Health news today: మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు సైరెన్ మోగిస్తున్న క‌రోనా..రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన కేంద్రం!

Spread the love

Health news today: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభించ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాల‌కు ఆదేశాల‌ను జారీ చేసింది.


Health news today: న్యూఢిల్లీ: క‌రోనా పాజిటివిటీ 10% పైన ఉన్న జిల్లాల్లో corona virus క‌ట్ట‌డికి క‌ఠిన ఆంక్ష‌లను అమ‌లు చేయాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాల‌ను ఆదేశించింది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని సూచించింది. గ‌త కొద్ది వారాలుగా Covid-19 పాజిటివీ రేటు 10 శాతం క‌న్నా ఎక్కువుగా పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో వైరస్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వాలు చ‌ర్య‌ల‌కు పూనుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు గుమ్మిగూడ‌కుండా అడ్డుకోవాల‌ని, కేసులు, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతున్న 10 రాష్ట్రాల‌ను ఆదేశించింది.

దేశ‌వ్యాప్తంగా 46 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 10% క‌న్నా ఎక్కువుగా ఉండ‌గా, మ‌రో 53 జిల్లాల్లో 5-10 శాతంగా ఉంది. ఈ క్ర‌మంలో కోవిడ్ కేసుల‌ను గుర్తించేందుకు ప‌రీక్ష‌ల‌ను పెంచాల‌ని రాష్ట్రాల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆయా జిల్లాల్లో క‌రోనా క‌ట్ట‌డిలో అల‌స‌త్వం వ‌హిస్తే దుర్భ‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని హెచ్చ‌రించింది. కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఒడిశా, అస్సాం, మిజోరం, మేఘాల‌య‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో క‌రోనా ప‌రిస్థితుల‌పై ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ నిర్వ‌హించారు. కేసుల గుర్తింపు, క‌ట్ట‌డి, నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్షించారు.

ఐసోలేష‌న్‌లో 80 శాతానికి పైగా కేసులు!

ఆయా రాష్ట్రాల్లో 80 శాతానికి పైకా కేసులు Home Isolation లో ఉన్న‌ట్టు చెప్పారు. అలాంటి వారు బ‌య‌టికి రాకుండా, ఇత‌రుల‌కు వైర‌స్ వ్యాప్తి చేయ‌కుండా నిఘా వేస్తూ క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కేంద్ర సూచించింది. ఐసోలేష‌న్‌లో ఉన్న వారిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ చికిత్సకు అవ‌స‌ర‌మైన వారిని మ‌స‌యానికి ఆసుప‌త్రికి త‌ర‌లించేలా చూడాలంది. ఈ అంశంపై ఇప్ప‌టికే అనుస‌రించాల్సిన విధానాల‌ను రాష్ట్రాల‌కు తెలియ‌జేశామ‌ని కేంద్రం పేర్కొంది.

10 శాతం లోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల‌పైనా దృష్టి సారించాల‌ని, ఆయా జిల్లాల ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉండి వ్యాక్సినేష‌న్ ను వేగ‌వంతం చేయాల‌ని తెలిపింది. కేంద్రం నుంచి రాష్ట్రాల‌కు క‌నీస ప‌రిమాణంలో వ్యాక్సిన్ల పంపిణీ జ‌రుగుతోంద‌ని అన్న‌ది. వినియోగాన్ని అనుస‌రించి అద‌నంగా ఆరోగ్య శాఖ స‌ర‌ఫ‌రా చేస్తోంది. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా సొంత సెరోస‌ర్వేల‌ను నిర్వ‌హించాల‌ని రాష్ట్రాల‌ను కోరింది. జాతీయ‌స్థాయిలో నిర్వ‌హించే స‌ర్వే, అందుకు భిన్నంగా ఉంటుంద‌ని పేర్కొంది. 80% శాతం మ‌ర‌ణాలు 45-60 ఏళ్ల వ‌య‌సు వారిలోనే సంభ‌విస్తున్న నేప‌థ్యంలో వారికి వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయాల‌ని ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ బ‌ల‌రామ్ భార్గ‌వ్ సూచించారు. అన‌వ‌స‌ర ప్ర‌యాణాల‌ను త‌గ్గించాల‌ని, పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు గుమ్మికూడ‌టాన్ని నిరోధించాల‌ని కోరారు.

vaccine drive:త్వ‌ర‌గా పూర్తి చేయండి వ్యాక్సినేష‌న్: మంత్రి హ‌రీష్ రావు

vaccine driveహైద‌రాబాద్: రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికీ రెండు డోసులు వ్యాక్సిన్ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారుల‌ను ఆదేశించారు. Read more

vaccination: క‌రోనా వైర‌స్ పోరులో మ‌రో మైలు రాయిని అధిగ‌మించిన భార‌త్

vaccination న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిపై జ‌రుగుతున్న పోరులో భార‌త్ మ‌రో మైలు రాయిని అధిగ‌మిం చింది. క‌రోనా వైర‌స్‌ను నివారించే టీకాల పంపిణీలో అత్యంత వేగంగా Read more

Vaccination : తెలంగాణ‌లో ఇంటి వ‌ద్ద‌కే వ్యాక్సినేష‌న్ | Pulse Polio మాదిరిగా CM Kcr ఆలోచ‌న‌!

Vaccination : తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. దేశంలోనే ఆద‌ర్శ‌వంతంగా ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌నే ఆలోచ‌న‌తో Read more

the Corona virus lab: ల్యాబ్‌లో పుట్టింద‌న‌డానికి ఆధారాల్లేవు

the Corona virus lab: ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ చైనాలోని వ్యూహాన్ ల్యాబ్‌లో పురుడుపోసుకుంద‌ని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవ‌ని అంత‌ర్జాతీయ శాస్త్ర‌వేత్త‌ల బృందం స్ప‌ష్టం Read more

Leave a Comment

Your email address will not be published.