harassment case:చిత్తూరు: దళిత, గిరిజన సంఘాల మహిళా సభ్యురాలపై నాలుగేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్న సీఐ ఆమె చిన్నపాటి కూలీలకు, దళితుల మరియు గిరిజన సంఘాల్లో ఒక మహిళా సభ్యురాలిగా ఉన్నారు. వారి సమస్యలపై అటు అధికారులను, పోలీసులను బాధితుల పక్షాన నిలబడి తరుచూ కలిసేవారు. ఇది ఆసరాగా చేసుకున్న ఓ సీఐ ఆ మహిళపై లైంగిక వేధింపుల(harassment case)కు పాల్పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సంవత్సరాల నుండి ఈ వేధింపులు చవిచూసిన మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది.
చిత్తూరు జిల్లా బాకారాపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఈబీ సిఐ గా విధులు నిర్వర్తిస్తున్న మోహన్‌పై మంగళవారం లైంగిక కేసు నమోదయ్యింది. నాలుగేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నాడని చిన్నగొట్టిగల్లు మండలం భాకారా పేట బీసీ కాలనికి చెందిన పి.శారద అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శ్వేత కేసు నమోదు చేశారు.
పి.శారత వ్యవసాయ కూలీ, దళిత, గిరిజన సంఘాల్లో సభ్యురాలిగా ఉన్నారు. సభ్యుల సమస్యలపై ఆమె తరుచూ అధికారులను కలిసేవారు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలు క్రితం ఎస్టీ సంఘాల ద్వారా బి.కొత్తకోట ఎస్ఈబీ సిఐగా పనిచేస్తున్న మోహన్ చిత్తూరు కలెక్టరేట్ వద్ద పరిచయమయ్యారు. సంఘాల ద్వారా ఆమె ఫోను నెంబరు తీసుకుని అసభ్య పదజాలంతో మాట్లాడేవారు. దీనిపై ఆమె సీఐ మోహన్‌కు వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుంచి ఫోన్ చేయలేదు.
అనంతరం తన భర్త, పిల్లలు లేని సమయంలో ఫోను చేసి ఇంటి వద్దకు వస్తున్నానని చెప్పి భయాందోళనకు గురిచేస్తున్నారని, ఈ వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె ఫిర్యాదు చేశానన్నారు. ఈ మేరకు ఎస్ఈబీ సీఐపై 345 డీ, 509 ఐపీసీ సెక్షన్(ipc section 509) కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్వేత తెలిపారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?