Hayagriva : హ‌య‌గ్రీవుడు అంటే ఎవ‌రు? దేవ‌త‌లకు భ‌య‌మెందుకు?

Hayagriva : త‌న లాంటి ముఖ‌ము క‌ల్గిన వాడే త‌న‌ను వ‌ధించ‌గ‌ల‌డు అనే, బ్ర‌హ్మ‌దేవుని దివ్య వ‌ర‌ప్ర‌భావంతో బ‌ల‌గ‌ర్వితుడైన రాక్ష‌సుడు హ‌య‌గ్రీవుడు. సాధు స‌జ్జ‌న హింస‌తో త‌న రాక్ష‌స నైజాన్ని రోజురోజుకూ రెట్టింపు చేస్తున్న స‌మ‌యంలో దేవ‌త‌లంతా త్రిశ‌క్తుల‌ను, త్రిమూర్తుల‌ను శ‌ర‌ణువేడారు.

Hayagriva క‌థ‌!

దేవ‌త‌లంతా శ‌ర‌ణువేడే స‌మ‌యంలో మ‌హా విష్ణువు యోగ నిద్ర‌లో ఉన్నాడు. అదీ ఓ రాక్ష‌స సంహారానంత‌రం ఓ వింటిపై త‌ల‌వాల్చి. దేవ‌త‌లు ఒక చెద పురుగుని ఆశ్ర‌యించి వింటిని త్రుంచ‌గా ఆయ‌న త‌ల తెగిప‌డిపోయింది. దేవ‌త‌లంతా జ‌రిగిన‌దానికి చింతిస్తుండ‌గా బ్ర‌హ్మ‌దేవుని స‌ల‌హాపై ఓ అశ్వంత‌ల‌ను విష్ణువు శ‌రీరానికి అతికిస్తారు.(ఇది ల‌క్ష్మి దేవి శాప ఫ‌లిత‌మే అకార‌ణంగా త‌న‌ను చూసి న‌వ్వినందున త‌ల తెగి ప‌డింద‌ని శ‌పించింది.) అశ్వాన్ని సంస్కృతంలో హ‌యం అంటారు.

అందువ‌ల్ల విష్ణుమూర్తి హ‌య‌గ్రీవు (Hayagriva) నిగా ఖ్యాతిగాంచాడు. ఆయ‌న దేవ‌త‌ల‌కు అభ‌యం ఇచ్చి హ‌య‌గ్రీవుని హ‌త‌మ‌ర్చాడు. అయితే ఆయ‌న ఆ స‌మ‌యంలో ఎంతో ఉగ్ర‌త్వంతో ఉండ‌గా, ఆయ‌న‌ను శాంతింప‌జే య‌డానికి పార్వ‌తీదేవి వ‌చ్చింది. ఆమె హ‌య‌గ్రీవా! నిన్ను ఆరాధించిన వారికి స‌ర్వ విద్య‌లూ క‌ర‌త‌లా మ‌ల‌కం కాగ‌ల‌వు. అని ఆయ‌న‌కు ఓ దివ్య‌శ‌క్తిని ప్ర‌సాదించింది. దీంతో ఆయ‌న ఆగ్ర‌హం నుండి పూర్తిగా ఉప‌శ‌మ‌నం పొందాడు.

Hayagriva: పిల్ల‌లు మారాం చేస్తుంటే వారికి ఏదోలా న‌చ్చ‌జెప్పిన‌ట్టే స్వామి వారి ఆగ్ర‌హాన్ని ఉప‌శ‌మింప‌ జేయ‌డానికి సాక్షాత్తూ ఆ ఆదిప‌రాశ‌క్తి రూపాంశ‌యైన పార్వ‌తీదేవి ఈ విద్యాశ‌క్తి స్వామి వారి అందించింద‌ న్న‌మాట‌. అష్ట‌క‌ష్టాలు పెట్టిన రాక్ష‌సుని ఎలా సంహ‌రించాలో తెలియ‌క త‌ల్ల‌డిల్లిన ముక్కోటి దేవ‌త‌ల‌ను ఊర‌డించి స్వామివారు త‌న‌దైన విజ్ఞాన‌దాయ‌క‌మైన అంశం. స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డ‌మంటే అది జ్ఞానానికి ప్ర‌తీక‌యే క‌దా!.

హ‌య‌గ్రీవుడు

అలా జ్ఞానానికి ప్ర‌తీక‌గా ప్రాదుర్భ‌వించిన హ‌య‌గ్రీవ‌మూర్తి స్థుతి చేసిన‌వారికి స‌ర్వ‌విద్యాబుద్దులూ ల‌భిస్తాయ‌న్న‌మాట‌. విద్య ఉన్న‌చోట అడ‌గ‌కుండానే అష్ట‌ల‌క్ష్ములూ కొలువై ఉంటారు. అంటే మాన‌వ‌జీవితానికి స‌ర్వ‌సుఖాలు అందిన‌ట్టే. హ‌య‌గ్రీవుడు ఆవిర్భ‌వించిన శ్రావ‌ణ పార్ణ‌మినాడైనా హ‌య‌గ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, స‌క‌ల సంప‌ద‌లు చేరువ అవుతాయి. పిల్ల‌లు నిత్యం Hayagriva స్థుతి చేస్తుంటే వారికి విద్య‌లో ఎదురుండ‌దు.

చ‌క్క‌ని స‌త్ఫ‌లితాలు త‌థ్యం. మంత్ర‌శాస్త్రం ఏం చెబుతోందంటే, ఉపాస‌నాప‌రంగా మాన‌వ‌, జంతు ఆకృతులు క‌ల‌గ‌లిసిన దేవ‌త‌లు శీఘ్ర అనుగ్ర‌హ‌ప్ర‌దాత‌లు. అటువంటి దైవాల్లో శ్రీ హ‌య‌గ్రీవ స్వామివారు ఒక‌రు. హ‌య‌గ్రీవుని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఉపాసించిన వారికి స‌ర్వ విద్య‌లూ క‌ర‌లామ‌ల‌క‌మ‌వ‌డ‌మే కాక‌, స‌ర్వ సంప‌ద‌లు ల‌భించ‌డం త‌థ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *