Health : Hemoglobin త‌గ్గ‌టానికి కార‌ణాలేమిటి? హిమోగ్లోబిన్ పెర‌గానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు!

Health : Hemoglobin త‌గ్గ‌టానికి కార‌ణాలేమిటి? హిమోగ్లోబిన్ పెర‌గానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు!

Hemoglobin : మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాల్లో హిమోగ్లోబిన్ ఒక ముఖ్య‌మైన ప్రోటీన్‌. ఇది క‌ణాల‌కు, క‌ణ‌జాలాల‌కు ఆక్సిజ‌న్ తీసుకువెళ్ల‌డంలో కీల‌క పాత్ర‌పోషిస్తుంది. శ‌రీరంలో హిమోగ్లోబిన్ త‌క్కువుగా ఉండ‌టం అనేది ముఖ్యంగా మూడు ర‌కాల కార‌ణాలుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. శ‌రీరంలో త‌గిన‌న్ని ఎర్ర ర‌క్త‌క‌ణాలు ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం, కొత్త‌గా త‌యార‌య్యే వాటికంటే ఎక్కువ ఎర్ర ర‌క్త‌క‌ణాలు న‌శించిపోవ‌డం, ఏదైనా ఆరోగ్య‌స‌మ‌స్య వ‌ల్ల ఎక్క‌వుగా ర‌క్తం పోవ‌డం, ఎర్ర‌ర‌క్త క‌ణాలు శ‌రీరానికి కావాల్సినంత ఉత్ప‌తి కాక‌పోవ‌డానికి కార‌ణం త‌గినంత ఐర‌న్ లేక‌పోవ‌డ‌మే. ఎక్కువుగా ఎర్ర‌ర‌క్త క‌ణాలు న‌శించిపోవ‌ డానికి క్లోమ‌పు వాపు, సికిల్ సెల్ ఎనీమియా, థ‌ల‌సీమియా మొద‌లైన‌వి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అల్స‌ర్లు, హెమ‌రాయిడ్స్ లాంటి ఏదైనా దెబ్బ‌ లేదా పుండు నుండి ర‌క్తం పోవ‌డం మొద‌లైన కార‌ణాల వ‌ల్ల కూడా హిమోగ్లోబిన్ త‌గ్గుతుంది. ఆహారం స‌రిగా తీసుకున్నా హిమోగ్లోబిన్ త‌క్కువుగా ఉందంటే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించి కార‌ణం ఏమిటో నిర్థారించుకోవాలి. హిమోగ్లోబిన్ త‌గ్గ‌డం వ‌ల్ల శ‌రీరంలో అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త‌, మైక‌ముగా అనిపించ‌డం, వ‌ణుకు, పాలిపోయిన చ‌ర్మం, శ్వాస ఆడ‌క‌పోవ‌డం, శారీర‌క కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌లేక‌పోవ‌డం, పాద‌ముల‌లో వాపు లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

హిమోగ్లోబిన్ పెర‌గడానికి ఇలా చేయండి!

హిమోగ్లోబిన్ లోపిస్తే ర‌క‌ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. వాట‌న్నింటికీ దూరంగా ఉండాలంటే స‌రైన ఆహారం తీసుకోవ‌డం ముఖ్యం. ర‌క్త‌హీన‌త‌, హిమోగ్లోబిన్ లోపంతో బాధ‌ప‌డేవారు ఇనుము ఎక్కువుగా ల‌భించే ఆహారానికి ప్రాధాన్య‌మివ్వాలి.

మాంసం, పాల‌కూర‌, అనాస‌, ఎండు ఫ‌లాల వంటి వాటిని ఎంత ఎక్కువుగా తీసుకుంటే అంత మంచిది. హిమోగ్లోబిన్ శాతం పెర‌గ‌డంతో పాటు ఫోలిక్ యాసిడ్ అందే ఆహారం తీసుకుంటే విట‌మిన్ బి స‌మృద్ధిగా శ‌రీరానికి అందుతుంది. అది ఎర్ర‌ర‌క్త‌క‌ణాల వృద్ధికి దోహ‌దం చేస్తుంది. ఆ లోపాన్ని త్వ‌ర‌గా దూరం చేస్తుంది.

తృణ‌ధాన్యాల్లో ఇనుము ఎక్కువ‌. కాబ‌ట్టి అది శ‌రీరంలో హిమోగ్లోబిన్ శాతం త‌గ్గ‌కుండా చూస్తుంది. దాదాపు వారంలో నాలుగైదు రోజులు తృణ‌ధాన్యాల‌తో చేసే ఏదో ఒక ఆహారాన్ని తీసుకుంటే మంచిది. హిమోగ్లోబిన్ తక్కువుగా ఉన్న చిన్నారుల‌కు ప్ర‌తి రోజూ గుడ్డు తినిపిస్తే మంచిది.

పాలూ, మ‌జ్జిగా, పెరుగు, ప‌నీర్‌, చీజ్ కూడా హిమోగ్లోబిన్ వృద్ధికి తోడ్ప‌డ‌తాయి. పుచ్చ‌కాయి, యాపిల్‌, అర‌టిపండ్లు, నారింజ‌ల‌లో ఇనుము ఎక్కువుగా ల‌భిస్తుంది. ఇవి ర‌క్త క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో కీల‌క పాత్ర వ‌హిస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.

చ‌ద‌వండి :  Pimple care Tips in Telugu | మొటిమ‌లు పోవ‌డానికి చిట్కాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *