Core Web Vitals Assessment: hair stem cell therapy: బ‌ట్ట‌త‌లకు కార‌ణాలు తెలిస్తే అస‌లు అది స‌మ‌స్యే

hair stem cell therapy: బ‌ట్ట‌త‌లకు కార‌ణాలు తెలిస్తే అస‌లు అది స‌మ‌స్యే కాదంట‌!

hair stem cell therapy ముఖార‌విందాన్ని పెంచేవి శిరోజాలే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బ‌ట్ట‌త ఉన్న వారు ఒక‌ర‌క‌మైన ఆత్మ‌న్యూన‌తా భావానికి గురై త‌మ వృత్తిలోనూ ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గ‌లేక‌పోతారు. అయితే బట్ట‌త‌ల ఉన్న వారు ఇప్పుడు బాధ ప‌డుతూ కూర్చోవాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే స్టెమ్ సెల్ థెర‌పీతో బ‌ట్ట‌త‌ల‌పై ఒత్తైన జుట్టు మొలిపించేలా చేయ‌వ‌చ్చు అని అంటున్నారు (hair stem cell therapy)కాస్మెటాలజిస్టులు.

పురుషుల్లో బ‌ట్ట‌త‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్న డీహెచ్‌టి హార్మోన్‌, స్త్రీల‌లో జుట్టు రాలిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్న హార్మోన్ల అస‌మ‌తుల్య‌త జుట్టు కుదుళ్ల‌లోని మూల‌క‌ణాల (స్టెమ్‌సెల్స్‌) ను నిర్జీవం చేస్తున్న‌ట్టుగా ప‌రిశోధ‌న‌లో తేలింది. అయితే నిర్జీవ‌మ‌వుతోన్న మూల‌క‌ణాల‌ను పునురుత్తేజం చేస్తే బ‌ట్ట‌త‌ల‌కు అడ్డుక‌ట్ట వేసే వీలుంది. ఇందుకు స్టెమ్‌సెల్ ఇంజెక్ష‌న్స్‌, సెల్యుల‌ర్ మెడిసిన్‌లు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

జుట్టు రాలుతుందా?

జుట్టు రాల‌డానికి మాన‌సిక ఒత్తిడి, పోషకాహార లోపం, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్స్ ద్వారా కూడా రాల‌డం జ‌రుగుతుంది. చిన్న చిన్న జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం, హెయిర్ థెర‌పీల‌తో స‌రిచేయ‌వ‌చ్చు. కానీ హార్మోన‌ల్ ఇన్ బ్యాలెన్స్ వ‌ల్ల క‌లిగే హెయిర్‌ఫాల్ ను మాత్రం చాలా సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. మ‌గ‌వారిలో బ‌ట్ట‌త‌ల‌కు ముఖ్య కార‌ణం హెరిడిట‌రీగా పేర్కొనవ‌చ్చు. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇన్ బాల్యెన్స్ కూడా బ‌ట్ట‌త‌ల‌కు కార‌ణ‌మవుతుంది. ఈ హార్మోన్ కొన్ని కెమిక‌ల్ రియాక్ష‌న్స్ వ‌ల్ల ర‌క్తంలోని ఆండ్రోజెన్స్‌తో క‌లిసి డీహెచ్‌టిగా మారుతుంది. డిహెచ్‌టి అన‌గా డైహైడ్రోటెస్టోస్టిరాన్ హార్మోన్‌. ఈ హార్మోన్ అధికంగా ఉత్ప‌త్తి అయిన వారిలో బ‌ట్ట‌త‌ల త్వ‌ర‌గా వ‌స్తుంది.

అంతేకాకుండా త‌ల‌లోని ఫ్రంట‌ల్ బోన్ ఏరియాలోని జుట్టు కుదుళ్ల‌ని త‌న శ‌త్రువుగా భావించి క్ర‌మేపీ నాశ‌నం చేస్తూ కుదుళ్ల‌లోని మూల‌క‌ణాల‌ను నిర్జీవం చేస్తుంది. అందుకే బ‌ట్ట‌త‌ల వ‌చ్చే వారిలో మొద‌ట జుట్టు ప‌లుచ‌బ‌డిన త‌ర్వాత మాత్ర‌మే రాలిపోతుంది. అయితే ఇది 18 సంవ‌త్స‌రాల త‌ర్వాత మాత్ర‌మే జ‌రుగుతుంది. కాబ‌ట్టి హెయిర్ ఫాల్ మొద‌లైన వెంట‌నే జాగ్ర‌త్త ప‌డి డీహెచ్‌టి ఫామ్ కాకుండా మందులు తీసుకుంటూ, నిర్జీవం అయిన జుట్టు కుదుళ్ల కోసం స్టెమ్‌సెల్ చికిత్స తీసుకోవ‌డం ద్వారా మ‌ళ్లీ జుట్టును పొంద వ‌చ్చు. బ‌ట్ట‌త‌ల‌ను ఏడు ఫేజులుగా వ‌ర్గీక‌రించ‌డం జ‌రిగింది.

ఈ ఏడు ఫేజుల‌లో 5వ ఫేజ్ వ‌ర‌కు స్టెమ్‌సెల్ చికిత్స ద్వారా జుట్టు తిరిగి మొలిచేలా చేయ‌వ‌చ్చు. జుట్టు ఊడిపోయిన‌ప్ప‌టికీ హెయిర్ రూట్ లోప‌ల రెండు మూడేళ్ల‌పాటు ఉంటుంది. ఆ స‌మ‌యంలో స్టెమ్‌సెల్ చికిత్స తీసుకుంటే తిరిగి జుట్టు పెరుగుతుంది. కొంత‌మంది స్త్రీల‌లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్ర‌భావం వ‌ల్ల జుట్టు రాల‌డం జ‌రుగుతుంది. దీనిని డిప్యూజ్ పాట‌ర్న్ బాల్డ్‌నెస్ అంటారు. స్త్రీల‌లో థైరాయిడ్ స‌మ‌స్య‌, టెలొజెన్ ఎప్లూవియం ద్వారా కూడా జుట్టు కుదుళ్లు దెబ్బ‌తిన‌డం జ‌రుగుతుంది.

థైరాయిడ్‌, హార్మోన‌ల్ ఇన్ బ్యాలెన్స్‌

స్త్రీల‌లో థైరాయిడ్ స‌మ‌స్య‌లు అన‌గా హైపోథైరాయిడ్‌, హైప‌ర్‌థైరాయిడ్ కండీష‌న్ వ‌ల్ల‌, ప్రొజెస్టిరాన్ మందులు గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు వాడ‌టం వ‌ల్ల హార్మోన్ల అస‌మ‌తుల్య‌త ఏర్ప‌డి కుదుళ్లు నిర్జీవంగా మార‌తాయి.

టెలొజెన్ ఎప్లూవియం

స్త్రీల‌లో క‌లిగే హెయిర్ ఫాల్‌లో టెలొజెన్ ఎప్లూవియం ప్ర‌ధాన‌మైన‌ది. ఇది జుట్టు లైఫ్‌సైకిల్‌తో అస‌మాన‌త‌ల వ‌ల్ల ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. అస‌మాన‌త‌లు అంటే బ‌యోలాజిక‌ల్ షాక్ వ‌ల్ల లైఫ్ సైకిల్‌లో మొద‌టి ద‌శ‌లో ఉండాల్సిన హెయిర్ ఫాలికిల్స్ రెస్టింగ్ ఫేజ్‌లోకి అంటే చివ‌రి ద‌శ‌లోకి వెళ‌తాయి. ఈ స‌మ‌స్య ఉన్న వారిలో రోజుకు 300 వ‌ర‌కు శిరోజాలు రాలిపోతుంటాయి.

చికిత్స విధానం

చికిత్స‌లో మొద‌టి అంకం నిర్థార‌ణ‌. హెయిర్ ఫాల్‌కు కార‌ణాన్ని తెలుసుకుని దానిక‌నుగుణ‌మైన చికిత్స అందించ‌డం జ‌రుగుతుంది. ఈ చికిత్స‌తో పాటు స్టెమ్‌సెల్ ట్రీట్‌మెంట్ ఇవ్వ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది. ఈ విధానంలో క్ల‌యింట్ ఫ్యాట్ టిష్యూ లేదా బ్ల‌డ్ టిష్యూ నుంచి సేక‌రించిన మూల‌క‌ణాల‌ను, గ్రోత్ ఫ్యాక్టర్స్‌ని క‌చ్చిత‌మైన సైంటిఫిక్ ప‌ద్ధ‌తి ద్వారా వేరు చేయ‌డం జ‌రుగుతుంది. హెయిర్ రూట్‌ను పున‌రుత్తేజం చేయ‌డానికి మొద‌ట హైఫ్రీక్వెన్సీ ద్వారా త‌ల‌లోని హెయిర్ ఫోర్స్‌ను ఓపెన్ చేయించి వాటి ద్వారా హెర్బ‌ల్ ఆయిల్స్‌తో థెర‌పీ చేసి ఆర్.ఎఫ్ లేజ‌ర్ లైట్‌తో కుదుళ్ల‌లో చ‌ల‌నం క‌లిగించ‌డం ద్వారా హెయిర్ రూట్ స్టిమ్యులేష‌న్ చేయ‌డం జ‌రుగుతుంది. త‌ర్వాత శుభ్రంగా క‌డిగి మూల‌క‌ణాల‌ను నిర్జీవ‌మైన జుట్టు కుద‌ళ్ల‌లోకి ఇంజెక్ట్ చేయ‌డం జ‌రుగుతుంది. ఈ ట్రీట్‌మెంట్‌కు దాదాపు 2 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

స‌ర్జిక‌ల్ విధానం

డీహెచ్ఐ (డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేష‌న్‌). ఇది స‌ర్జ‌రీ విధానం. పూర్తిగా బ‌ట్ట‌త‌ల వ‌చ్చినా, 6 లేక 7వ ఫేజ్‌లో ఉన్న వారికి ఇది ఒక వ‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌ద్ధ‌తిలో స్ట్రిప్ క‌ట్ చేయ‌డం, రూట్ క‌ల్చ‌ర్ చేయ‌డం ఉండ‌దు. నేరుగా త‌ల వెనుక భాగంగా నుంచి హెయిర్ మిష‌న్ ద్వారా జుట్టును సేక‌రించి డైరెక్ట్‌గా ఇంప్లాంట్ చేయ‌డం జ‌రుగుతుంది. స్ట్రిప్ పద్ధ‌తిలో కల్చ‌ర్ చేసేట‌ప్పుడు రూట్ డ్యామేజ్ జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. కానీ ఈ ప‌ద్ధ‌తిలో మిష‌న్ ద్వారా చేయ‌డం వ‌ల్ల న‌ష్టం ఉండ‌దు. ఈ ప‌ద్ధ‌తిలో రోజుకి 1500 హెయిర్ ఫాలికిల్స్‌ని ఇంప్లాంట్ చేయ‌వ‌చ్చు. బ‌ట్ట‌త‌ల వ‌చ్చింద‌ని బాధ‌ప‌డుతూ కూర్చోకుండా నిపుణ‌లైన కాస్మెటిక్‌స‌ర్జ‌న్‌ను సంప్ర‌దిస్తే తిరిగి ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *