Hands

Hands: అంద‌మైన చేతుల త‌ళ‌త‌ళా మెర‌వాలంటే ఇలా చేయండి!

Share link

Hands | మ‌న‌లో చాలామంది ముఖం అందంగా క‌నిపించాలని ఎక్కువుగా తాప‌త్ర‌య ప‌డుతుంటారు. అయితే శ‌రీరంలో భాగ‌మైన చేతులు కూడా చూప‌రుల‌ను ఆక‌ర్షించేలా ఉంటే ఎంతో బాగుంటుంది. దీనికి కొన్ని హోమ్‌మేడ్ టిప్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే Hands ఎంతో నాజుగ్గా అందంగా క‌నిపిస్తాయి.

ఆక‌ర్షించే చేతుల కోసం!

రోజూ రాత్రి నిద్ర‌పోవ‌డానికి ముందు గ్లిజ‌రిన్‌, రోజ్‌వాట‌ర్ రెండింటినీ కలిపి ఆ మిశ్ర‌మాన్ని చేతుల‌కు రాసుకోవాలి. ఇలా చేస్తే Hands ఎంతో మృదువుగా ఉంటాయి. ద‌ళ‌స‌రిగా ఉండే చేతుల‌కు పెట్రోలియం జెల్లీని కార్పోలిక్ Acidతో క‌లిపి రోజూ రాసుకోవాలి. చిన్న గ్లిజ‌రిన్ బాటిల్ తీసుకుని అందులోని గ్లిజ‌రిన్ని గుడ్డులోని తెల్ల‌సొన‌తో క‌ల‌పాలి. గ్లిజ‌రిన్ ఎంతుందో అంతే పాళ్ళ‌ల్లో తేనె అందులో వేయాలి. ఆ మిశ్ర‌మాన్ని చేతులకు రాసుకోవాలి.

గుడ్డులోని ప‌చ్చ‌సొన‌ను ఒక గిన్నెలో పోసి అందులో బాదంపొడి వేసి బాగా క‌ల‌పాలి. దానికి కొద్దిగా రోజ్‌వాట‌ర్‌, నిమ్మ‌ర‌సాన్ని కూడా జోడించాలి. ఆ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపి చేతుల‌కు రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చేతులు ఎంతో అందంగా, మృదువుగా త‌యార‌వుతాయి. చేతి కండ‌రాల‌కు రిలీఫ్ ఇవ్వాలంటే 20 నిమిషాల‌పాటు వాటిని గోరువెచ్చ‌ని నీటిలో ఉంచాలి. ఎండ‌లోకి వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా Sun Block Creamను వాడాలి.

చేతి వేళ్లు అందంగా క‌నిపించాలంటే గోళ్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క‌ట్ చేయాలి. అలా కాకుండా వాటిని పెంచితే గోళ్ల‌ల్లో మ‌ట్టి దూరి చూడ‌టానికి అస‌హ్యంగా ఉంటాయి. వ‌య‌సు పెరిగే కొద్దీ చేతులు జాయింట్ వాస్తుంటాయి. దీంతో చేతులు చూడ‌టానికి బాగుండ‌వు. అవి వాచిన‌ట్టు ఉండ‌కుండా ఉండేందుకు నిత్యం చేతుల‌తో Exercises చేయాలి. అర‌చేతుల‌ను ఒక‌దానిపై ఒక‌టి వేసి రుద్దిన‌ట్టు చేయాలి. ఈ ఎక్స‌ర్‌సైజును రోజుకు క‌నీసం ఐదు నిమిషాలు చేయాలి. అలాగే చేతివేళ్ల‌ను ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి కొద్దిగా లాగిన‌ట్టు చేయాలి. ఇలా చేస్తే అవి చిటుకు చిటుకు అంటాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల చేతుల‌కు ఎంతో రిలాక్సింగ్‌గా ఉంటుంది.

Hands అందంగా క‌నిపించాలంటే మ‌రొక కిటుకు కూడా ఉంది. కొన్ని ప‌చ్చిపాలు తీసుకుని దానికి నిమ్మ‌ర‌సం, తేనె జోడించి చిక్క‌గా పేస్టులా చేయాలి. త‌ర్వాత ఆ మిశ్ర‌మాన్ని చేతుల‌కు రాసుకోవాలి. ఇలా చేస్తే చేతులు ఎంతో అందంగా ఉంటాయి.

how to get glowing hands:అందం ముఖానికే కాదు..చేతుల‌ది కూడా!

how to get glowing handsమ‌న‌లో చాలా మంది ముఖం అందంగా క‌నిపించాల‌ని ఎక్కువుగా తాప‌త్ర‌య ప‌డుతుంటారు. అయితే శ‌రీరంలో భాగ‌మైన చేతులు కూడా చూపరుల‌ను ఆక‌ర్షించేలా Read more

warts remove tips:పులిపిరి కాయ‌లతో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ చిట్కాల‌తో మ‌టుమాయం!

warts remove tips పులిపిరి కాయ‌ల‌ను వార్ట్స్ అని పిలుస్తుంటారు. జ‌నాభాలో ప‌ది శాతం మందికి పులిపిరులు ఉంటాయి. పులిపిరుల‌కు ప్ర‌ధాన కార‌ణం వైర‌స్‌. ఇవి చ‌ర్మం Read more

Walking Style: హంస న‌డ‌క‌దాన్నా..! నువ్వు న‌డుస్తు ఉంటే నిల‌వ‌దు నా మ‌న‌సే!

Walking Style | నేను మోనార్క్‌ని న‌న్నేవ‌రేం చెయ్య‌లేరు..అన్న‌ట్టు బోర విరుచుకుని వ‌డివ‌డిగా అడుగులేసే వారూ, ప్ర‌పంచ భారాన్నంతా మోస్తున్న‌వారిలా భుజాలు కుంచించుకుపోయిన‌ట్టు న‌డిచే మ‌ధ్య త‌ర‌గ‌తి Read more

Simple Health Tips: మంచి ఆరోగ్యం కోసం సింపుల్ హెల్త్ టిప్స్ మీకోసం!

Simple Health Tips | ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. కాబ‌ట్టి ఆరోగ్యం విష‌యంలో నిత్యం జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉండాలి. ప్ర‌స్తుత కాలంలో ఏదో ఒక ఆరోగ్య స‌మ‌స్య వెంటాడుతూనే Read more

Leave a Comment

Your email address will not be published.