healthy food: ఉరుకులు ప‌రుగుల జీవితంలో ఏం తింటున్నారు?

healthy food: ప్ర‌తిరోజూ ఆఫీసుకి వెళ్లే హడావుడి లో ఉండే పెద్ద‌ల‌కు, స్కూళ్ల‌కు వెళ్లే హ‌డావుడిలో ఉండే పిల్ల‌ల‌కు త‌గిన పోష‌కాహారాలు తీసుకోలేక‌పోతున్నారు. రోజూ తినే ఆహారంతో పాటు ప్రోటీన్లు, విట‌మిన్లు, ఖ‌నిజాలు ఎక్కువున్న ఆహార‌ప‌దార్థాల‌ను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మ‌రి ఆ పోష‌కాలు (healthy food) వేటిలో ల‌భిస్తాయో, వాటి వ‌ల‌న లాభాలేమిటో తెలుసుకుందామా!.

healthy food: పోష‌కాలు ఉండే ఫుడ్ ఇవే!

ఫిగ్స్‌– ఉల్లి ఆకారంలో ప‌చ్చ‌గా లోప‌ల ఎర్ర‌ని గింజ‌ల‌తో ఉండే Figs ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. తాజా ఫిగ్స్‌లో ఫొటాషియం ఎక్కువ శాతం ల‌భిస్తుంది. హై, లో బ్లెడ్ ప్రెష‌ర్‌నించి కాపాడుతుంది. బ‌రువును పెర‌గ‌కుండా చూసే ఫిబ్రాను కూడా ఇది క‌లిగి ఉంటుంది.

బ్లూ బెర్రీస్‌– గుండెకు, మెద‌డుకు ఎంతో శ‌క్తినిచ్చేవి క్రాన్ బెర్రీస్‌, బిల్‌బెర్రీస్‌, Blue Berries. యాంటీ ఆక్సిడెంట్‌లు, విట‌మిన్ సి, ఇ పుష్క‌లంగా ఉంటాయి బ్లూబెర్రీస్‌లో. వీటి వ‌ల్ల మెద‌డు చురుగ్గా ప‌ని చేయ‌డ‌మే కాదు వార్థ‌క్యంలో వ‌చ్చే ఎన్నో వ్యాధులు కూడా న‌యం అవుతాయి.

తేనె- చ‌క్కెర‌కు బ‌దులుగా ఏ ప‌దార్థంలోనైనా తేనె వాడుకోవ‌చ్చు. స‌త్వ‌ర శ‌క్తినిచ్చే సాధ‌నంగా Honey బాగా ప‌నికొస్తుంది. దీనిలోని కాల్షియం ఎముక‌ల‌కు, గుండెకు కూడా బ‌లాన్నిస్తుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డ‌టానికి కూడా తేనె అవ‌స‌రం.

దానిమ్మ‌– దీనిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. Green Tea లో కంటే అధికంగా ఫోలీఫెనాల్స్‌, టానీస్‌, ఏన్‌థోక్సిన్స్ ఇందులో ఉంటాయి. యాంటీఏజెంట్లుగా కేన్స‌ర్ క‌ణాల‌తో పోరాడే శ‌క్తిని ఇవ్వ‌డంలో ఇవి ముందుంటాయి.

ఆలివ్ ఆయిల్‌– ఓలిక్ యాసిడ్‌తో నిండి ఉండే Olive Oil లో ర‌క్తానికి అవ‌స‌ర‌మైన ఎల్‌.డి.ఎల్ కొలెస్ట్రాల్ ల‌భిస్తుంది. ర‌క్తంలోని చ‌క్కెర శాతాన్ని కంట్రోల్ చేయ‌డంలోనూ, కేన్స‌ర్ ముఖ్యంగా రొమ్ము క్యాన్స‌ర్ బారి నుండి కాపాడుతుంది.

సోయాబీన్స్‌– పొట్రీన్‌లకు మారుపేరు సోయాబీన్ అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. గుండె సంబంధ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌కు ఎంతో ఉప‌యుక్తం. ఫైబ‌ర్‌, పొటాషియంలు మెండుగా ఉన్న సోయాబీన్స్ రోజువారీ భోజ‌నం (healthy food) లో త‌ప్ప‌క తీసుకోవాలి.

పెరుగు– ప్రొటీన్‌, కాల్షియం, రిబోఫ్లేవిన్‌, విట‌మిన్ బి 12 తో కూడిన పెరుగు శ‌రీరానికి సాత్విక ఆహారంగా ప‌ని చేస్తూ స‌హ‌జ జీర్ణ‌శ‌క్తిని పెంచేందుకు స‌హ‌క‌రిస్తుంది.

మాన‌వ శ‌రీరం

ఇవి గుర్తుంచుకోండి!

healthy food : మీకు ఉద‌యం అల్పాహారం లేన‌ప్పుడు పొట్ట గాయ‌ప‌డుతుంది. మీరు 24 గంట‌ల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగ‌న‌ప్పుడు కిడ్నీలు గాయ‌ప‌డ‌తాయి. మీరు 11 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోక‌పోయినా, సూర్యోద‌యానికి మేల్కొన‌క‌పోయినా గాల్ బ్లాడ‌ర్ గాయ‌ప‌డుతుంది. మీరు చ‌ల్ల‌ని మ‌రియు పాత ఆహారాన్ని తినేట‌ప్పుడు చిన్న ప్రేగు గాయ‌ప‌డుతుంది. మీరు చ‌ల్ల‌ని మ‌రియు పాత(చ‌ద్ది) ఆహారాన్ని తినేట‌ప్పుడు చిన్న‌ప్రేగు గాయ‌ప‌డుతుంది.

మీరు ఎక్కువ వేయించిన మ‌రియు కారంగా ఉండే ఆహారాన్ని తినేట‌ప్పుడు పెద్ద ప్రేగులు గాయ‌ప‌డ‌తాయి. మీరు పొగ‌తో ఊపిరి పీల్చుకున్న‌ప్పుడు మ‌రియు Cigarettes క‌లిషిత వాతావ‌ర‌ణంలో ఉన్న‌ప్పుడు లంగ్స్ గాయ‌ప‌డ‌తాయి.

మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మ‌రియు ఫాస్ట్ ఫుడ్ తినేట‌ప్పుడు లివ‌ర్ గాయ‌ప‌డుతుంది. మీరు ఎక్కువ ఉప్పు మ‌రియు కొలెస్ట్రాల్‌తో మీ భోజ‌నం తిన్న‌ప్పుడు గుండె గాయ‌ప‌డుతుంది.

మీరు తీపి ప‌దార్థాలు (healthy food) తినేట‌ప్పుడు ప్యాంక్రియాస్ గాయ‌ప‌డుతుంది. ఎందుకంటే అవి రుచిక‌ర‌మైన‌వి. మీరు చీక‌టిలో మొబైల్ ఫోన్ మ‌రియు Computer స్క్రీన్ వెలుగులో ప‌నిచేసేట‌ప్పుడు క‌ళ్లు గాయ‌ప‌డ‌తాయి.

మీరు ప్ర‌తికూల ఆలోచ‌న‌ల‌ను ఆలోచించ‌డం ప్రారంబించిన‌ప్పుడు మెద‌డు గాయ‌ప‌డుతుంది. ఈ భాగాల‌న్నీ మార్కెట్లో అందుబాటులో లేవు. కాబ‌ట్టి జాగ్ర‌త్త వ‌హించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *