Hard work job: వేళ‌కు ప‌నులు పూర్తి చేయాలంటే ఇబ్బంది ప‌డుతున్నారా?

Hard work job విశ్రాంతి అంటూ లేని ప‌నులు మ‌హిళ‌ల్ని కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటి సంద‌ర్భాల్లో కంగారు ప‌డ‌కుండా మాన‌సికంగా దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి, దిన‌చ‌ర్య‌ను ఏ విధంగా మార్చుకోవాల‌నేది చూద్ధాం.

వ‌ర్త‌మానంలో జీవించ‌డం అల‌వాటు(Hard work job) చేసుకోవాలి. ప‌ది ప‌నుల్ని ఒకేసారి చేయాల‌ని చూడ‌కూడ‌దు. ఒక్క‌దాన్నే ఏకాగ్ర‌తతో పొర‌బాట్ల‌కు తావులేకుండా చేసేలా చూడాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు కాఫీ తాగుంటే.. ఆ రుచీ, వాస‌న‌ను పూర్తిగా ఆస్వాదించేలా చూసుకోవాలి. అంతే త‌ప్ప ఫోను మాట్లాడుతూనో, మ‌రో ప‌ని చేస్తూనో కాదు. ఇదే ప‌ద్ధ‌తిని విధుల్లోనూ కొన‌సాగించండి. చ‌క‌చ‌కా ప‌నులు పూర్త‌వుతాయి. ఉన్న‌ట్టుండి బోలెడు ప‌నుల‌ను సాయంత్రంలోగా పూర్తి చేయాల్సిన ప‌రిస్థితి ఎదురైందే అనుకోండి. అన‌వ‌స‌రంగా కంగారు ప‌డి వెంట‌నే ఏదో ఒక‌టి మొద‌లు పెట్టేయకండి. కొద్ది నిమిషాలు ప్ర‌శాంతంగా కూర్చోండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వ‌ద‌లండి. ఆ త‌ర్వాత ఏ ప‌ని ఎప్పుడు, ఎలా చేయాల‌నే స్ప‌ష్ట‌త వ‌చ్చేలా ప్ర‌ణాళిక వేసుకోండి.

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేసుకోవ‌డం మంచిదే. అయితే అందుకోసం అన‌వ‌స‌రంగా దిగులు ప‌డ‌టం మాత్రం మంచిది కాదు. అది మిమ్మ‌ల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. ఏకాగ్ర‌త లేకుండా చేస్తుంది. అలాగే ఎప్పుడో జ‌రిగిన విష‌యాల గురించి తెలియ‌కుండానే చాలాసార్లు ఆలోచిస్తాం. ఆ ప‌రిస్థితిని సాధ్య‌మైనంత వ‌ర‌కూ రానీయ‌ కూడ‌దు. కార్యాల‌యంలో విధుల‌కు సంబంధించి దిన‌చర్య‌ను రూపొందించు కుంటున్న‌ప్పుడు ప్ర‌తి ప‌ని మ‌ధ్య‌లో స్వ‌ల్ప విరామం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు కుదురుగా ఉండ‌గ‌లుగుతారు. ప‌నుల‌ను వేళ‌కు పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఇంటిప‌నులు, కార్యాల‌యంలో విధుల విష‌యంలో సంయ‌మ‌నంతో నిర్ణ‌యాలు తీసుకోండి. తొట్రుపాటు లేకుండా ప‌నులు చేసుకునేందుకు ఈ చ‌ర్య‌లే మీకు తోడ్ప‌డ‌తాయి.

వేళ‌ను ప‌సిగ‌ట్టండి ఇలా!

రోజులో కేవ‌లం కొన్ని గంట‌లు మాత్ర‌మే మ‌న‌లోని పూర్తి శ‌క్తి బ‌య‌టికొస్తుంది. ఆ వేళ‌ల్ని ప‌సిగ‌ట్టి.. ముఖ్య‌మైన ప‌నుల‌న్నీ అప్పుడు చేసుకోగ‌లిగితే మ‌న‌కెంతో స‌మ‌యం ఆదా అవుతుంది. ఆశించిన దానికంటే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. మ‌రి అలాంటి స‌మ‌యాన్ని ఎలా గుర్తించాలి? అందుకో కొండ గుర్తుంది. మీరు రోజులో ఏ వేళ‌లో 90 నిమిషాలపాటు నిర్విరామంగా, ఆస‌క్తి త‌గ్గ‌కుండా ప‌నిచేయ‌గ‌ల‌రో గ‌మ‌నించండి. అదే మీ పూర్తి సామ‌ర్థ్య స‌మ‌యం! మిగ‌తా వేళ‌ల్లో అంత చ‌క్క‌గా మీరు ప‌నిచేయ‌లేర‌నే అర్థం.

కాబ‌ట్టి అతి కీల‌క‌మైన ప‌నుల‌న్నింటికీ ఆ వేళ‌లు ( లేదా ఆ కొన్ని నిమిషాల్నే ) కేటాయించండి. మీ రోజువారీ ప‌నుల్ని చిన్న చిన్న ల‌క్ష్యాలుగా విడ‌గొట్టుకోవాల‌ని అందరూ చెప్పేదే. వాటినే మ‌రింత చిన్న‌విగా విభ‌జించుకోవా లంటున్నాయి తాజా అధ్య‌య‌నాలు. మీరు గంట‌లో 10 మందికి ఫోన్ చేసి.. మీ సంస్థ‌పై వారి అభిప్రాయాలు తీసుకోవాలి అనుకుందాం! దాన్ని మ‌రింత‌గా విభజించుకుని ప్ర‌తి ప‌దిహేను నిమిషాల‌కు ఇద్ద‌రు ముగ్గురుని అనుకోండి. ఆ పావుగంట విరామం లేకుండా ప‌నిచేయండి. త‌ర్వాత ఓ మూడు నిమిషాలు విశ్రాంతి తీసుకోండి!.

Share link

Leave a Comment