hair loss: టీనేజీలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ఏదో ఒక సందర్భంలో ప్రతీ ఒక్కరికీ ఎదురయ్యే సమస్య జుట్టు ఊడిపోవడం. అయితే అన్ని సార్లూ పోషకాల లేమి, ఇతర అనారోగ్యల వల్లే ఇలా కాకపోవచ్చు. మనం తప్పిదాలూ అందుకు కారణం కావచ్చు. జుట్టు (hair loss) రాలిపోవడానికి గల కారణాలేమిటో ఇప్పుడు చూద్ధాం!.
hair loss: జుట్టు రాలిపోవడానికి కారణం
కొందరు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో రోజూ తల స్నానం చేస్తుంటారు. అలా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. షాంపూల్లోని రసాయనాల ప్రభావం జుట్టు, కుదుళ్ల మీద పడుతుంది. ఎదుగుదల ఉండకపోగా బాగా రాలిపోతుంది. సమయం లేక ఇంకొందరు సరిగా తలస్నానం చేయరు. అసలు జుట్టును ఏమాత్రమూ పట్టించుకోరు. దానివల్ల జుట్టు ఎండుగడ్డిగా మారుతుంది ఊడిపోతుంది.
జుట్టు రాలిపోవడానికి (hair loss) కారణం శారీరక ఒత్తిడి కూడా ముఖ్యమైనది. అదే విధంగా ప్రోటీన్ల లోపం వల్ల కూడా చాలా మందిలో జుట్టు రాలిపోవడానికి గల ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వారు తగినంతగా ప్రోటీన్తో కూడిన ఆహారం తీసుకోకపోవడమే. ఈ ప్రోటీన్లే ప్రధానంగా జుట్టు పెరుగుదలకూ, దెబ్బతిన్న జుట్టు తాలూకు రిపేర్లకు దోహదపడతాయి. మనం నిత్యం ఎదుర్కొనే శారీరక ఒత్తిళ్లు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని టిలోజెన్ ఎప్లూవియమ్ అంటారు. ఈ దశలో జుట్టు ఉడిపోయే దశ అయిన Tilogen దశలోకి జుట్టు వెల్లిపోతుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలో తెల్లని పదార్థం పచ్చి పచ్చిగా కాకుండా, బాగా ఎండిపోయినట్టుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు.
జుట్టు తత్వాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. వారంలో తప్పనిసరిగా రెండు సార్లు తలస్నానం చేయాలి. అంతేకాదు చేసిన ప్రతీసారీ ఎక్కువ నీళ్లతో కడిగేసుకోవాలి. లేదంటే షాంపుల్లో రసాయనాలు అలానే ఉండిపోయి జుట్టు ఎదుగుదలకు అడ్డు పడతాయి. బిగుతుగా జడ అల్లుకోవడం, రబ్బరు బ్యాండ్ పెట్టుకోవడం, బలంగా లాగి ముడివేయడం, ఎక్కువ పిన్నులు పెట్టడం లేదంటే పూర్తిగా వదిలేయడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల జుట్టు రాలిపోతుంది. అలా కాకుండా కాస్త వదులుగా జడ వేసుకోవడం మంచిది.


hair loss: కొన్ని చిట్కాలు!
ఉసిరిపొడి చేసుకోండి. అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్ని రోజూ తలకు పూసుకుని రెండు గంటలాగి తలస్నానం చేయండి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఉల్లి గడ్డను మెత్తగా మిక్సీ చేయాలి. ఈ పేస్టును తెల్ల వెంట్రుకలు ఉన్న చోట రాయండి. రెండు గంటలు ఆగి తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరుచుగా చేయాల్సి ఉంటుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలపాలి. రోజు ఈ రసం తలకు పూసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.
నువ్వులను మిక్సీలో వేసి పేస్టు చేయాలి. ఇందులో బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్నితరుచుగా తలకు రాస్తుండాలి. రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే కూడా జుట్టు నల్లబడుతుంది. ఫుడ్‌లో ప్రోటీన్స్, విటమిన్ బి12 ఎక్కువుగా ఉండాలి.కరివేపాకు-కొబ్బరి నూనెతో తయారు చేసే ప్యాక్ తెలుపు జుట్టుకు చెక్ పెడుతుంది. కొబ్బరి నూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత మీ తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నెరిసిపోకుండా ఉండేందుకు ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.