Heart Touching Story

Heart Touching Story: నిజ‌జీవితం అంటే? రెండున్న‌ర గంట‌ల సినిమా కాదు

Telugu stories
Share link

Heart Touching Story: ఒక‌సారి 45 ఏళ్ల వ‌య‌సున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జ‌డ్జిగారు ముందు ఆమె ఇలా విన్న‌వించ‌కుంది. ‘మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అంద‌రి ఇళ్ల‌ళ్లో ప‌నిచేసి తెచ్చిన డ‌బ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అంద‌రినీ అడుక్కునీ ఎలాగోలా నా కూతురికి మంచి చ‌దువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి క‌ష్టం తెలియ‌కుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చ‌దివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా క‌ష్టాలు తీరాయి.. అనుకునే లోపు అమ్మాయి క‌నిపించ‌కుండా పోయింది. ఎవ‌రైనా మాయ‌మాట‌లు చెప్పి మోసం చేసి ఎత్తుకుపోయారేమో!’ అని చెప్పింది.

Heart Touching Story

ఆమె చెప్పిన మాట‌లు విన్న జ‌డ్జిగారు ఆ విష‌యం గురించి పూర్తిగా విచారించ‌గా, ఆ రోజు వాళ్ల అమ్మాయి కోర్టుకు వ‌చ్చింది. బోనులో ఎదురెదురుగా త‌ల్లి కూతుర్లు. ఆ అమ్మాయి క‌ళ్ల‌ల్లో ఏమాత్రం ప్రేమ క‌నిపించ లేదు. త‌ప్పు చేశాన‌న్న ప‌శ్చాత్తాప‌మూ లేదు. ఆ అమ్మాయి.. న‌న్ను ఎవ‌రూ మోసం చేయ‌లేదు. న‌న్ను ఎవ‌రూ ఎత్తుకుని పోలేదు. నేను మేజ‌ర్‌ని నాకు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పంది.

ఇంట్లో వాళ్ల‌కు ఒక్క‌మాటైనా చెప్పాలి క‌దా!..అని అడ‌గాల‌ని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాష‌ణ‌లు ఉండ‌రాదు. క‌నుక ఒక గంట సేపు త‌ల్లి కూతుర్లు మాట్లాడుకోవాల్సిందిగా జ‌డ్జిగారుత తీర్పు ఇచ్చారు. జ‌డ్జిగారి ఆశ ఏమిటంటే? ఒక వేళ ఆ త‌ల్లీకూతుళ్లు క‌లిసి మాట్లాడుకుంటే, ఆ త‌ల్లి క‌ష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుంద‌ని, గ‌తాన్ని త‌ల‌చి ఆమె మారుతుందేమో అని. ఆయ‌న‌కూ మ‌న‌సు ఉంది క‌దా! అందుకే ఆలోచించి అలా చెప్పారు.

Heart Touching Story
కోర్టు

ఒక గంట త‌రువాత మ‌ళ్లీ వ‌చ్చిన త‌ల్లికూతుర్లు ఎదురుగా బోనులో నిల‌బ‌డ్డారు. కానీ, ఎటువంటి మేజిక్కూ జ‌ర‌గ‌లేదు. అమ్మ ఒక నిశ్చ‌యానికి వ‌చ్చి, ఇక అమ్మాయి ఇష్టం అండీ…త‌ను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్క‌మాట‌..వాళ్ల నాన్న‌తో వెళ్లొస్తాన‌ని చెప్ప‌మ‌నండి. ఆయ‌న‌కు ఆ పిల్లంటే ప్రాణం…అని త‌ల్లి చెప్పంది. వాళ్ల నాన్న ఎక్క‌డ‌? అని అడ‌గ‌గా, అత‌ను ఒక మూల‌న కూర్చుని ఇవ‌న్నీ గ‌మ‌నించి క‌న్నీరు పెట్టుకుంటున్నాడు. అత‌ను విక‌లాంగుడు . అత‌నిని ఒక‌రు ఆస‌రాగా ప‌ట్టుకుని ఉన్నారు.

అయినా ఏమాత్రం మ‌న‌సు క‌ర‌గ‌ని ఆ అమ్మాయి ఇక నేను వెళ్లొచ్చా…అని అడిగి బ‌య‌ట త‌న భ‌ర్త వేచిచూస్తున్న‌కారు ఎక్కి వెళ్లిపోయింది. ఆ అమ్మాయిని శిక్షించ‌డానికి కోర్టుకు అధికారం లేదు. ఆర్డ‌ర్ వేసి ఇవి ఆచ‌రించి తీరాలి. అని చెప్ప‌డానికి ఇంకా చట్టాలు రాలేదు. జ‌డ్జిగారు ఆ అమ్మ‌ను ఉద్దేశించి… ఇప్పుడెలా వెళ‌తారు? అని అడిగితే బ‌స్టాండులో న‌లుగురి ద‌గ్గ‌ర అడుక్కుని మా ఊరివెళ్లిపోతాం. అక్క‌డ మ‌ళ్లీ ఇళ్ల‌లో ప‌నిచేసుకుని మా బ‌తుకులు ఈడ్చేస్తాం..అని అంటుంటే అక్క‌డ అంద‌రి క‌ళ్ల‌లో క‌న్నీళ్లు ఆగ‌లేదు.

Heart Touching Story
Heart Touching Story

Heart Touching Story: కోర్టు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌డ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయ‌లు ఇవ్వ‌గా అక్క‌డ ఉన్న‌వారంతా తోచిన సాయం చేసి పంపారు. సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండ‌వు. త‌ప్పు చేశామేమో అనే ప‌శ్చాతాపం ఉండ‌దు. చ‌ట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే. మ‌న పిల్ల‌ల‌కు మ‌న క‌ష్టం తెలియ‌కుండా పెంచాలి అని అనుకోవ‌డ‌మే పొర‌పాటు. ప్రేమ‌ను పంచిన‌ట్టే క‌ష్టాన్ని కూడా పంచండి. అప్పుడు కాసింత మాన‌వ‌త్వంతో మ‌నుషులుగా మిగిలి ఉంటారు. లేక‌పోతే మాన‌వ‌త్వాన్ని నిర్ధాక్షిణ్యంగా గాలికొదిలేసి ఎటో వెళ్లిపోతారు.

See also  Telugu Moral stories: తాడిప‌త్రి బ‌స్‌లో దొంగ‌లు ప‌డ్డారు(ఉపాయం)

ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్‌లో Heart Touching Storyలో మ‌న‌కు క‌ళ్ల‌కు క‌నిపిస్తున్నాయి. ఇది వాట్సాఫ్ నుండి సేక‌రించిన Story కావ‌చ్చు. కానీ య‌దార్థ జీవితంలో ఇలాగా బాధ‌ప‌డే త‌ల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కావున త‌ల్లిదండ్రుల క‌ష్టాన్ని పిల్ల‌లు మ‌రిచిపోకూడ‌దు. వారిని విడువ‌కూడ‌దు!.

Leave a Reply

Your email address will not be published.