healthy people బరువు(వయస్సు ప్రకారం), శారీరక ఉష్ణోగ్రత, గుండె లయ(హార్ట్‌బీట్), నాడీ లయ(పల్స్రేట్), రక్తపోటు(బ్లడ్ ప్రెషర్), మూల జీవక్రియ రేటు(బేసల్ మెటబాలిక్ రేటు) ..ఇవన్నీ ఆరోగ్యవంతుడికి ఉండే శారీరక లక్షణాలుగా చెప్పవచ్చు. పౌష్టికాహారం, సమతుల్యాహారం, శారీరక వ్యాయమం, మానసిక వ్యాయామం, ధ్యానం ఇవన్నీ ఆరోగ్యంగా ఉండేందుకు (healthy people)దోహదపడతాయి.
ఆరోగ్యమే ప్రధానం…
దేశాభివృద్ధి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) ఆరోగ్యం అంటే..శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధి గాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు..అని అర్థం వస్తుంది. ఒక వ్యక్తి (అతనులేక ఆమె) యొక్క సామర్థ్యాన్ని గురించి తెలుసుకుని ఉండటం, జీవితంలో సంభవిస్తూ ఉండే సాధారణ శ్రమ, ఒత్తిడికి తట్టుకొని ఉండగలగడం, ఉత్పాదక శక్తితో పనిచేయగలిగి ఉండటం, అతను లేక ఆమె జాతికి తన వంతు తోడ్పాటును అందించడంతో ఉండే మానసిక ఆరోగ్యాన్ని ఒక మనో-కుశలతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్ణిస్తుంది. ఇటువంటి వాస్తవిక దృష్టితో చూసినప్పుడు, మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది. వ్యక్తి సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ