Hamsaladeevi beach closeఅవనిగడ్డ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో హంసలదీవి సాగర తీరానికి వెళ్లకుండా పాలకాయతిప్ప కరకట్ట వద్ద పోలీసులు తీరం గేట్లకు గురువారం తాళాలు వేశారు. మెరైన్ సిఐ పవన్ కిషోర్ నేతృత్వంలో సిబ్బంది తీరం వెంట గస్తీ చేపట్టి, అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కార్తీక పౌర్ణమి స్నానాలకు అనుమతి లేదని, పర్యాటకులు ఎవరూ సాగర తీరానికి రావద్దని మైరన్ సిబ్బంది స్పష్టం(Hamsaladeevi beach close) చేశారు.
మూడు రోజుల పాటు తీరంలో నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అందరూ తమకు సహకరించాలని కోరారు. మత్స్య కారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లరాదని పాలకాయతిప్ప గ్రామంలో దండోరా వేయించారు. వాయుగుండం పరిస్థితిపై మండల అధికారులు సైతం ప్రత్యేక దృష్టి సారించారు. తాశిల్దార్ షేక్ లతీఫ్ పాష, ఎంపీడీఓ సుధా ప్రవీణ్ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?