యాప్‌లో పనిమనుషులు వివరాలు
HawkEye MobileApp Review హైదరాబాద్ : ‘అక్కయ్య గారూ, అన్నయ్య గారూ మేము ఊరు వెళుతున్నాం. మా ఇల్లు కొంచెం జాగ్రత్తగా చూడండి.’ అంటూ మన ఇరుగుపొరుగు వారు ఊళ్లల్లో చెబుతున్న మాటలు వింటూనే ఉంటాం. కానీ ఒక్కొక్క సందర్భంలో ఇంటికి తిరిగి వచ్చే సరికి వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. లోపల ఉన్న పనిముట్లు, ధనము, నగలు మాయమవుతుంటాయి. దీంతో ఆ కుటుంబం లబోదిబో మంటూ చోరీ జరిగిందని పోలీసులను ఆశ్రయించిన ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ ఘటనలు రోజురోజుకూ వేల సంఖ్యల్లో పెరగడంతో తెలంగాణ పోలీసు యంత్రాంగం చోరీలకు చెక్ పెట్టే వినూత్న ఆయుధాన్ని రంగంలోకి దింపింది, అదే హాక్ఐ(HawkEye) యాప్.
HawkEye MobileApp Review
‘సమాచారం ఇస్తే మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతాం’ అని తెలంగాణ పోలీసులు నిత్యం మైకులు ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా సంవత్సరాల తరబడి చెబుతున్నా, ఏం కాదులే అన్న నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాం. దీంతో ఇల్లును గుల్ల చేసుకుంటున్నాం. ఇటీవల నేపాలి గ్యాంగ్‌లు చోరీలు చేస్తున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. పనిమనుషులం అని,నమ్మకాన్ని పెంచి అదును చూసుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో హాక్ఐ(HawkEye) అస్త్రాన్ని ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ఈ యాప్‌ను పోలీసులు రూపొందించారు.
డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు 2014, డిసెంబర్ 31న దీన్ని ప్రారంభించారు. తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనరేట్ల పరిధిలోకి తెచ్చారు. 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాక్ఐ(HawkEye) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ విత్ పోలీసుతో నమోదు చేసుకుంటే ఇంటికి రక్షణ కల్పిస్తామని పోలీసులు చెబుతున్నారు.
‘రిజిస్టర్ విత్ పోలీస్’ వల్ల ఉపయోగమేమిటి?
హాక్ఐ(HawkEye)లో కున్న అద్భుతమైన ఫీచర్ ఇది. కొత్త వ్యక్తులకు ఇల్లు కిరాయికి ఇస్తున్నా, మీ ఇంట్లో కొత్తగా పనిమనిషి ఎవరైనా చేరినా హాక్ఐ లో వారి వివరాలు నమోదు చేయాలి, డ్రైవర్, తోటమాలి, వాచ్మెన్, అటెండర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్, పేపర్ బాయ్, మిల్క్‌బాయ్, ఏసీ మెకానిక్, ఎల్పీజీ సైప్లేబాయ్, సేల్స్ పర్సన్, చెత్త సేకరించే వాళ్లు ఇలా మొత్తం 31 క్యాటగిరిల వ్యక్తుల వివరాలు నమోదు చేయవచ్చు. వివరాలు నమోదైన తర్వాత స్థానిక బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది మన ఇంటికి వచ్చి సదరు వ్యక్తి వివరాలు పరిశీలించుకొని వెళ్తారు.
దీంతో పనిమనిషి, డ్రైవర్ లేదా ఇతర ఏ ఉద్యోగికైనా పోలీసులు నజర్ తమపై ఉందన్న భయం వారికి ఉంటుంది. నమ్మకంగా నటించి ఇంట్లో చోరీ చేయాలన్నా, ఇంకే నేరం చేయాలన్న జంకే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ లో గతేడాది 1,779 మంది యజమానులు తమ పనిమనుషుల వివరాలు నమోదు చేయగా, పోలీసులు వారి ఇండ్లకు వెళ్లి తనిఖీ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకొని, పోలీసుల సేవలు ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రజలకు తెలంగాణ పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తుంది.
హాక్ఐ చేసే పనులు ఇవే
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వీడియో/ ఫొటోతో వివరాలను పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. మహిళలు, యువతులు ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో ఉమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్ ద్వారా వాహనం నెంబర్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు అన్న వివరాలు ఇస్తే క్షేమంగా గమ్యం చేరే వరకు పోలీసులు అలర్ట్‌గా ఉంటారు.సెకంట్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయాలంటే వెహికల్ సెర్చ్ అనే ఆప్షన్లో వివరాలు ఇస్తే ఏవైనా కేసులు ఉన్నాయా? అన్న వివరాలు ఇస్తుంది.ఒంటరిగా ఉండే వృద్ధులకు బాసటా హాక్ఐలో సీనియర్ సిటిజన్ ఆప్షన్ ఉంది. దీనిలో వృద్ధులకు వారి పరిధిలో బీట్ కానిస్టేబుళ్లు, లీగల్ సర్వీసులు, హోంకేర్ సర్వీసుల సమాచారం లభిస్తుంది.
అన్ని పోలీసు స్టేషన్ల అధికారుల నెంబర్లు ఇందులో ఉన్నాయి. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే కొత్త ఫీచర్ ఉంటుంది. సేవ్ అవర్ సోల్ అనే ఫీచర్ ఆప్షన్ ఎంచుకుంటే ఆపత్కాలంలో పోలీసులు రక్షణ కల్పిస్తారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!