హజ్ యాత్రపై కేంద్ర ప్రభుత్వం సృష్టీకరణ
hajj 2021 latest news in telugu | నెగెటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతి న్యూఢిల్లీ : కరోనా రెండో సారి విజృంభిస్తున్న వేళ హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది.
2021 లో సౌదీ అరేబియాలోని హజ్ కు వెళ్లే యాత్రికులు కోవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పిం చాల్సిందేనని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. యాత్ర కు బయల్దేరే వాళ్లంతా ఈ రిపోర్టులను సమర్పించాలని స్పష్టం చేశారు.


హజ్ కమిటీ, సంబంధిత సంస్థలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హజ్‌కు వెళ్లాలనుకునే వారు డిసెంబర్ 10లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో హజ్ మొబైల్ యాప్‌లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆర్టి-పీసీఆర్ పరీక్ష చేయించి విమానం ఎక్కడానికి 72 గంటల ముందు తేదీతో ఉన్న రిపోర్టును సమర్పించాలని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలోనే దీన్ని తప్పనిసరి చేసినట్టు చెప్పారు. గతంలో దేశంలోని 21 చోట్ల నుంచి హజ్ యాత్ర ప్రారంభం కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దీన్ని 10 ప్రాంతాలకు కుదించినట్టు నఖ్వీ చెప్పారు. ఎయిరిండియా, ఇతర సంస్థల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గత కొంతకాలంగా కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ తాజాగా మరో 50,357 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా భారి నుండి బయటపడి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం సానుకూలంగా ఉంది. గత 24 గంటల్లో 50,356 కొత్త కేసులు రాగా, 53,920 మంది కోలుకొని డిశ్చార్జి కావడం గమనార్హం.
దాదాపు గత ఐదు వారాలుగా దేశంలో ఇదే ట్రెండ్ కొనసాగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో భారత్ లో క్రియాశీల కేసుల్లో (యాక్టివ్ కేసులు) తగ్గుదల కనబడుతున్నట్టు పేర్కొంది. అక్టోబర్ తొలి వారం నాటికి దేశంలో సగటున 73 వేల కేసులు ఉన్నప్పటికీ ఆ సంఖ్య 46 వేలకు తగ్గుతూ వచ్చింది. కానీ శుక్రవారం మళ్లీ కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు సంఖ్య 5,16,632 కి చేరింది. ఇవికూడా చదవండి : అక్కడ ఆటో ఎక్కుతున్నారా జాగ్రత్త!
రికవరీ ఎక్కవుగా ఉన్న రాష్ట్రాలు
గడిచిన 24 గంటల్లో వైరస్ నుంచి కోలుకున్నవారిలో 79 శాతం మంది 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 11,060 మంది కోలుకోవడంతో అక్కడ ఇప్పటిదాకా రికవరీ అయిన వారి సంఖ్య 15,62,342 కి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ(7854), ఢిల్లీ(6121) ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 92.41% ఉండగా, 18 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా అధికంగా రికవరీ రేటు ఉంటం విశేషం.ఇవికూడా చదవండి : కృష్ణా జిల్లాలో ఆధార్ అక్రమాలు!