Heart | గుండెను చాలా భద్రంగా చూసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. గుండెకు సంబంధించి ఏ చిన్న సమస్యనూ నిర్లక్ష్యం చేయకూడదు. అయితే Heartకు సంబంధించి ఇటీవల వెలుగు చూసిన నిజాలు, వాస్తవాలు, వార్తలు గురించి తెలుసుకుందాం.
Omicronతో చిన్నారులకు హార్ట్ attack ముప్పు
కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌తో పిల్లల్లో హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు ఉందని అమెరికా యూనివర్శిటీల అధ్యాయనంలో తేలింది. ఇతర వేరియంట్ల కంటే కూడా Omicron Variant కారణంగా పిల్లల్లో అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. 19 ఏళ్ల లోపు 18,849 మంది చిన్నారుల dataను విశ్లేషిస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు వెల్లడించారు.
గుండె ఆపరేషన్లు చేయించిన Prince
చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబుపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. యువరాజులా ఉండే అతడు..ఆపరేషన్లకు ఒక్కడే సాయం చేస్తూ అభిమానుల గుండెల్లో టక్కరి దొంగలా మరారు. పిల్లలకు ఆపరేషన్లు అంటేనే సైనికుడిలా ముందుకొచ్చే ఈ srimanthudu.. టాలీవుడ్లో నేనొక్కడినే ఇలా చేయగలనంటూ లక్షల మంది Heartల్లో మహర్షిలా మారి, సరిలేరు నీకెవ్వరూ అని నిరూపించుకుంటున్నారు.
గుండె పోటు అధికం వీరికేనంట!
విమానాశ్రయాలు, శబ్దాలు ఎక్కువ వచ్చే ప్రాంతాల్లో ఉన్నవారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కవని అమెరికాలోని new jersey మెడిక్స్ నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉన్నవారు నిద్రలేమి లేదా లేదా తీవ్రమైన ఒత్తిడితో గుండెపోటుకు గురవుతున్నట్టు తేలింది. విమానాశ్రయ పరిసరాల్లో నివసించే వారిలో గుండెPotu రేటు 72% ఎక్కువని, గుండెపోటుతో మరణించే ప్రతి 20 మందిలో ఒకరి మరణం శబ్ధ కాలుష్యం వల్లే సంభవిస్తోందని తెలిపింది.
గుండెపోటు మరణాలు మహిళల్లోనే అధికం
పురుషులతో పోలిస్తే Heartపోటు వచ్చే సంకేతాలు మహిళల్లో తక్కువగా కనిపిస్తాయని డెన్మార్క్‌లోని కోపెన్‌హెగెన్ వర్సిటీ పరిశోధనలో తేలింది. పురుషుల్లో ఛాతినొప్పి లాంటి లక్షణాలు మొదట్లోనే కనిపిస్తే, స్త్రీలలో శ్వాసవేగం తగ్గడం, వికారం, వాంతులు, జలుబు, అలసట వంటి లక్షణాలు మొదట బయటపడతాయని సైంటిస్టులు తెలిపారు. ఫలితంగా మహిళల్లో గుండెపోటు మరణాలు అధికంగా సంభవిస్తాయని వెల్లడించారు.
గుండె దడ తగ్గాలంటే ఏం చేయాలి?
తప్పనిసరిగా రెండు నుంచి మూడు లీటర్ల నీటిని రోజూ తాగాలి. summerలో పుచ్చకాయ, ఖర్బూజా వంటి పండ్లను ఎక్కవగా తీసుకోవాలి. Heart వేగాన్ని పెంచే కాఫీ, టీ, కూల్‌డ్రింక్‌లను దూరం పెట్టాలి. రోజూ అరగంట పాటు తేలికపాటి వ్యాయామం చేయాలి. రోజంతా ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం, యోగా చేయాలి.
గుండె ఆరోగ్యం కోసం వీటిని తినండి
చిక్కుళ్లు, పప్పు ధాన్యాలు తినండి. ఆహారంలో ఓట్స్, Brown Rice ఎక్కువగా ఉండేలా చూడండి. పుట్టగొడుగులు, ఆకుకూరలు తీసుకోవాలి. డార్క్ చాక్లెట్లు, బాదంపప్పు తినాలి. green tea, చేపలు కూడా తీసుకోవాలి.వాల్నట్స్, వెల్లుల్లి తినాలి.