర్వ పరిస్థితి!
ఇది చదవండి: జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్