healthy diet plan: సాధారణంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు చాలా మంది. అది నిజం. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఆయుష్షు పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు తప్ప సహజ పద్ధతులతో నిత్య ఆరోగ్యాన్ని సంపాదించుకోలేక పోతున్నారు. మారుతున్న జీవన శైలితో బాటు శరీరాలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు నాజ్జుగా అనేది మరుగై బొద్దుగా కనబడేది ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఆ అధిక బరువు ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుంది. అనేక అనారోగ్యలకు కారణం(healthy diet plan) అవుతుంది.

రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు మరియు మధుమేహం ఇలాంటి మరెన్నో రకాల జబ్బులు రావడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఈ ఉరుకులు పరుగుల జీవితంలో శారీరక వ్యాయామానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన పోషకాహారమే ప్రయోజనకరం మరి అటువంటి పోషకారాన్ని డైట్(diet)లో ఏ విధంగా తీసుకుంటే అతి త్వరగా బరువు తగ్గుతారో చూద్ధాం.
ఉదయం లేవగానే!
ఉదయాన్నే కొద్దిగా నిమ్మరసం, గ్లాసు గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో విష మలినము బయటకు పంపివేయబడుతుంది. అల్పాహారానికి క ఎగ్‌వైట్ ఆమ్లెట్స్(2) బ్రౌన్ బ్రెడ్ రెండు స్లైస్‌లు పాలు(బాగా కాచి వెన్న తీసిన పాలు ఒక గ్లాసు) , కార్న్‌ఫ్లేక్స్-ఓట్స్-గోధుమ పొట్టు, ఫ్రూట్ సలాడ్-మొలకెత్తిన ధాన్యాలు- వెజిటేబుల్ పోహా- ఉప్మా- వెన్న తీసిన పాల నుండి తయారు చేసిన కాటేజ్ చీచ్ – బ్రౌన్ బ్రెడ్ ఇలా ఏదైనా ఒకటి తినాలి.

భోజనానికి ముందు!
మద్యాహ్నం భోజనానికి ముందు బ్లాక్ టీ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. మధ్యాహ్నం భోజనంలో బాయిల్- రోస్టెడ్ చికెన్- సోయాబీన్స్(200 గ్రా) – బ్రౌన్ రైస్ (1/2 ప్లేట్), చపాతి(1) ఉడికించిన పప్పు + బ్రౌన్ రైస్ (1/2 ప్లేట్) చపాతి (1-2) మితంగా పెరుగు (100 గ్రా) ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.
సాయంత్రానికి సిట్రస్ పండ్లను (నిమ్మజాతికి చెందిన పండ్లు, ఆరెంజ్, బత్తాయి, జామ) బెర్రీస్, ఆపిల్ తీసుకోవడం వల్ల సాయంత్రంలో కలిగే ఆకలిని కంట్రోల్ చేస్తుంది. వీటితో పాటు గ్రీన్ టీ రెండు మారీ లైట్ బిస్కెట్స్ , ఉడికించిన శెనగలు. రాత్రి భోజనానికి సోయాబీన్ న్యూట్రెలా/ సూప్+ సలాడ్, ఉడికించిన ఎగ్‌వైట్ (3)+ వెజిటేబుల్ సూప్, చికెన్ లేదా తునా సలాడ్, ఉడికించిన పప్పుతో చేసిన ఏదైనా కూరలు తినాలి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ