health benefits of betel leavesహిందూ సాంప్రదాయంలో తాంబూలానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తాంబూలం వేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు సైతం చెబుతుంటారు. తమలపాకు, సున్నం, వక్క కలిపి తాంబూలం అంటారు. తాంబూలం తినడం వల్ల జీర్ణక్రియ మెరువడమే కాకుండా శరీరంలోని కొవ్వును కూడా(health benefits of betel leaves) కరిగిస్తుందట.
తమలపాకు(tamalapaku)తో పాటు నాలుగైదు మిరియాల గింజలను కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. మన ఇళ్లళ్లో అమ్మమ్మలు, నాయనమ్మలు రోజూ ఉదయం, సాయంత్రం తాంబూలం వేసుకోవడం చూసే ఉంటారు. గ్యాస్టిక్ ఆమ్లాల వల్ల వచ్చే కడుపుబ్బరం సమస్యను తాంబూలం నయం చేస్తుంది. మిరియాలలో ఫ్యాటీ న్యూట్రియంట్స్, పెప్పెరిన్లకు కొవ్వును విచ్చిన్నం చేసే గుణం ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున లేత ఆకుపచ్చని తమలపాకుతో 5 మిరియాల గింజలను కలిపి 8 వారాలపాటు తీసుకుంటే ఫలితం కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


బరువు తగ్గేందుకు తమలపాకు
జీర్ణక్రియను మెరుగుపరిచే తమలపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తమలపాకు శరీరంలో అదనపు కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేసి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?