Health : Liver Problem కు కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి!

By | April 19, 2021
Liver Problem

Health : Liver Problem కు కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి!

Liver Problem : మ‌న శ‌రీరంలో ఉండే హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, ఊపిరితిత్తుల పాటు లివ‌ర్ కూడా ఒక ప్ర‌త్యేక అవ‌య‌వం. శ‌రీరంలో అతిపెద్ద ఆర్గాన్ కూడా లివ‌రే. మ‌న శ‌రీరంలో జ‌రిగే ఐదు ప‌నుల‌ను ఒక్క లివ‌ర్(Liver) మాత్ర‌మే చేస్తుంది. అదే విధంగా వెయ్యికిపైగా ఎంజైమ్స్‌ను ఒక్క లివ‌ర్ మాత్ర‌మే త‌యారు చేస్తుంది. ఎప్పుడైనా మ‌న శ‌రీరంలో గాయ‌మైన‌ప్పుడు అక్క‌డ ర‌క్త కారి కొద్ది సేపు ఆగి అక్క‌డ గ‌డ్డ క‌ట్టి ర‌క్తం ఆగిపోయిందంటే, అందుకు అవ‌స‌ర‌మైన ఎంజైమ్స్‌ను లివ‌ర్ ఉత్ప‌త్తి చేస్తుంది. మ‌న శ‌రీరం అనారోగ్యానికి గురైన‌ప్పుడు వాటి నుంచి త‌ట్టుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన యాంటీ బాడీస్‌ను కూడా లివ‌రే ఉత్ప‌త్తి చేస్తుంది.

అయితే శ‌రీరంలో లివ‌ర్ కొంత మేర దెబ్బ‌తిన్న‌ప్ప‌టికీ తిరిగి మామూలు స్థాయికి వ‌చ్చే సామ‌ర్థ్యం ఆ అవ‌య‌వానికి ఉంది. మ‌న శ‌రీరంలో ఉండే అవ‌య‌వాల‌న్నిటిలోనూ మూడింట ఒక వంతు తొల‌గించిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ పెర‌గ‌డానికి ఒక్క లివ‌ర్‌(Liver)కు మాత్ర‌మే సామ‌ర్థ్యం ఉంది. ఉదాహార‌ణ‌కు.. ఒక చెట్టు కొమ్మ‌ల‌ను న‌రికి వేస్తే తిరిగి ఎలా చిగురిస్తాయో అదే విధంగా మ‌న లివ‌ర్‌ను తొల‌గించినా తిరిగి పూర్వ స్థితికి చేరుకోగ‌ల సామ‌ర్థ్యం లివ‌ర్ కు ఉంటుంది. అందుకే దాదాపు 90% లివ‌ర్ దెబ్బ‌తిన్న‌ప్ప‌టికీ అప్పుడే ఎటువంటి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌కు క‌నిపించ‌వు. మ‌న శ‌రీరంలో లివ‌ర్ మ‌న ఇంట్లో ఉండే వాట‌ర్ ఫ్యూరిఫైడ్‌లా ప‌నిచేస్తుంది. ఫ్యూరిఫైడ్ ప‌రిక‌రం ఎలాగైతే వాట‌ర్‌ను శుద్ధి చేసి బ్యాక్టీరియాను చంపేస్తుందో అదే విధంగా మ‌న తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయ‌డంలోనూ, శ‌రీరంలోని క్రొవ్వు, షుగ‌ర్‌, ప్రొటీన్ శాతాన్ని నియంత్రించ‌డంలో లివ‌ర్ కీల‌క పాత్ర పోషిస్తుంది.

శ‌రీరం అనారోగ్యాల భారిన ప‌డ‌కుండా లివ‌ర్(Liver) ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను బూస్ట్ చేస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది. శ‌రీరంలో ఉన్న లివ‌ర్ వ్య‌ర్థ మ‌లినాల‌ను నియంత్రిస్తుంది. జీర్ణ ప్ర‌క్రియ‌కు దోహ‌ద‌ప‌డే బైల్ జ్యూస్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. విట‌మిన్లు, ఐర‌న్ లాంటి పోష‌కాల‌ను నిల్వ చేయ‌డం ఆహారాన్ని శ‌క్తి రూపంలోకి మార్చ‌డం, శ‌రీరంలోని వివిధ హార్మోన్ల‌ను నియంత్రించ‌డం, ర‌క్తాన్ని గ‌డ్డ క‌ట్టించ‌డం లాంటి కీల‌క బాధ్య‌త‌ల‌ను లివ‌ర్ నిర్వ‌ర్తిస్తుంది.కేవ‌లం మ‌ద్య‌పానం సేవించ‌డం వ‌ల్ల‌నే లివ‌ర్ పాడువుతుంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డ‌తారు. మేము మ‌ద్య‌పానం సేవించ‌డం లేదు కాబ‌ట్టి లివ‌ర్ పాడ‌వ‌ద‌నే అపోహ‌లో కొంద‌రు ఉంటారు. అది పొర‌పాటు. కొన్ని సార్లు మ‌నం తీసుకునే ఆహారం(జంక్ ఫుడ్‌) వ‌ల్ల కాలేయం చుట్టూ క్రొవ్వు పేరుకు పోతుంది. దీనినే ఫ్యాటీ లివ‌ర్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఎటువంటి సంకేతాలు లేకుండా అక‌స్మాత్తుగా లివ‌ర్ పాడ‌వుతుంది. త‌ర్వాత అనారోగ్య కార‌ణాలు క‌నిపిస్తాయి.

లివ‌ర్ స‌మ‌స్య‌ల‌కు ముఖ్య‌మైన కార‌ణాలు!

  • మ‌న శ‌రీరంలో వ‌చ్చే ఇన్‌స్పెక్ష‌న్, వైర‌స్ వ‌ల్ల కూడా మ‌న లివ‌ర్ పాడ‌వుతుంది. అలాగే మ‌త్తు ప‌దార్థాలు, డ్ర‌గ్స్‌, ఆల్కాహాలు ఎక్కువుగా తీసుకోవ‌డం, ఎక్కువుగా దూమ‌పానం చేయ‌డం వ‌ల్ల కూడా లివ‌ర్ పాడ‌వుతుంది.
  • కొవ్వు ప‌దార్థాలు ఎక్కువుగా తిన‌డం, శ‌రీరానికి వ్యాయామం, ఎక్స‌ర్‌సైజ్ లేక‌పోవ‌డం, క‌లుషిత ఆహారం లేదా నీరు తీసుకోవ‌డంతో పాటు శ‌రీరంలో ర‌క్త మార్పిడి చేయ‌డం వ‌ల్ల కూడా లివ‌ర్(Liver Problem) పాడవుతుంది.
  • మ‌న శ‌రీరానికి హాని చేసే ఎక్కువ మందులు వాడ‌టం వ‌ల్ల, వ్యాధి నిరోధ‌క శ‌క్తికి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డి వ్యాధులు రావ‌డంతో పాటు వంశ‌పార్య‌ప‌రంగా వ‌చ్చే జెన్యూ లోపాల వ‌ల్ల కూడా లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.
  • నోటి దుర్వాస‌న వ‌ల్ల కూడా లివ‌ర్ పాడ‌య్యే ప‌రిస్థితి ఉంది. ఎందుకంటే మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాన‌ప్పుడు వాంతులు రూపంలో బ‌య‌ట‌కు రావ‌డం జ‌రుగుతుంది. అయితే ఇది లివ‌ర్ స‌మ‌స్య కాదా! అనే తెలుసుకునే లోపు ప్ర‌భావం చూపుతుంది.

లివ‌ర్ డ్యామేజ్ (Liver Problem)అయ్యే కొన్ని ల‌క్ష‌ణాలు!

  • కాలేయంపై క్రొవ్వు పేరుకు పోయినా, కాలేయం పెద్ద‌దిగా విస్త‌రించినా జీర్ణ‌క్రియ‌పై ప్ర‌భావం చూపుతుంది. దీని వ‌ల్ల మ‌నం త్రాగే నీళ్లు కూడా జీర్ణం కాలేవు. చాలా కాలం నుండి చిన్న చిన్న జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నా, త‌గ్గ‌కుండా త‌రుచూ బాధిస్తుంటే అది లివ‌ర్ డ్యామేజ్ ల‌క్ష‌ణంగా భావించాలి. వెంట‌నే మీరు లివ‌ర్‌ను చెక‌ప్ చేయించుకోవాలి.
  • లివ‌ర్ సరిగ్గా లేన‌ప్పుడు మ‌న చ‌ర్మం రంగులో మార్పు వ‌స్తుంది. కొన్ని సార్లు చ‌ర్మం రంగు మారిపోతుంది. దాంతో పాటు చ‌ర్మంపై తెల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి. వాటిని వైట్ ప్యాచ్ అని, లివ‌ర్ ప్యాచ్ అని కూడా పిలుస్తారు.
  • లివ‌ర్ స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు మూత్రం ప‌సుపుప‌చ్చ రంగులోకి మారుతుంది. ఇలా ఏదో ఒక సంద‌ర్భంలో జ‌రిగితే అది డిఐడ్రేష‌న్ ఒంట్లో వేడిశాతం పెరిగింద‌ని భావించ‌వ‌చ్చు. కానీ ప్ర‌తి రోజూ ఇలానే మూత్రం ప‌సుపుపచ్చ రంగులో వ‌స్తుంటే క‌చ్చితంగా మీ లివ‌ర్ డ్యామేజ్ అయింద‌ని గ్ర‌హించాలి. వెంట‌నే డాక్ట‌ర్ వ‌ద్ద లివ‌ర్ టెస్ట్ చేయించుకోవాలి.
  • ప‌సుపు ప‌చ్చ‌గా క‌ళ్లు, చేతి గోళ్లు మారిన‌ప్పుడు కామెర్లు ఏమైనా ఉన్నాయేమో టెస్టు చేపించుకోవాలి. దీన్ని బ‌ట్టి మీ లివ‌ర్ దెబ్బ‌తిన్న‌ద‌ని అర్థం. ఇందుకు అత్య‌వ‌స‌రంగా చికిత్స తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం.
  • లివ‌ర్ చేదుగా ఉండే పితా అనే ఎంజైమ్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. అది మీ నోటిలో చేదుగా అనిపిస్తుంది. ఇలా త‌రుచుగా నోరు చేదుగా అనిపిస్తే ఇది కూడా ఒక‌ర‌క‌మైన లివ‌ర్ స‌మ‌స్య‌గా తెలుసుకోవాలి. వెంట‌నే లివ‌ర్ టెస్ట్ చేయించుకోవాలి.

నీర‌సం, అల‌స‌ట!

మ‌న శ‌రీరంలో ఎప్పుడైతే లివ‌ర్ డ్యామేజీ అవ్వ‌డం ప్రారంభ‌మ‌వుతుందో నీర‌సంగా ఉండ‌టం, అల‌స‌టకు గుర‌వ్వ‌డం లాంటి ల‌క్ష‌ణాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఇలా ప్ర‌తి రోజూ శ‌రీరం అల‌స‌ట‌, నీర‌సంగా ఉంటే మీ లివ‌ర్ డ్యామేజీ అయిన‌ట్టు గుర్తించాలి. లివ‌ర్‌లో టాక్సీన్ ఎక్కువ‌వ్వ‌డం వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు దెబ్బ‌తింటుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో మిగ‌తా అవ‌యవాలు ఎక్కువుగా ప‌నిచేయాల్సి వ‌స్తుంది. దీంతో శ‌రీరం త్వ‌ర‌గా అల‌సిపోవ‌డం, నీర‌సంగా ఉండ‌టం ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాల‌నుకోవ‌డం ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఇలా క‌నుక మీకు రెండు నెల‌లు క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి లివ‌ర్ టెస్ట్ చేయించుకోవాలి. ఎప్పుడైతే లివ‌ర్‌పై విష‌ప‌దార్థాల ప్ర‌భావం ప‌డుతుందో లివ‌ర్ ప‌నితీరు నెమ్మ‌ది అవుతుంది. దీంతో బ‌రువు పెరుగుతారు. దీని వ‌ల్ల మీ శ‌ర‌రంలో విడుద‌ల‌య్యే టాక్సిన్స్ క్రొవ్వు రూపంలోకి మారుతాయి.

చ‌ద‌వండి :  Covid Cases : Andhra Pradesh |కోస్తాంధ్ర‌లో క‌రోనా క‌ల‌క‌లం

బ‌రువు పెర‌గ‌డం!

దీంతో శ‌రీరం బ‌రువు త్వ‌ర‌గా పెరుగుతారు. ఇలాంటి వారు స‌న్న‌గా మార‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. లివ‌ర్ డ్యామేజీ అయితే నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుంది. అది కూడా కుళ్లిన చేప‌లు, కుళ్లిన ఉల్లిపాయ‌ల వాస‌న వ‌స్తుంది. ఎందుకంటే మ‌న శ‌రీరం ఒక ఇంట‌ర్ క‌నెక్ట్ సిస్టం. లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ‌పై ప్ర‌భావం ప‌డుతుంది. దీనివ‌ల్ల శ‌రీరంలో అమ్మోనియం ఎక్కువుగా ఉత్ప‌త్తి కావ‌డం వ‌ల్ల నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుంది. అలాగే శ‌రీరంలో లివ‌ర్ ఎప్పుడైతే పాడ‌వుతుందో అప్పుడు బీపీ కూడా పెరుగుతుంది. దీంతో కొన్ని ప్లూయిడ్స్ పాదాల కింద‌కు చేర‌తాయి. దీని వ‌ల్ల పాదాల‌లో వాపులు కూడా వ‌స్తాయి. ఇలాంటి వాపుల‌నే ఎడిమా అంటారు. దీనివ‌ల్ల మోకాళ్ల నుంచి పాదాల వ‌ర‌కు లావుగా, వాపు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తాయి. అలాగే ఈ వాపు ప్ర‌దేశంలో ఎలాంటి నొప్పి కూడా ఉండ‌దు. ఇది కూడా లివ‌ర్ డ్యామేజీకి ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

స్కిన్ ఎల‌ర్జీ రావ‌డం!

సాధార‌ణంగా స్కిన్ ఎల‌ర్జీ ఓ బాక్టీరియా వ‌ల్ల వ‌స్తుంది. కానీ శ‌రీరంలో వ‌చ్చే గ‌జ్జి , తామ‌ర స‌మస్య‌లు కొన్ని సార్లు మీ లివ‌ర్ డ్యామేజీ వ‌ల్ల కూడా వ‌స్తాయి. ఎప్పుడైతే మ‌న శ‌రీరంలో విష‌ప‌దార్థాలు ఉత్ప‌త్తి అవుతాయో దీని వ‌ల్ల శ‌రీరంపై ద‌ద్ద‌ర్లు వ‌చ్చి దుర‌ద వ‌స్తుంది. శ‌రీరంపై అనేక ప్ర‌దేశాల్లో ఎరుపు రంగు మ‌చ్చ‌లు రావ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. ఎక్కువుగా ఈ ఎల‌ర్జీ చేతులు, కాళ్ల‌పైనే వ‌స్తాయి. అదే విధంగా ఆక‌లి వేయ‌డం కూడా త‌గ్గిపోతుంది. త‌రుచుగా క‌ళ్లు తిర‌గ‌డం, అలాగే భోజ‌నం చేసిన వెంట‌నే క‌డుపు నొప్పి రావ‌డం లివ‌ర్ డ్యామేజీ అయిన‌ట్టు చెప్ప‌వ‌చ్చు. అలాగే శ‌రీరంపై న‌రాలు బాగా ఉబ్బిన‌ట్టు క‌నిపిస్తాయి. అలా ఉబ్బిన‌ట్టు క‌నిపించే ప్ర‌దేశంలో నీల‌పు మ‌చ్చ‌లు క‌నిపిస్తే క‌చ్చితంగా లివ‌ర్ టెస్ట్ చేయించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *