healthy benefits: రెండు దేహాల‌తో పాటు అవి కూడా అవ‌స‌ర‌మే!

healthy benefits శృంగారం అంటే రెండు శ‌రీరాల క‌ల‌యికో లేక కండ‌రాల రాపిడో లేదా పీనోవెజైన‌ల్ క‌ల‌యికో కాదు. శృంగారం ఒక భావ ప్ర‌క‌ట‌న‌! త‌న భాగ‌స్వామికి స్ప‌ర్శ ద్వారా నీకు నేనున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలని తెలియ‌జేసే ఒక సున్నిత‌మైన దేహ భాష అందుకే శృంగారినికి రెండు దేహాల అవ‌స‌ర‌మే కాదు..ప్రేమ‌, ఆప్యాయ‌త‌, అనురాగం, భ‌ద్ర‌త‌, బాధ్య‌త‌, న‌మ్మ‌కం.. ఈ అనుకూల భావోద్వేగాలు కూడా ఉంటేనే శృంగారం(healthy benefits) సఫ‌ల‌మ‌వుతుంది.

తరుచూ దంప‌తులు శృంగారంలో పాల్గొంటే వారి మ‌ధ్య సాన్నిహిత్యం, ప్రేమ విప్పారుతుంది. ఒక‌రిపై ఒక‌రికి బాధ్య‌తా పెరుగుతుంది. అంతేకాదు, శృంగారంలో పాల్గొనే స‌మ‌యంలో ర‌క్తంలోకి అనేక‌మైన శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే న్యూరోట్రాన్సిమిట‌ర్స్‌, హార్మోన్లు, ఎండార్ఫిన్స్ విడుద‌లై దేహం, మ‌న‌స్సు రెండూ పూర్తిస్థాయిలో తేలిక‌వుతాయి. అందుకే కీళ్ల‌నొప్పులు ఉన్న‌వాళ్లు శృంగారంలో పాల్గొన్న త‌ర్వాత నొప్పులు త‌గ్గ‌డం గ‌మ‌నించారు.

దానిక్కార‌ణం మాన‌సిక ఒత్తిడి వ‌ల్ల‌, ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల బిగుసుకుపోయే కండ‌రాలు, లిగ‌మెంట్స్‌ని స‌డ‌లించి, రిలాక్స్ చేసే ఎండార్భిన్స్ విడుద‌ల కావ‌డ‌మే. చాలా మంది శృంగారం కేవ‌లం పిల్ల‌ల కోస‌మే అనుకుంటారు. శృంగారానికి కున్న విధి విధానాల్లో పున‌రుత్ప‌త్తి విధితో పాటు దంప‌తుల మ‌ధ్య ఉత్తేజాన్ని, ఆనందాన్ని సృష్టించ‌డం దాని ద్వారా వారి మ‌ధ్య బంధం మ‌రింత పటిష్ట‌మ‌వ‌డం కూడా ఉన్నాయి. ఏమైనా శృంగారంలో దంప‌తులు పాల్గొనే శాతం క్ర‌మంగా త‌గ్గిపోతోంద‌న్న‌ది మాత్రం వాస్త‌వ‌మే.

కార‌ణాలు ఏమిటి?

వ‌య‌స్సు పెరిగే కొద్దీ యవ్వ‌న‌వంతుల కంటే సెక్స్ లో వీరు పాల్గొనే రేటు బాగా త‌గ్గుతుంది. 19-29 సంవ‌త్స‌రాల వారు 10-15 సార్లు నెల‌లో పాల్గొంటారు. 30-40 సంవ‌త్స‌రాల వారు 8-12 సార్లు నెల‌లో పాల్గొంటారు. 40-50 సంవ‌త్స‌రాల వారు 4-8 సార్లు నెల‌కు పాల్గొంటారు. వైవాహిక జీవిత వ‌య‌స్సు పెరిగే కొద్దీ శృంగారం త‌గ్గిపోతుంది. వ‌య‌స్సు పెరిగే కొద్దీ టెస్టోస్టీరాన్ హార్మోన్ శాతం పడిపోవ‌డం కూడా కోరిక త‌గ్గ‌డానికి కార‌ణం. డ‌యాబెటిస్‌, బీపీ(BP), గుండె జ‌బ్బులు, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ స‌మ‌స్య లాంటి అనారోగ్యాల వ‌ల్ల కూడా సెక్స్‌లో పాల్గొనే నిష్ప‌త్తి త‌గ్గుతుంది.

ఇంట్లో పెద్ద‌వారి సెక్స్ వ్య‌తిరేక దోర‌ణి కూడా దంప‌తుల పైన ప‌డుతుంది. సెక్స్‌లో న‌వీన‌త కొర‌వ‌డం, హిస్టేరెక్ట‌మీ, ప్ర‌స‌వాలు, ఎపిసియోట‌మీ, సిజేరియ‌న్‌, బైపాస్ స‌ర్జ‌రీ లాంటి ఆప‌రేష‌న్ల త‌ర్వాత శారీర‌క మాన‌సిక స్థితిగ‌తులు, శృంగారంలో పాల్గొంటే గ‌ర్భంచి వ‌చ్చి చ‌దువు, ఉద్యోగం, కెరీర్ పాడ‌వుతాయేమోన‌న్న భ‌యం. కుటుంబ నియంత్ర‌ణ‌ను స‌హ‌జ ప‌ద్ధ‌తుల్లో పాటించ‌డం, కాన్పు అయిన త‌ర్వాత పిల్ల‌ల పెంప‌కం, పోష‌ణ‌, నిద్ర‌లేని రాత్రులు త‌ల్లికి అల‌స‌ట‌ను క‌లుగ జేయ‌డం. ఐటి ప్రొఫెష‌న‌ల్స్ – షిఫ్ట్ డ్యూటీల వ‌ల్ల తరుచూ క‌ల్సుకోలేక‌పోవ‌డం, రాత్రిళ్లు ఆఫీసుల్లో డ్యూటీ చేసి, తెల్లారి నిద్ర‌పోవ‌డం, దంప‌తుల మ‌ధ్య వైరుధ్యాలు, అహాలు, ఆర్థిక స‌మ‌స్య‌లు, అక్ర‌మ సంబంధాలు, శ్ర‌మ‌ను క‌లిగించే ప‌నుల‌తో క‌లిగే అల‌స‌ట వ‌ల్ల ఇంట్లో అత్తా, ఆడ‌బిడ్డ‌ల గృహ హింస‌, భ‌ర్త ఆధిప‌త్య ధోర‌ణీ, డిప్రెష‌న్ ఎవ‌రి వైపైనా, రాత్రి షిఫ్టుల వ‌ల్ల ప‌ని స్థలాల్లోనే అశ్లీల సైట్స్ చూడ‌టం, అక్క‌డే స్వ‌యం తృప్తి ద్వారా సెక్స్ కోరిక తీర్చుకోవ‌డం, ఇంటికొచ్చి భార్య‌ని తిర‌స్క‌రించ‌డం, బాల్యంలో లైంగిక అత్యాచారాల‌కు లోన‌వ‌డం ఇలాంటివి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.

చికిత్స – ప‌రిష్కారం

ముందు దంప‌తులు శృంగార వైఫ‌ల్యాల‌కు మంచి సెక్సాల‌జిస్ట్‌ ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి. అలాగే త‌మ మ‌ధ్య ఉన్న వైరుధ్యాలు, గొడ‌వ‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి మెరైట‌ల్ థెర‌ఫిస్ట్‌ను క‌ల‌వాలి. డ‌యాబెటిస్ లాంటి వ్యాధులు త‌గ్గించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తూ యోగా-న‌డ‌క‌- మంచి పౌష్టికాహారాల‌తో జీవ‌న స‌ర‌ళిని మార్చుకోవాలి. డ‌యాబెటిస్‌, బీపీ లాంటి వ్యాధుల‌కు వాడే మందుల వ‌ల్ల కూడా అంగ‌స్థంభ‌న లోపం వ‌స్తుంది.

కాబ‌ట్టి డోసు, మందు మార్చే విష‌యంలో మీ డాక్ట‌ర్‌(doctor)ను సంప్ర‌దించాలి. ఫిఫ్టు డ్యూటీల్లో దంప‌తులు ఇద్ద‌రికీ ఒకే రోజు శెల‌వు, తీరిక వ‌చ్చే విధంగా చూస్కుంటూ వారంలో 2 లేక 3 రోజులు ఖ‌చ్చితంగా శృంగార‌పు దినాల‌ని పాటించాలి. అలాగే వైవాహిక జీవిత‌కాలం ఎక్కువుగా ఉన్న దంప‌తులు శృంగారంలో నూత‌న ప‌ద్ధ‌తుల‌ను, సృజ‌నాత్మ‌క‌త‌ను పాటించాలి.

Share link

Leave a Comment