hair henna benefits సహజంగా జుట్టు రంగుని కాపాడుకోవానికి వాడేది హెన్నా. దీన్ని వాడటం వల్ల జుట్టు కెంతో మేలు జరుగుతుంది. నెలకి రెండు సారు్ల హెన్నా పెట్టుకుని తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు బలంగా ఎదుగుతాయి. జుట్టు మృదువుగా మారుతుంది. హెన్నాలో ఉసిరి పొడి కలిపి రెండు గంటలు నానబెట్టాక జుట్టుకి(hair henna benefits) రాసుకుంటే ఇంకా మంచిది.
మంచి కండీషనర్‌లా henna!
హెన్నా జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. జుట్టులోని తేమని బయటకు పోనీయకుండా కాపాడుతుంది. రసాయనాలు లేని సహజమైన గోరింటాకు పొడి జుట్టుకు మంచి ఎరుపు రంగుని అందిస్తుంది. మరుగుతున్న నీళ్లలో రెండు టీస్పూన్ల ఉసిరి పొడి, ఒక టీ స్పూన్ బ్లాక్ టీ, రెండు లవంగాలు వేయాలి. అలా కాచిన నీటిని చల్లార్చి, వడకట్టాక ఆ నీటిలో హెన్నా వేసి మిశ్రమంలా చేసుకోవాలి.

చుండ్రు సమస్య పోవాలంటే!
హెన్నా వేసి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని తలకి రాసుకుని ఓ గంటాగి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే క్రమంగా జుట్టు నల్లగా మారుతుంది. చుండ్రు సమస్య తగ్గాలంటే రెండు చెంచాల మెంతుల్ని రాత్రంతా నానబెట్టి, ఉదయం పేస్టులా చేయాలి. ఆవనూనెలో కొన్ని గోరింటాకులు వేసి వేడిచేసి చల్లార్చాలి. దీంతో బాటు మరికొంచెం గోరింటాకు పొడిని దానికి కలపుకుని పేస్టులా చేసి మాడుకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!